ఏయే సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కార్లు కొనచ్చు? ఎందుకు?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, దేశీయ విపణిలో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు అత్యంత విశ్వసనీయమైన కార్ బ్రాండ్‌గా ఉంటోంది. భారత మార్కెట్లో దశాబ్ధాల చరిత్ర కలిగిన ఈ కార్ బ్రాండ్, ప్రతినెలా అత్యధిక సంఖ్యలో వాహనాలను విక్రయిస్తూ, అగ్రస్థానంలో ఉంది.

ఏయే సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కార్లు కొనచ్చు? ఎందుకు?

కొత్త కార్ల విషయంలోనే కాదు, సెకండ్ హ్యాండ్ కార్ల విషయంలో కూడా మారుతి సుజుకి చాలా విశ్వసనీయమైన బ్రాండ్‌గా కొనసాగుతోంది. మారుతి సుజుకి ట్రూ వ్యాల్యూ పేరుతో కంపెనీ ప్రీ-ఓన్డ్ కార్లను కూడా విక్రయిస్తోంది. మరి ప్రస్తుతం మార్కెట్లో ఉత్తమమైన సెకండ్ హ్యాండ్ కార్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఏయే సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కార్లు కొనచ్చు? ఎందుకు?

1. మారుతి సుజుకి జెన్ ఎస్టిలో

మీరు మొట్టమొదటి సారిగా ఓ స్వంత కారును కొనాలని మరియు అది కూడా ఓ సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కారును కొనాలని చూస్తున్నట్లయితే మీకు మారుతి సుజుకి జెన్ ఎస్టిలో ఓ మంచి అవుతుంది. భారత మార్కెట్లో ఈ మోడల్ డిస్‌కంటిన్యూ అయినప్పటికీ, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఇది ఇప్పటికీ అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఈ కారు ధర సుమారు రూ.1 లక్ష కన్నా తక్కువగానే ఉంటుంది.

ఏయే సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కార్లు కొనచ్చు? ఎందుకు?

2. మారుతి సుజుకి గ్రాండ్ విటారా

మారుతి సుజుకి నుండి వచ్చిన మరో అద్భుతమైన కారు గ్రాండ్ విటారా. మారుతి సుజుకి గ్రాండ్ విటారా దాని కాలంలోని ఉత్తమ ఎస్‌యూవీలలో ఒకటిగా కొనసాగింది. మీరు ఎస్‌యూవీ ప్రేమికులై ఉండి, సెకండ్ హ్యాండ్ మోడల్‌కు ప్రాధాన్యతనిచ్చే వారు అయితే, ఇది ఖచ్చితంగా మీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఎస్‌యూవీ చాలా బాగుంటుంది, కాకపోతే దీని మెయింటినెన్స్ కొంచెం ఖరీదైనది.

ఏయే సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కార్లు కొనచ్చు? ఎందుకు?

3. మారుతి సుజుకి జిప్సీ

మారుతి సుజుకి జిప్సీ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేకపోయినప్పటికీ, అప్పట్లో ఇదొక బెస్ట్ జీప్ స్టైల్ వాహనంగా ఉండేది. ఆఫ్-రోడ్ మరియు లైఫ్-స్టైల్ వాహనంగా ప్రఖ్యాతి గాంచిన మారుతి జిప్సీ, మీ మొదటి కారుగా మంచి ఆప్షన్‌గా ఉంటుంది. అయితే, సెకండ్ మార్కెట్ నుండి మారుతి జిప్సీని కొనాలని చూస్తున్నట్లయితే, సదరు ఎస్‌యూవీ రీస్టోరేషన్‌కు బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది.

ఏయే సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కార్లు కొనచ్చు? ఎందుకు?

4. మారుతి ఏ-స్టార్

ఒకప్పుడు భారత స్మాల్ కార్ మార్కెట్‌ని స్టార్‌లా ఏలిన మోడల్ మారుతి ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్. సెకండ్ హ్యాండ్ కారుని మీ మొదటి కారుగా ఎంచుకోవాలని ప్లాన్ చేస్తుంటే, మీకు మారుతి ఏ-స్టార్ కూడా ఓ మంచి ఎంపికగా ఉంటుంది. మారుతి సుజుకి నుండి గతంలో అత్యధికంగా అమ్ముడైన కారు ఏ-స్టార్. ఈ కారు కూడా చాలా తక్కువ ధరకే లభిస్తుంది.

ఏయే సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కార్లు కొనచ్చు? ఎందుకు?

5. మారుతి సుజుకి స్టింగ్‌రే

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, కంపెనీ ఇందులో ఓ అర్బన్ స్టైల్ వేరియంట్‌ను స్టింగ్‌రే పేరుతో గతంలో పరిచయం చేసింది. మీరు ఈ కారును వాగన్ఆర్ యొక్క సెకండ్ ఫేస్‌గా పరిగణించవచ్చు. మీరు వాగన్ఆర్ కొనాలని చూస్తున్నట్లయితే, ఇది మీకు మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది లోపలి నుండి వ్యాగన్ఆర్ మాదిరిగానే ఉంటుంది, కానీ మీకు ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు లభిస్తాయి.

ఏయే సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కార్లు కొనచ్చు? ఎందుకు?

6. మారుతి సుజుకి రిట్జ్

మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడైన మరొక గొప్ప మోడల్ రిట్జ్, ఇది కూడా సెకండ్ హ్యాండ్ మారుతి కారుగా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆసక్తికరమైన విషయం ఎంటంటే, ఈ చిన్న కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో లభిస్తుంది. కాబట్టి, మీరు సెకండ్ హ్యాండ్‌లో ఓ మంచి బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కొనాలని చూస్తున్నట్లయితే, ఇది ఖచ్చితంగా ఓ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ఏయే సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కార్లు కొనచ్చు? ఎందుకు?

7. మారుతి సుజుకి ఎస్ఎక్స్4

మీరు సెకండ్ హ్యాండ్ మారుతి సెడాన్ కోసం చూస్తున్నట్లయితే, మీకు ఎస్ఎక్స్4 ఓ మంచి ఎంపికగా ఉంటుంది. ప్రస్తుత పెట్రోల్ ధరలను పరిశీలిస్తే, మీరు ఈ కారు యొక్క సిఎన్జి వేరియంట్‌ను కూడా ఎంచుకునే అవకాశం ఉంది. మార్కెట్లో దీని ధర కూడా తక్కువగా ఉంటుంది.

ఏయే సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కార్లు కొనచ్చు? ఎందుకు?

8. మారుతి సుజుకి సెలెరియో డీజిల్

మారుతి సుజుకి సెలెరియో డీజిల్ ఇంజిన్‌తో కూడా లభించేదని చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన మొదట్లో ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండేది. అయితే, ఇది భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ చరిత్రలోనే అతి తక్కువ కాలం అందుబాటులో ఉన్న మోడల్. ఒకవేళ మీరు చిన్న డీజిల్ కారు కోసం చూస్తుంటే, సెలెరియో డీజిల్‌ను సెకండ్ హ్యాండ్ కారుగా ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Which Pre-owned Maruti Suzuki Cars Can Be Consider To Buy, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X