రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆధునిక కార్లలో అనేక స్మార్ట్ ఫీచర్లు లభిస్తున్నాయి. టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన ఈ ఫీచర్లు డ్రైవర్లకు కంఫర్ట్ తో పాటుగా సేఫ్టీని కూడా అందిస్తున్నాయి. సాధారణ కార్లలో ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లు మాత్రమే లభిస్తాయి. కానీ, ఖరీదైన కార్లలో అనేక అదనపు సేఫ్టీ అండ్ స్మార్ట్ ఫీచర్స్ లభిస్తాయి.

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

ఈ అదనపు ఫీచర్ల కోసం కస్టమర్లు కూడా అదనంగానే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ అదనపు ఖర్చు వలన లభించే ఫీచర్లు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాంటి ఫీచర్లలో ఒకటి రెయిన్ సెన్సింగ్ వైపర్స్. వీటినే ఆటోమేటిక్ వైపర్స్ అని కూడా అంటారు.

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

ఈ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఫీచర్ వర్షా కాల సమయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేయబడింది. సాధారణంగా వర్షాకాలంలో కారును నడుపుతున్నప్పుడు మనం వైపర్స్ ను ఉపయోగించాల్సి వస్తే, వాటి స్టీరింగ్ క్రింద ఉండే కంట్రోల్స్ సాయంతో మ్యాన్యువల్ గా నియంత్రించాల్సి ఉంటుంది.

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

అయితే, ఈ ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్న కారులో వైపర్స్ ని మనం మ్యాన్యువల్ గా ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. కారు విండ్‌షీల్డ్ పై వర్షం పడగానే, అక్కడ ఉండే సెన్నార్లు దానిని గుర్తించి ఆటోమేటిక్ గా వైపర్స్ ని ఆన్ చేస్తాయి మరియు వర్షం తగ్గిపోగానే ఇవి తిరిగి ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతాయి. ఒకవేళ ఇలా జరగకూడదని డ్రైవర్ నిర్ణయించుకుంటే, ఈ ఫీచర్ ను డీయాక్టివేట్ చేసే సౌలభ్యం కూడా ఉంటుంది.

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

వినడానికి విచిత్రంగా ఉన్న ప్రస్తుతం, కార్ మార్కెట్లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. నిజానికి, ఈ ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఫీచర్ ను చాలా కాలం క్రితమే కార్లలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ ఫీచర్ చాలా ఖరీదైన లగ్జరీ కార్లలో మాత్రమే లభించేంది. కానీ, ఇప్పుడు చిన్న తరహా మిడ్-సైజ్ కార్లలో కూడా ప్రీమియం ఫీచర్ గా ఇది అందుబాటులో ఉంటుంది. మరి అసలు ఈ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి, అవి ఎలా పని చేస్తాయో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

రెయిన్ సెన్సార్ అంటే ఏమిటి?

ఈ ఫీచర్ ను రెయిన్ సెన్సార్ సిస్టమ్ లేదా సాధారణంగా 'రెయిన్-సెన్సింగ్ విండ్‌షీల్డ్ వైపర్స్' అని పిలుస్తారు. ఇందులో అధునాతన సాంకేతికతతో కూడిన సెన్సార్స్ ఉంటాయి. ఇవి కారు విండ్‌షీల్డ్‌పై తేమను లేదా వర్షపు నీటిని గుర్తిస్తాయి. ఆ వెంటనే సెన్సార్లు యాక్టివేట్ అయి, డ్రైవర్ ప్రమేయం లేకుండానే ఫ్రంట్ విండ్‌షీల్డ్ వైపర్లను ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యేలా చేస్తాయి.

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

ఈ ఫీచర్ వలన కారు లోపల ఉండే డ్రైవర్ యొక్క దృశ్యమానత (విజిబిలిటీ) ఎల్లప్పుడూ మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా ప్రమాదాల నివారించడంలో ఇది సహకరిస్తుంది. ఈ సిస్టమ్ లో డ్రైవర్ వైపర్ బ్లేడ్‌లు తిరిగే రేటు మరియు వేగాన్ని నియంత్రించడానికి వీలు ఉంటుంది. అవసరం లేదనుకున్నప్పుడు ఈ ఫీచర్ ను ఆఫ్ కూడా చేసుకోవచ్చు.

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

రెయిన్ సెన్సింగ్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?

