మీ కారులో ఏ రకం ఇంజన్ ఆయిల్ వాడుతున్నారు..? అసలు ఎన్ని రకాల ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి..?

కారు ట్రబుల్ ఇవ్వకుండా నిర్విరామంగా నడవాలంటే, అందులో క్రమం తప్పకుండా ఇంజన్ ఆయిల్ మార్పు చేయడం ఎంతో అవసరం. అసలు మార్కెట్లో అనేక రకాల ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి? మరి వాటిలో ఏవి బెస్ట్? మినరల్, ఫుల్ సింథటిక్ మరియు సెమీ సింథటిక్ ఆయిల్స్ మధ్య తేడా ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ కథనం.

మీ కారులో ఏ రకం ఇంజన్ ఆయిల్ వాడుతున్నారు..? అసలు ఎన్ని రకాల ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి..?

మీ కారు ఇంజన్ యొక్క జీవితకాలాన్ని పెంచుకోవాలంటే, దానిని క్రమం తప్పకుండా సర్వీస్ చేయిస్తూ, ఇంజన్ ఆయిల్ మార్చుకోవడం తప్పనిసరి. అయితే మీరు ఇంజన్ ఆయిల్ కొనడానికి వెళ్లే ముందు మీ కారుకు ఎలాంటి ఇంజన్ ఆయిల్ అవసరమో మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మీ కారులో ఏ రకం ఇంజన్ ఆయిల్ వాడుతున్నారు..? అసలు ఎన్ని రకాల ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి..?

ప్రస్తుతం, మార్కెట్లో అనేక రకాల ఇంజన్ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీ కారు యొక్క ఇంజన్ కు సరైన రకాన్ని ఎంచుకోవాలి. అప్పుడే ఇంజిన్ 'మృదువుగా' మరియు మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కానీ ఏ రకమైన ఇంజన్ ఆయిల్ ఎంచుకోవాలన్నదే ప్రధానమైన సమస్య. ప్రతి ఇంజన్ ఆయిల్ కి ఓ ప్రత్యేకత ఉంటుంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

మీ కారులో ఏ రకం ఇంజన్ ఆయిల్ వాడుతున్నారు..? అసలు ఎన్ని రకాల ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి..?

మినరల్ ఇంజన్ ఆయిల్ (Mineral Engine Oil)

'మినరల్ ఇంజన్ ఆయిల్' దీనినే 'కన్వెన్షనల్ ఇంజన్ ఆయిల్' (Conventional Engine Oil) అని కూడా అంటారు. ఇది మీ ప్రామాణిక మోటార్ ఆయిల్. దీనిని ముడి చమురు (Crude Oil) తో తయారు చేస్తారు. కర్మాగారంలో భూమి నుంచి సేకరించిన ముడి చమురును శుద్ధి చేయడం ద్వారా మినరల్ ఇంజన్ ఆయిల్ ను తయారు చేస్తారు. ఖనిజ ఇంజన్ ఆయిల్ యొక్క స్నిగ్ధత (సాంద్రత)ను పెంచడానికి ఇందులో వివిధ సంకలనాలు (కెమికల్స్ మిశ్రమాలు) జోడించబడతాయి.

మీ కారులో ఏ రకం ఇంజన్ ఆయిల్ వాడుతున్నారు..? అసలు ఎన్ని రకాల ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి..?

ఇలా రకరకాల ప్రక్రియలు మరియు శుద్ధీకరణ తర్వాత ఈ మినరల్ ఇంజన్ ఆయిల్ ను బాటిళ్లలో నింపి విక్రయానికి ఉంచుతారు. మినరల్ ఇంజన్ ఆయిల్ ఆధునిక ఇంజన్ ఆయిల్‌ల మార్గదర్శకులలో ఒకటిగా పరిగణించబడుతుంది. మార్కెట్‌లో లభించే ఇతర రకాల ఇంజన్ ఆయిల్‌లతో పోలిస్తే మినరల్ ఇంజన్ ఆయిల్ చౌకగా ఉంటుంది. ఇదే మినరల్ ఇంజన్ ఆయిల్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్.

మీ కారులో ఏ రకం ఇంజన్ ఆయిల్ వాడుతున్నారు..? అసలు ఎన్ని రకాల ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి..?

కానీ, మినరల్ ఇంజన్ ఆయిల్‌తో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే ఇది రాపిడి వల్ల కలిగే వేడికి వ్యతిరేకంగా తక్కువ రక్షణను మాత్రమే అందిస్తుంది. అలాగే మినరల్ ఇంజన్ ఆయిల్ చల్లని వాతావరణంలో అంత ప్రభావవంతంగా పనిచేయదు. అలాగే మినరల్ ఇంజన్ ఆయిల్ ను తరచుగా మారుస్తూ ఉండాలి. కాబట్టి, మినరల్ ఇంజన్ ఆయిల్ తక్కువ ధరకు లభిస్తున్నప్పటికీ, దీనిని కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

మీ కారులో ఏ రకం ఇంజన్ ఆయిల్ వాడుతున్నారు..? అసలు ఎన్ని రకాల ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి..?

