డీజిల్ కారులో పెట్రోల్ నింపేశారా.. తక్షణమే ఇలా చేయండి.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..!
కొన్నిసార్లు పెట్రోల్ కారులో డీజిల్.. డీజిల్ కారులో పెట్రోల్ నింపేస్తారు. పెట్రోల్ కారులో డీజిల్ నింపడం వల్ల పెద్దగా ఇబ్బందులు కలగవు. ఎందుకంటే పెట్రోల్ కంటే డీజిల్ శుద్ధి చేయబడుతుంది. అదే డీజిల్ కార్లలో పెట్రోల్ నింపడం వల్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తీవ్ర ఆందోళన చెందుతారు.
అయితే ఇలాంటి సందర్భాల్లో కారును తక్షణమే మరమ్మతు చేయించాలి. ఫలితంగా ఇంజిన్ డ్యామేజీ కాకుండా ముందే జాగ్రత్తపడొచ్చు. మరమ్మతు ఖర్చులను తగ్గించుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితి చాలా మందికి ఎదురుకావచ్చు. కానీ ఏం చేయాలో తెలియకపోవచ్చు. అలాంటి వారికోసం ఈ కథనం.

మీ కారులో డీజిల్‌కు బదులుగా పెట్రోల్ నింపినట్లయితే.. కారును స్టార్ట్ చేసే ముందే ఈ విషయాన్ని గుర్తిస్తే ఇంజిన్‌ను స్టార్ట్ చేయవద్దు. ఎందుకంటే కారు ఇంజిన్‌ను ప్రారంభించడం వల్ల.. ఇంధనం ఇంజిన్ అంతటా వ్యాపిస్తుంది. ఇది ఇంజిన్‌కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఇంధనం నింపే సమయంలోనే కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి.
డీజిల్ కారులో పెట్రోల్ నింపినట్లు గుర్తిస్తే.. వెంటనే పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బందికి తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి అవగాహన ఉంటుంది. ఫలితంగా తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు. సిబ్బంది తీరును తప్పుబడుతూ సమయం వృథా చేయడం వల్ల ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఎక్కువ.

డీజిల్ కారులో పెట్రోల్ నింపినట్లు గుర్తించిన వెంటనే.. ఆ ఇంధనాన్ని వీలైనంత త్వరగా బయటకు తీసే ఏర్పాట్లు చేయండి. స్థానిక సర్వీస్ సెంటర్లు, గ్యారేజీల్లో ఇటువంటి ఏర్పాట్లు ఉంటాయి. అనంతరం మీ కారులో డీజిల్ నింపిన తర్వాత కారును స్టార్ట్ చేయాలి. కొంత సమయం ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచాలి.
అనంతరం కారు పనితీరు సంతృప్తిగా అనిపించినా కానీ.. సర్వీస్ సెంటర్ నిపుణుడిని సంప్రదించి, కారు ఇంజిన్‌ను తనిఖీ చేయించాలి. అలాంటి సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా.. మరమ్మతు చేసేందుకు వీలుంటుంది. లేకుంటే తర్వాత మరమ్మత్తు చేసేందుకు భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు.

ఇలాంటి సందర్భాల్లో కారు యజమానులు ఎక్కువగా ఆందోళన చెందారు. పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బంది తీరును తప్పుపడుతూ ఉంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. డీజిల్ కారులో పెట్రోల్ నింపినట్లు గుర్తించిన వెంటనే అక్కడున్న సిబ్బంది లేదా సర్వీస్ సెంటర్ నిపుణులను సంప్రదించి తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఫలితంగా ఇంజిన్ సీజ్ కాకుండా ఉంటుంది. లేకుంటే ఇంజిన్ భారీగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