కారు విండ్‌షీల్డ్ పై అమర్చిన సెన్సార్ల సాయంతో ఈ ఫీచర్ పనిచేస్తుంది. సాధారణంగా ఈ సెన్సార్లను కారు యొక్క ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (IVRM) కి దగ్గరగా లేదా దాని పైభాగంలో ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి. ఈ కంట్రోల్ సిస్టమ్ మాడ్యూల్ లైట్ ఎమిటింగ్ డయోడ్‌లను (LED) కలిగి ఉంటుంది మరియు ఇది విండ్‌స్క్రీన్‌పై పరారుణ కాంతి (ఇన్‌ఫ్రారెడ్ లైట్) ని విడుదల చేస్తుంది.

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

గ్లాస్ (ఫ్రంట్ విండ్‌షీల్డ్) స్పష్టంగా ఉన్నప్పుడు, ఈ ఇన్‌ఫ్రారెడ్ లైట్ నుండి విడుదలయ్యే కాంతి విండ్‌స్క్రీన్‌పై ప్రతిబింబించి తిరిగి అదే కాంతిని సెన్సార్‌కు చేరవేస్తుంది. ఈ సందర్భంలో విండ్‌షీల్డ్ క్లియర్‌గా ఉందని మరియు వైపర్లు ఉపయోగించాల్సిన అవసరం లేదని సెన్సార్లు గ్రహిస్తాయి. ఫలితంగా, ఆటోమేటిక్‌గా వైపర్లు ఆన్ కావు.

కానీ గ్లాస్ (ఫ్రంట్ విండ్‌షీల్డ్) మీద నీటి బిందువులు లేదా ధుమ్మ ధూళి ఉన్నప్పుడు, పరారుణ కాంతి పుంజం (ఇన్‌ఫ్రారెడ్ లైట్ బీమ్) విండ్‌షీల్డ్ గుండా ప్రతిబింబించకుండా (రిఫ్లెక్ట్ కాకుండా), దానికి బదులు వాటి గుండా ఆ కాంతి ప్రయాణిస్తుంది. కాబట్టి, సెన్సార్‌కు తిరిగి వచ్చే కాంతి మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో సెన్సార్లు విండ్‌షీల్డ్ మురికిగా లేదా నీటి బింధువులతో కవర్ చేయబడి ఉందని గ్రహించి వైపర్లను ఆటోమేటిక్ గా ఆన్ అయ్యేలా చేస్తాయి.

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

మీ కారులో ఈ ఫీచర్ ఉందో లేదో మీకు తెలుసా?

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఈ ఫీచర్ కొన్ని ప్రీమియం కార్లలోని టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, మీరు ఉపయోగించే ప్రీమియం కారులో ఈ రెయిన్ సెన్సింగ్ వైపర్ ఫీచర్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే, మీరు కారు క్యాబిన్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ దగ్గర సెన్సార్లు ఉన్నాయో లేవో చూడాలి.

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

అక్కడ ఓ ఫిల్మ్ లేదా లెన్స్ లాంటి నిర్మాణం ఉన్నట్లయితే, అలాంటి కార్లలో ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఫీచర్ ఉన్నట్లు అర్థం. అందులో ఒక బార్ జోడించబడి ఉంటుంది మరియు అది ఫ్రంట్ విండ్‌షీల్డ్‌కు ఒక కోణంలో ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఇంకా ఖచ్చితమైన నిర్ధారణకు రావాలంటే, కారుతో పాటుగా మీకు అందించిన ఓనర్స్ మ్యాన్యువల్ ని ఓసారి చదివితే అర్థమవుతుంది.

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ యొక్క ప్రయోజనాలు

ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఓ కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్ గా చెప్పవచ్చు. ప్రత్యేకించి వర్షాకాలంలో ఈ ఫీచర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న హఠాత్తుగా జోరు వర్షం పడినట్లయితే, ఈ వైపర్లు డ్రైవర్ ప్రమేయం లేకుండానే ఆన్ అయ్యి, క్యాబిన్ లోపలి నుండి విజిబిలిటీని పెంచడంలో సహకరిస్తాయి.

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వైపర్లు బయట పడే వర్షానికి తగినట్లుగా పనిచేస్తాయి. అంటే, జోరు వర్షం పడుతున్నప్పుడు వైపర్లు వేగంగా తిరగడం అలాగే, తక్కువ వర్షం పడుతున్నప్పుడు వైపర్లు నెమ్మదిగా తిరగడం జరుగుతుంది. ఈ వైపర్‌ల క్రియాశీలత వేగం మరియు సమయం విండ్‌స్క్రీన్ యొక్క తేమ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో కొన్ని అధునాతన వ్యవస్థలు విండ్‌స్క్రీన్‌పై తేమ స్థాయిని నేరుగా కూడా కొలవగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

Most Read Articles

English summary
What is the rain sensing wiper feature and how it works
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X