ఫేస్‌బుక్ వీడియో: ఫార్ములా వన్‌లో మనం మిస్ అయ్యేది..
ఫార్ములా వన్ మోటార్‌స్పోర్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా రూపాంతరం చెందింది. ఎంతో మంది దిగ్గజ రేసర్లు, దిగ్గజ కార్లను మనం చూసుంటాం. కానీ, ఇప్పటి ఫార్ములా వన్‌లో మాత్రం మనం ఖచ్చితంగా మిస్సయ్యేది వి8 ఇంజన్ల నుంచి సాధారణంగా పుట్టుకొచ్చే ఎగ్జాస్ట్ నోట్ (సైలెన్సర్ సౌండ్).
ప్రస్తుత బ్రీడ్ ఫార్ములా వన్ ఇంజన్లలో పెర్ఫార్మెన్స్ కోసం టర్బోచార్జర్లను ఉపయోగిస్తున్నారు. వీటిని వలన ఎగ్జాస్ట్ నోట్ ఎక్కువగా సైలెంట్‌గా ఉంటోంది. కొందరు స్పెక్టేటర్లు, ఎఫ్ అభిమానులు కేవలం ఎగ్జాస్ట్ నోట్ (సైలెన్సర్ సౌండ్) సరిగ్గా ఉండని కారణంగానే తాము ఫార్ములా వన్ కార్యక్రమాలకు హాజరు కావటం లేదని చెబుతున్నారు.
ఎఫ్ఐఏ ఇంజన్ నిబంధనలు మార్చాలకుంటున్న తరుణంలో, ఫ్రెంట్ కార్ కంపెనీ రెనో తమ ఇంజన్లను మండించినప్పుడు వచ్చే సహజ సిద్ధమైన ఎగ్జాస్ట్ నోట్‌కు సంబంధించిన ఓ వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోని ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియో శీర్షికలో చూద్దాం రండి. మీరు కూడా ఫార్ములా వన్ అభిమాని అయితే, మీ కంప్యూటర్ వాల్యూమ్‌ని పెంచి ఈ ఇంజన్ సౌండ్‌ని ఎంజా చేయండి..!


Click it and Unblock the Notifications








