కారు మైలేజ్ పెరగాలంటే ఎంత స్పీడుగా వెళ్లాలో తెలుసా ? ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే బోలెడు డబ్బులు ఆదా

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో కారు ఉన్న ప్రతి ఒక్కరినీ వేధించే మెయిన్ ప్రాబ్లమ్ మైలేజ్. షోరూమ్ వాడు చెప్పినప్పుడు లీటరుకు 20 కిలోమీటర్లు వస్తుందన్న కారు, రోడ్డు మీదకు వచ్చేసరికి 12 లేదా 13 దగ్గరే ఆగిపోతుంటుంది. అసలు కారు ఎంత స్పీడ్‌లో వెళ్తే మంచి మైలేజ్ వస్తుంది? నెమ్మదిగా వెళ్తే ఇంధనం ఆదా అవుతుందా? లేక టాప్ గేర్‌లో దూసుకుపోతే కలిసి వస్తుందా? ఇలాంటి సందేహాలకు సమాధానంతో పాటు, మీ జేబుకు చిల్లు పడకుండా ఉండటానికి పాటించాల్సిన రూల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

మైలేజ్ కోసం అసలైన మ్యాజిక్ స్పీడ్ ఏది?
కారు ఎంత వేగంతో వెళ్తే ఎక్కువ మైలేజ్ ఇస్తుందనే అంశంపై వాహన నిపుణులు అనేక పరిశోధనలు చేశారు. మెజారిటీ పెట్రోల్, డీజిల్ కార్లకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగం అనేది అత్యంత అనువైనది. హైవేపై మీరు కారును ఐదో గేర్ లేదా ఆరో గేర్‌లో (టాప్ గేర్) వేసి, 70-80 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో వెళ్తున్నప్పుడు ఇంజన్ చాలా తక్కువ ఒత్తిడికి లోనవుతుంది.

What Is the Best Speed for Maximum Car Mileage Experts Reveal

ఈ సమయంలో ఇంధనం దహనం అయ్యే ప్రక్రియ అత్యంత సమర్థవంతంగా జరుగుతుంది. ఫలితంగా కారు గరిష్ట మైలేజీని ఇస్తుంది. ఒకవేళ మీరు వేగాన్ని 100 కిలోమీటర్లు దాటిస్తే, గాలి నిరోధకత (Air Resistance) పెరిగి, కారు ముందుకు వెళ్లడానికి ఇంజన్ మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల మైలేజ్ ఒక్కసారిగా 15 నుంచి 20 శాతం పడిపోతుంది.

సిటీ డ్రైవింగ్‌లో జాగ్రత్తలు
హైవేపై లాగా సిటీలో 80 స్పీడ్ వెళ్లడం అసాధ్యం. ట్రాఫిక్ సిగ్నల్స్, బంకర్లు, పాదచారుల వల్ల మనం మాటిమాటికీ బ్రేకులు వేయాల్సి వస్తుంది. సిటీలో మంచి మైలేజ్ రావాలంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, స్థిరమైన గేర్‌లో ప్రయాణించడం ఉత్తమం. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం సడన్ ఎక్సిలరేషన్.

What Is the Best Speed for Maximum Car Mileage Experts Reveal

సిగ్నల్ పడగానే ఒక్కసారిగా రేస్ చేయడం వల్ల ఇంజన్ భారీగా పెట్రోల్‌ను మింగేస్తుంది. అలాగే, అవసరం లేకపోయినా బ్రేకులు వేస్తూ ఉంటే, మళ్ళీ కారును స్పీడ్ అందుకోవడానికి ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. అందుకే ముందు వెళ్తున్న వాహనానికి సరైన దూరం పాటిస్తూ, సాఫీగా డ్రైవ్ చేయడం అలవాటు చేసుకోవాలి.

గేర్లు మార్చేటప్పుడు పొరపాట్లు వద్దు
చాలామంది చేసే తప్పు ఏమిటంటే.. తక్కువ స్పీడ్‌లో ఉన్నప్పుడు కూడా పెద్ద గేర్‌లో కారును లాగడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల ఇంజన్ నుంచి వింత శబ్దాలు రావడం మాత్రమే కాదు, ఇంధనం వృథా అవుతుంది.

అలాగే హై స్పీడ్‌లో ఉండి కూడా చిన్న గేర్‌లో డ్రైవ్ చేయడం వల్ల ఇంజన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఏ వేగంలో ఏ గేర్ ఉండాలో గమనిస్తూ డ్రైవ్ చేస్తే మైలేజ్ అద్భుతంగా ఉంటుంది. నేటి కాలంలో వచ్చే ఆధునిక కార్లలో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా ఉంటోంది. దానిని గమనిస్తూ గేర్లు మార్చడం వల్ల మైలేజీని సులభంగా పెంచుకోవచ్చు.

ఏసీ వాడకం.. టైర్ ప్రెజర్ ముఖ్యం
వేసవి కాలంలో ఏసీ లేకుండా ప్రయాణం కష్టం. కానీ, మీరు సిటీలో తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు ఏసీని తక్కువ పాయింట్లలో ఉంచడం లేదా అవసరం లేనప్పుడు ఆపివేయడం వల్ల మైలేజ్ కలిసి వస్తుంది. అయితే, హైవేపై వెళ్తున్నప్పుడు మాత్రం కిటికీలు తెరిచి ఉంచడం కంటే ఏసీ వేసుకోవడమే మంచిది.

What Is the Best Speed for Maximum Car Mileage Experts Reveal

ఎందుకంటే కిటికీలు తెరిచి ఉంటే బయటి గాలి కారులోకి చొరబడి వేగాన్ని అడ్డుకుంటుంది (Aerodynamics), దీనివల్ల ఇంజన్‌పై భారం పడుతుంది. అలాగే, కారు టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్డుకు, టైరుకు మధ్య ఘర్షణ పెరిగి ఇంజన్ ఎక్కువ పవర్ వాడాల్సి వస్తుంది. నెలకొకసారి ఖచ్చితంగా టైర్ ప్రెజర్ చెక్ చేయించుకోవాలి.

మెయింటెన్సులో రాజీ వద్దు
మీరు ఎంత బాగా డ్రైవ్ చేసినా, కారు మెకానికల్ కండిషన్ బాలేకపోతే మైలేజ్ రాదు. ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ క్రమం తప్పకుండా మార్చాలి. ఇంజన్ ఆయిల్ నాణ్యమైనది వాడాలి. కారు సర్వీసింగ్ సమయానికి చేయిస్తే ఇంజన్ భాగాలు సాఫీగా పనిచేసి తక్కువ ఇంధనాన్ని తీసుకుంటాయి. ఒక చిన్న చిట్కా ఏమిటంటే.. కారులో అనవసరమైన బరువును తగ్గించండి.

డిక్కీలో పనికిరాని వస్తువులు, భారీ లగేజీ ఉండటం వల్ల కూడా మైలేజ్ తగ్గుతుంది. మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి, గూగుల్ మ్యాప్స్ వాడి ట్రాఫిక్ లేని రూట్లను ఎంచుకోండి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ కారు మైలేజీని సులభంగా 20 నుంచి 30 శాతం వరకు పెంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, February 9, 2026, 10:41 [IST]
English summary
What is the best speed for maximum car mileage experts reveal
Read more on: #offbeat #milage #car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+