విమానంలో కూర్చోవడానికి అత్యంత సురక్షితమైన చోటు ఏది ?

Written By:

మానవ మనుగడలో విమాన ప్రయాణం రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు విమానంలో ప్రయాణించడానికి అవకాశం లభిస్తే చాలు అనుకునే వారు. కాని ఇప్పుడు విమాన ప్రయాణంలోని సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే ఇప్పుడు విమాన ప్రయాణంలోని భద్రత గురించి కూడా అధికంగా దృష్టి సారిస్తున్నారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి సభ్యుడు కేత్ హోలోవే మాట్లాడుతూ, ప్రతి ప్రమాదం కూడా వాతావరణం పరిస్థితుల ఆధారంగా సంభవిస్తుంది, మరియు నేల మీద కూడా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి, విమానంలో ఏ ప్రదేశంలో కూర్చున్నా త్వరగా తప్పించుకునేందుకు ప్రయత్నించాలని ఆయన చెబుతాడు.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

అదే సమయంలో ప్రయాణికులకు సూచించే భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. తద్వారా ప్రమాద సమయంలో వెంటనే సురక్షితంగా రక్షించడానికి వీలు కలుగుతుంది. నేల మీద నడిచే వాహనం, బైకు, బోటు మరియు నడుచుకుంటే వెళ్లే అందరికీ కూడా భద్రత సూచనలు ఉన్నట్లు విమానంలో ప్రయాణించే వారు తప్పకుండా పాటిచాల్సిన భద్రత సూచనలు ఉంటాయి.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

ఏదేమయినప్పటీ కొన్ని రిపోర్ట్‌లు చేసిన సర్వేల ప్రకారం విమానంలోని కొన్ని ప్రత్యేకించిన చోట్లలో కూర్చోవడం ద్వారా ప్రమాదంలో తప్పించుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కొన్ని సీట్లలో ప్రమాదానికి గురయ్యే అవాశం చాలా తక్కుగా ఉన్నట్లు చాలా వరకు రిపోర్ట్‌లు స్పష్టం చేస్తున్నాయి.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

1970 నుండి 2007 వరకు, ప్రమాదానికి గురైన వాణిజ్య విమాణాల ప్రమాదాలను అంచనా వేసే వెబ్‌సైట్ ప్రత్యేకంగా పరిశీలిస్తూ వచ్చింది. మెకానికల్ లోపాల వలన ప్రమాదానికి గురైన విమానాలను పరిశీలించిన అనంతరం విమానం చివరిలో ప్రమాదాల రేటు చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

రిపోర్ట్‌ల ప్రకారం విమానంలో క్యాబిన్‌కు ముందు భాగంలో ప్రయాణించే వారిని రక్షించడానికి 49 శాతం ఆస్కారం ఉండగా, క్యాబిన్‌లోని వెనుక సగభాగంలో ప్రయాణించే వారిని రక్షించడానికి 69 శాతం ఆస్కారం ఉందని తెలిసింది.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

అచ్చం ఇలానే, అమెరికా ఏవియేషన్ ఆధారిత అథారిటీ నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెలుగు చూసినట్లు టైమ్స్ పత్రిక తన కథనంలో తెలిపింది. వీరి రిపోర్ట్ ప్రకారం విమానంలోని క్యాబిన్ చివరి భాగంలో ప్రయాణించే వారు సురక్షితంగా తప్పించుకునే అవకాశం ఉన్నట్లు తేలింది.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

కార్ల నిర్మాణం యొక్క ధృడత్వాన్ని పరీక్షించడానికి ఇప్పుడు కార్లకు క్రాష్ (ఢీ) పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే విమానానికి కూడా ఒక సారి ఇలా క్రాష్ టెస్ట్ నిర్వహించారు. 2012 సంవత్సరంలో ఒక విమానాన్ని దాని యొక్క ధృడత్వాన్ని పరీక్షించడానికి నేలను ఢీ కొట్టించి పరీక్షించారు.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

క్రాష్ పరీక్షల కోసం బోయింగ్ 727 విమానాన్ని వినియోగించారు. ఈ క్రాష్ పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారుల పర్యవేక్షణలో జరిగాయి.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