ఫుల్ సింథటిక్ ఇంజన్ ఆయిల్ (Full-Synthetic Engine Oil)

ఫుల్ సింథటిక్ ఇంజన్ ఆయిల్ పూర్తిగా ఫ్యాక్టరీ లేదా ప్రయోగశాలలో ఉత్పత్తి చేయబడుతుంది. దీని కారణంగా అవి చాలా ఏకరీతిగా ఉంటాయి. ఇంజన్ ఆయిల్ టెక్నాలజీలో ఇది అత్యంత అధునాతనమైనదిగా పరిగణించబడుతుంది. ఫుల్ సింథటిక్ ఇంజన్ ఆయిల్ ఇంజన్ కు అద్భుతమైన రక్షణను అందిస్తుంది మరియు మైలేజీని పెంచడంలో కూడా సహకరిస్తుంది. ఫుల్ సింథటిక్ ఇంజన్ ఆయిల్ అధిక పీడనం లేదా తక్కువ మరియు అధిక ఉష్ణోగ్రతలు వంటి అన్ని సమయాల్లోనూ మెరుగ్గా పని చేస్తుంది.

మీ కారులో ఏ రకం ఇంజన్ ఆయిల్ వాడుతున్నారు..? అసలు ఎన్ని రకాల ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి..?

ఫుల్ సింథటిక్ ఆయిల్ ను తయారు చేయడం వెనుక సైంటిఫిక్ ఫార్ములా అపారమైనది మరియు చాలా కష్టమైనది కూడా. దీని కారణంగా ఫుల్ సింథటిక్ ఆయిల్ ధరలు కూడా అధికంగానే ఉంటాయి. అయినప్పటికీ, ఇది ధరకు తగిన ఫలితాన్ని అందిస్తుంది. ఫుల్ సింథటిక్ ఆయిల్ చాలా కాలం పాటు మన్నికగా ఉంటుంది. కాబట్టి మినరల్ ఇంజన్ ఆయిల్ లాగా దీన్ని తరచుగా మార్చాల్సిన అవసరం లేదు.

మీ కారులో ఏ రకం ఇంజన్ ఆయిల్ వాడుతున్నారు..? అసలు ఎన్ని రకాల ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి..?

సెమీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ (Semi-Synthetic Engine Oil)

ఇది ఖనిజ మరియు ఫుల్ సింథటిక్ ఇంజన్ ఆయిల్ యొక్క మిశ్రమం. దీనిని బ్లెండెడ్ ఆయిల్ అని కూడా అంటారు. ఇది మినరల్ ఆయిల్ మాదిరిగానే తక్కువ ధరలో లభిస్తుంది కానీ ఫుల్ సింథటిక్ ఆయిల్ మాదిరిగా అదే రకమైన పనితీరును కూడా అందిస్తుంది. సెమీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ మినరల్ ఇంజన్ ఆయిల్ కంటే 3 రెట్లు ఎక్కువ రక్షణను అందిస్తుంది.

మీ కారులో ఏ రకం ఇంజన్ ఆయిల్ వాడుతున్నారు..? అసలు ఎన్ని రకాల ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి..?

సెమీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ ను మినరల్ ఇంజన్ ఆయిల్‌లో కొద్ది మొత్తంలో సింథటిక్ ఆయిల్ ను కలపడం ద్వారా తయారు చేస్తారు. కాబట్టి, దీనికి సింథటిక్ బ్లెండ్ ఆయిల్ (Synthetic Blend Oil) అనే పేరు కూడా ఉంది. ఇక్కడ బ్లెండ్ అంటే సమ్మేళనం అని అర్థం. ఇది మినరల్ ఇంజన్ ఆయిల్ కంటే మెరుగైనది మరియు ఫుల్ సింథటిక్ ఇంజన్ ఆయిల్ కన్నా తక్కువైనది.

మీ కారులో ఏ రకం ఇంజన్ ఆయిల్ వాడుతున్నారు..? అసలు ఎన్ని రకాల ఇంజన్ ఆయిల్స్ ఉన్నాయి..?

మరి మీ కారులో ఏ రకమైన ఇంజన్ ఆయిల్ ను ఉపయోగించాలి..? ఒకవేళ ఈ విషయం మీకు తెలియకపోయినట్లయితే, ఓసారి మీ కారు యొక్క ఓనర్స్ మ్యాన్యువల్ ని తిరగేయండి. అందులో ఏరకమైన ఇంజన్ ఆయిల్ ని ఉపయోగించాలనే విషయం పేర్కొనబడి ఉంటుంది. లేదంటే, మీ వాహనాన్ని సర్వీస్ చేయించే చోట సర్వీస్ ఇంజనీర్ ని అడిగి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోండి. నిజానికి, కొంచెం తెలివిగా వ్యవహరించి, అన్ని పరికరాలు అందుబాటులో ఉంటే ఇంజన్ ఆయిల్ ను మనమే ఇంటి వద్ద మార్చుకోవచ్చు.

Most Read Articles

English summary
Which engine oil is best for your car find out differences between mineral full synthetic and semi synthetic oils
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X