ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?

ప్రస్తుతం ప్రజల జీవన విధానం మారుతూ ఉంది. ఒకప్పుడు కూడు, గూడు & గుడ్డ మాత్రమే ప్రధాన అవసరాలుగా జీవించిన మానవుడు ఈ రోజు వాహనం కూడా తమ జీవితంలో ఒక భాగంగా మార్చుకుంటున్నాడు. కావున ఈ రోజు దాదాపు ప్రతి వ్యక్తి ఒక సొంత వాహనం కలిగి ఉన్నాడు. అది సైకిల్ కావచ్చు, బైక్ కావచ్చు లేదా కార్ కూడా కావచ్చు. ఇటీవల 'నేషనల్ ఫ్యామిలీ హెల్త్' నిర్వహించిన ఒక సర్వేలో దీనికి సంబంధించిన కొన్న ఆసక్తికరమైన విషయాలు వెలువడ్డాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశంలో ఎక్కువగా కార్లు ఉపయోగించే రాష్ట్రం అదే.. మీకు తెలుసా?

ప్రస్తుతం దేశంలో కొన్ని పరిస్థితులను గమనిస్తూ ఉంటే.. ఇళ్లులేని వ్యక్తి కూడా కనీసం ఒక వెహికల్ కలిగి ఉన్నాడు. ప్రస్తుతం దేశంలో వాహన నిర్వహణ ఖర్చు అధికంగా ఉన్నా కూడా వాహనాలను కలిగి ఉండటానికే ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా దీనికి బాగా అలవాటుపడ్డారు.

భారతదేశంలో ఎక్కువగా కార్లు ఉపయోగించే రాష్ట్రం అదే.. మీకు తెలుసా?

నివేదికల ప్రకారం, అత్యధిక సంఖ్యలో కార్లు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో కేరళ మరియు జమ్మూ & కాశ్మీర్ ముందు వరుసలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కారును కలిగి ఉన్న కుటుంబాల శాతం వరుసగా 24.2% మరియు 23.7% గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఉన్న ప్రజలు దాదాపుగా వాహనాలను కలిగి ఉన్నారు అని మనకు స్పష్టమవుతోంది.

భారతదేశంలో ఎక్కువగా కార్లు ఉపయోగించే రాష్ట్రం అదే.. మీకు తెలుసా?

కార్లు ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తెలిసింది. ఇక్కడ దాదాపు 22.1% కుటుంబాలు కార్లను ఉపయోగిస్తున్నారు. ఇక నాలుగవ స్థానంలో పంజాబ్, ఐదవ స్థానంలో నాగాలాండ్, ఆరవ స్థానంలో సిక్కిం మరియు ఏడవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి.

భారతదేశంలో ఎక్కువగా కార్లు ఉపయోగించే రాష్ట్రం అదే.. మీకు తెలుసా?

కార్ల వినియోగంలో ఆంద్రప్రదేశ్ స్థానం:

ఇక మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కేవలం 2.8% కుటుంబాలు మాత్రమే కార్లను కలిగి ఉన్నట్లు ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 5.2% కుటుంబాలు కార్లను కలిగి ఉన్నారు. అదే సమయంలో ఒడిస్సా రాష్ట్రాల్లో మొత్తం 2.7% కుటుంబాలు మాత్రమే కార్లను కలిగి ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం దేశంలో అతి తక్కువ సంఖ్యలో కార్లను కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఒడిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే మొత్తం మీద భారతదేశంలో కార్లను కలిగి ఉన్న కుటుంబాల శాతం 7.5% మాత్రమే. అయితే 2018 లో శాతం కేవలం 6% మాత్రమే. దీన్ని బట్టి చూస్తే 2018 కంటే కూడా 2021 లో1.5% పెరుగుదల ఉన్నట్లు తెలిసింది.

భారతదేశంలో ఎక్కువగా కార్లు ఉపయోగించే రాష్ట్రం అదే.. మీకు తెలుసా?

ఇక భారతదేశంలోని ద్విచక్ర వాహనాలు కలిగి ఉన్న కుటుంబాల విషయానికి వస్తే, దేశంలో ఎక్కువ ద్విచక్ర వాహనాలు కలిగిన రాష్ట్రంలో గోవా ముందంజలో ఉంది. గోవా రాష్ట్రంలో ఏకంగా 86% కుటుంబాలు ద్విచక్రవాహనాలను కలిగి ఉన్నారు. ఇక రెండవ స్థానంలో పంజాబ్ ఉంది. పంజాబ్ రాష్ట్రంలో 75.6% కుటుంబాలు ద్విచక్రవాహనాలను కలిగి ఉన్నారు.

భారతదేశంలో ఎక్కువగా కార్లు ఉపయోగించే రాష్ట్రం అదే.. మీకు తెలుసా?

ఆ తరువాత స్థానాల్లో రాజస్థాన్‌, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌ మరియు ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో వరుసగా 66.4 శాతం, 63.9 శాతం, 61 శాతం, 61 శాతం, 51.1 శాతం కుటుంబాలు ద్విచక్ర వాహనాలను కలిగి ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. ఒక విధంగా చెప్పాలంటే ద్విచక్ర వాహనాలను ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రాల్లో పైన తెలిపిన రాష్ట్రాలు ఉన్నాయి.

భారతదేశంలో ఎక్కువగా కార్లు ఉపయోగించే రాష్ట్రం అదే.. మీకు తెలుసా?

ఇక దేశంలో అతి తక్కువ ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్న రాష్ట్రాల విషయానికి వస్తే, ఇందులో సిక్కిం (11.4%) మరియు మేఘాలయ (20.2%) ఉన్నాయి.

ద్విచక్ర వాహన వినియోగంలో ఆంధ్రప్రదేశ్:

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాల శాతం విషయానికి వస్తే 47% (ఆంధ్రప్రదేశ్) మరియు 55.3% (తెలంగాణ) గా ఉన్నాయి. ద్విచక్ర వాహన వినియోగంలో మన తెలుగు రాష్ట్రాలు వెనుకబడలేదు అని తెలుస్తోంది.

భారతదేశంలో ఎక్కువగా కార్లు ఉపయోగించే రాష్ట్రం అదే.. మీకు తెలుసా?

మొత్తం మీద భారతదేశంలో 49.7% కుటుంబాలు (అన్ని రాష్ట్రాలు కలిపి) ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిసింది. 2018 గణాంకాల ప్రకారం ఈ శాతం 37.7% మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ద్విచక్ర వాహన వినియోగంలో మన దేశంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది అని చెప్పవచ్చు.

భారతదేశంలో ఎక్కువగా కార్లు ఉపయోగించే రాష్ట్రం అదే.. మీకు తెలుసా?

'నేషనల్ ఫ్యామిలీ హెల్త్' సర్వే దేశంలో వినియోగిస్తున్న సైకిల్స్ గణాంకాలు కూడా విడుదల చేసింది. సైకిల్స్ వినియోగంలో ముందు ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 78.9% కుటుంబాలు సైకిల్స్ వినియోగిస్తున్నాయి. ఆ తరువాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 75.6% కుటుంబాలు సైకిల్‌లను ఉపయోగిస్తున్నాయి.

భారతదేశంలో ఎక్కువగా కార్లు ఉపయోగించే రాష్ట్రం అదే.. మీకు తెలుసా?

ఇక ఒడిస్సా (72.5%), ఛత్తీస్‌గఢ్ (70.8%), అస్సాం (70.3%) మరియు పంజాబ్ (67.8%) వంటి రాష్ట్రాలు ఆ తరువాత వరుసలో ఉన్నాయి. దేశంలో అతి తక్కువ సంఖ్యలో సైకిల్స్ ఉపయోగిస్తున్న కుంభాలు కలిగి ఉన్న రాష్ట్రాలు నాగాలాండ్ (5.5%), సిక్కిం (5.9%) మరియు మిజోరం (9.3%).

భారతదేశంలో ఎక్కువగా కార్లు ఉపయోగించే రాష్ట్రం అదే.. మీకు తెలుసా?

సైకిల్స్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది:

సైకిల్స్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ 30.9 శాతం మరియు తెలంగాణ 24 శాతం ఉన్నాయి. మొత్తం మీద భారతదేశంలో 2021 సర్వే ప్రకారం సైకిల్స్ ఉపయోగిస్తున్న కుటుంబాలు 50.4%. 2018 ప్రకారం ఈ శాతం 52.1 గా ఉంది. దీని ప్రకారం 2018 కంటే కూడా 2021 లో సైకిల్స్ వినియోగం 1.7% తగ్గింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గుతుంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది.

Most Read Articles

English summary
Which india states have highest percentage of car bike ownership
Story first published: Wednesday, May 25, 2022, 17:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X