కారులో ప్రశాంతంగా ప్రయాణం చేయాలనుకుంటున్నారా.. కారు సౌండ్‌ డంపింగ్‌ షీట్ల గురించి తెలుసుకోండి..!

సాధారణంగా కార్లను కొనుగోలు చేసిన తర్వాత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కొన్ని రకాల ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్‌ ఛార్జర్లు, కారులోపలి భాగం శుభ్రంగా ఉండేలా పుట్‌మ్యాట్‌ల ఏర్పాటు సహా ఇతర ఏర్పాట్లు చేసుకోవాలి. డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు అనవసరమైన సౌండ్లు కారు లోపలికి వినిపించకుండా కొన్ని షీట్లు అందుబాటులో ఉన్నాయి.

అవే కారు సౌండ్‌ డంపింగ్‌ షీట్లు. వాహనం లోపలికి అనవసర శబ్ధాలు వినిపించకుండా ఈ షీట్లు అడ్డుకుంటాయి. అయితే ఈ సీట్లు ఎలా అమర్చుకోవాలి, ధరలు ఎలా ఉంటాయి. నాణ్యమైన వాటిని ఎలా ఎంచుకోవాలి. కారు సౌండ్‌ డంపింగ్‌ షీట్ల పనితీరు ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

car sound damping sheet

కారు సౌండ్ డంపింగ్‌ సీట్లను.. డోర్లు, రూఫ్‌, ఫ్లోర్‌కు ఏర్పాటుచేయవచ్చు. ఈ షీట్లు కారును సౌండ్‌ ఫ్రూఫ్‌గా మారుస్తాయి. సాధారణంగా కార్లను డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో ఇంజిన్‌ సహా ఇతర విభాగాల నుంచి శబ్దాలు వస్తాయి. దీంతోపాటు ఇతర శబ్ధాలు డ్రైవింగ్ చేస్తున్నవారికే కాకుండా ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. ఈ షీట్ల ద్వారా ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.

ఈ సౌండ్‌ డంపింగ్‌ షీట్లు చాలా రకాలు ఉంటాయి. అవసరాలు, బడ్జెట్‌ను బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. తారు, బ్లూటైల్‌, వినైల్‌ ఆధారిత ఉత్పత్తులతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే నిపుణులతో ఈ సౌండ్‌ ఫ్రూఫ్ షీట్లను అమర్చుకోవడం ఉత్తమం. అప్పుడే మెరుగైన పనితీరును కనబరుస్తాయి.

car sound damping sheet

ఈ షీట్లు ఎంత మందంగా ఉంటే అంత మెరుగైన పనితీరును కనబరుస్తాయి. అయితే మందంతోపాటు సౌండ్ డంపింగ్ షీట్ల నాణ్యత కూడా చాలా ముఖ్యం. ఫలితంగా అవాంచనీయ శబ్దాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీంతో మెరుగైన డ్రైవింగ్‌ అనుభూతిని పొందుతారు. ఈ షీట్లు ఆటోమొబైల్‌ విడిభాగాల దుకాణాల్లో లేదా ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.

అయితే ఈ సౌండ్‌ డంపింగ్‌ షీట్లను కొనుగోలు చేసే ముందు కూడా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఫలితంగా నాణ్యమైన షీట్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. సరైన షీట్లతో ట్రాఫిక్‌లో వచ్చే భారీ శబ్ధాలను కూడా నియంత్రించవచ్చు. ప్రశాంతంగా కారులో ప్రయాణించవచ్చు.

అయితే నాణ్యమైన కారు సౌండ్ డంపింగ్ సీట్లతో ఉరుముల శబ్ధాలను కూడా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే సరైన ఎంపిక సహా సరైన పద్ధతిలో అమర్చుకుంటేనే ఇది సాధ్యమని వివరిస్తున్నారు. నాణ్యతా లోపాలున్న డంపింగ్‌ సీట్లను అమర్చినా లేకున్నా పెద్దగా తేడా ఉండదని చెబుతున్నారు. అందువల్ల మార్కెట్లో దొరికేవాటిలో నాణ్యమైనవి ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, September 7, 2023, 11:16 [IST]
English summary
What is the car sound damping sheet how it works
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+