ఈ విమానాన్ని అమెరికన్ ఎయిర్ లైన్స్ పైలెట్ కెప్టెన్ జిమ్ బాబ్ మరియు అమెరికా నేవీ కెన్లీ చిప్ సంయుక్తంగా నడిపారు మరియు విమానంలోని సీట్లన్నింటిని మనిషి బొమ్మలతో నింపారు.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

పైలట్ మరియు పర్యవేక్షణా ఇంజనీర్లు ఈ విమానంలో ప్రయాణించారు. మెక్సికో యొక్క కాలిపోర్నియా ఎడారి ప్రాంతంలో గాలిలో నుండి ఎత్తును తగ్గిస్తుూ నడిపారు. ఒక దశలో నేలను తాకుతుంది అనే సమయంలో ఇంజనీర్లు మరియు పైలట్లు ప్యారాచుట్ల ద్వారా తప్పుకున్నారు.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

విమానం మరో నాలుగు నిమిషాల్లో ప్రమాదానికి గురవుతుందనగా కెప్టెన్ జిమ్ బాబ్ పారాచుట్ ద్వారా విమానంలో నుండి తప్పించున్నారు. గాలిలో నుండి నేలను తాకే వరకు మిగిలిన నాలుగు నిమిషాల పాటు రిమోట్ ద్వారా విమానాన్ని ఆపరేట్ చేశారు.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

నేలను ఢీకొట్టే సమయంలో విమానం యొక్క వేగం గంటకు 230 కిలోమీటర్లుగా ఉంది. ఆ వేగం వద్ద ప్రమాదానికి గురవ్వడం ఒళ్లు జలదరించిందని చెప్పవచ్చు. ఈ పరీక్షలో విమాన క్యాబిన్ పాక్షికంగా దెబ్బతింది.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

ప్రమాదానికి ముందు విమాన క్యాబిన్‌లోని పారా మీటర్లలో జరిగే మార్పులను పసిగట్టడానికి కెమెరాలను అమర్చారు. ప్రమాదానంతరం క్యాబిన్‌ ముందు భాగంలో ఉన్న మనిషి బొమ్మలు చాలా దెబ్బతిన్నాయి. అయితే క్యాబిన్ సగ భాగం నుండి చివర్లో ఉన్న మనిషి బొమ్మలు ఏవిధమైన డ్యామేజ్‌కు గురికాకుండా సురక్షితంగా ఉన్నట్లు తేలింది.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

కాబట్టి, వెనుక భాగంలో ప్రయాణించడం ద్వారా ప్రమాదంలో చిక్కుకోకుండా సురక్షితంగా బయటపడే అవకాశం కలిగింది. విమానానికి ఇరు వైపులా ఉండే రెక్కలు విమానం మధ్యలో ఉంటాయి. కాబట్టి వెనుక సగ భాగంలోని ప్రయాణికులు చాలా వరకు సురక్షితంగా ఉంటారని తేలింది.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

క్రాష్ పరీక్షలు నిర్వహించిన విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే విమానానికి పూర్తిగా చివరిలో ఉన్న మనిషి బొమ్మలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తేలింది. అంటే విమానానికి పూర్తిగా చివరలో కూర్చోవడం కూడా కొన్ని చిన్న చిన్న గాయాలవడానికి ఆస్కారముందని స్పష్టం చేశారు.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

విమానానికి చివర్లో వెనుక వైపున ఉండే తోక వంటి నిర్మాణం అనుసంధానంతో ఉండటం క్యాబిన్ లోని వెనుక భాగంలో ప్రయాణించే వారికి ప్రమాదానాన్ని కలిగించినట్లు ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు.

విమానంలో అత్యంత సురక్షితమైన చోటు

విమాన ప్రమాదాలు చాలా వరకు సహాయక చర్యలు జరపడానికి వీల్లేకుండా సంభవిస్తున్నాయి మరియు స్వతహాగా తప్పించుకునేందుకు వీలు లేకుండా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

 
English summary
Which Is The Safest Place On An Aircraft
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark