వీడియో: వీటిలో ఏది బాగా డ్రిఫ్ట్ చేస్తుంది కార్ లేక బైక్?
కారు బెటరా లేక బైక్ బెటరా అన్న వాదన ఈ రెండింటిన కనుగొన్న నాటి నుంచి ఉంది. సౌకర్యంగా వెళ్లాలంటే కార్ బెటర్ అని కొందరు చెబుతుంటే, ట్రాఫిక్‍లో త్వరగా వెళ్లాలంటే బైక్ బెటర్ అని మరికొందరు చెబుతుంటారు.
అయితే, డ్రిఫ్టింగ్ చేయటంలో ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని అడిగితే మీరేం సమాధానం ఇస్తారు. ఆగండి, ఈ వీడియో చూసిన తర్వాత మీ సమాధానం ఇవ్వండి. ఈనాటి మన వీడియో శీర్షికలో ఓ కార్ మరియు ఓ బైక్ రెండూ పక్కపక్కనే డ్రిఫ్టింగ్ చేయటాన్ని చూద్దాం రండి.
ఈ వీడియోని పరిశీలించిన తర్వాత మా అభిప్రాయం అయితే కార్ డ్రిఫ్టింగ్ బెటర్ అనే నిర్ధారణకు వచ్చాం. వాస్తవానికి ఈ రెండింటినీ డ్రిఫ్ట్ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఇవి రెండూ ప్రమాదకరమే. అయితే, బైక్ డ్రిఫ్టింగ్‌తో పోల్చుకుంటే కారు డ్రిఫ్టింగ్‌లో రిస్క్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో చూసిన తర్వాత నిర్ణయించుకోండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/I3DSc0W3MQk?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








