Safety Tips కారు వరదల్లో చిక్కుకున్నప్పుడు ఏం చేయాలో తెలుసా...?
దేశంలోని ప్రస్తుతం పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రదేశాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లో కారు వరదల్లో చిక్కుకొనే అవకాశం ఉంటుంది. మీ కారు వరదల్లో చిక్కుకున్నప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది కంగారు పడుతుంటారు.
ఆ సమయంలో ఆందోళన చెందుతుంటారు. మరియు కారును స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించడం చేస్తుంటారు. అలా చేయకుండా ఉండాలి. మరియు సాధారణ బ్రేకులు కాకుండా హ్యాండ్ బ్రేకులు వినియోగించడం కొంత మేలు చేస్తుంది. వరదల సమయాల్లో కారును కాపాడే కొన్ని చిట్కాలు మీకోసం.

ఆందోళన చెందవద్దు: మీ కారు వరదల్లో చిక్కుకున్నప్పుడు, లేదా వరదలు మీ కారును చుట్టుముట్టినప్పుడు ఎంతో భయంకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందకుండా, బయటపడే మార్గాలను చూడాలి. భయాందోళనకు గురైతే జరిగే మేలు కంటే కీడే ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
కారును స్టార్ట్ చేయవద్దు: మీ కారు వరదల్లో చిక్కుకున్నప్పుడు కొందరు కారును స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కారును స్టార్ట్ చేసేందుకు ప్రయత్నం చేయవద్దు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో కారును స్టార్ట్ చేస్తే కారు ఎగ్జాస్ట్ మరియు కారులోని ఎలక్ట్రికల్ విభాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

హ్యాండ్ బ్రేక్‌ను వినియోగించండి: కారు వరదల్లో చిక్కుకున్నప్పుడు లేదా కారును వరదలు చుట్టుముట్టినప్పుడు హ్యాండ్ బ్రేక్‌ను ఉపయోగించండి. మరియు కారు గేర్‌లో ఉందో లేదో ఒకసారి నిర్ధారించుకోండి. ఇలా చేయడం వల్ల భారీ వరదల సమయంలో కారు కొట్టుకుపోకుండా లేదా బోల్తా పడకుండా కాపాడుతుంది.
బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయండి : వరదలలో కారు చిక్కుకున్నప్పుడు.. కారు బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయడం మేలు. వరదల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయండి. లేకుంటే కారులో ఎలక్ట్రిక్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫలితంగా రిపేర్ చేసేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు.
నిపుణుల సాయం తీసుకోండి: ఒకవేళ మీ కారు వరదల్లో చిక్కుకుంటే.. వరదల తగ్గాక సొంత నిర్ణయాలు తీసుకోవడం కంటే.. కారుకు ఎంత నష్టం జరిగిందో తెలుసుకొనేందుకు మరియు ఇతర సలహాలకు నిపుణులను సంప్రదించడం మంచిది. కారులోపల విద్యుత్ వ్యవస్థ సహా ఇతర విభాగాలు దెబ్బతినకుండా చూసేందుకు నేరుగా సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం మేలు.

పైన చెప్పిన చిట్కాలతో వరదల సమయంలో మీ కారును కొంత వరకు సురక్షితంగా ఉంచుకోవచ్చు. మరియు కారు రిపేర్‌లో భాగంగా కొంత డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








