ఇలాంటివి వద్దు సోదరా.. రోడ్డుపై బైక్‌తో స్టంట్లు.. సీన్ కట్ చేస్తే ఎదురుగా ట్రక్కు.. తరువాత ఏ జరిగిందంటే..

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఓ రేంజ్‌లో పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి ఘటన జరిగిన కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. చాలా మంది సెలబ్రిటీ హోదా పొందడానికి ఇష్టం వచ్చినట్లు రీల్స్ చేస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంత మంది అయితే ఇలా రీల్స్ కోసం వీడియోలను చేస్తున్న సమయంలో తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. ప్రాణాలు పోతున్న ఘటనలు జరుగుతున్నా కూడా ప్రమాదకరమైన రీతిలో వీడియోలను తీయడం మాత్రం ఆపడం లేదు. ముఖ్యంగా రీల్స్ కోసం బైక్స్‌తో రోడ్లపై ఇతరుల ప్రాణాలతో పాటు తమ ప్రాణాలకు ప్రమాదం జరిగే విధంగా రాష్ డ్రైవింగ్ చేస్తున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇటీవలే ఇలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వచ్చే వాహనాలను పట్టించుకోకుండా బైక్స్‌తో స్టంట్లు వేయగా ఎదురుగా ట్రక్కును తాకి కింద పడిపోయారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసినట్లయితే లగ్జరీ బైకుపై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అయితే వారు సాధారణ రీతిలో కాకుండా బైకును రోడ్డుకు అటు ఇటూ వంపులు తిప్పుతూ, రాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఎదురుగా వచ్చే వాహనాలు కూడా పట్టించుకోవడం లేదు. బైకును వేగంగా పోనిస్తుండగా ఎదురుగా ఒక ట్రక్కు వస్తుంది. దానికి సైడ్ ఇచ్చే తరుణంలో ట్రక్కు ముందు టైర్ భాగానికి తగిలారు.

Biker Stunts Hit The Oncoming Truck

దీంతో బైక్‌ వేగంగా ఉండటంతో అది కంట్రోల్ కాలేకపోయింది. వెనక కూర్చున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడిపోయాడు. అయితే బైక్ వంపు తిరుగుతుండడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా కంట్రోల్ చేయలేకపోవడంతో అతను కూడా బైక్‌తో పాటే కింద పడిపోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. రోడ్డుపై వారిద్దరికి గాయాలు అయ్యే అవకాశం ఉందని వీడియోను చూస్తేనే తెలిసిపోతుంది. రాష్ డ్రైవింగ్ కాస్త వారి ప్రాణం మీదకు తెచ్చింది.

ఈ ఘటన రీల్స్ కోసం వీడియోను తీస్తున్న క్రమంలో జరిగిందా లేదా అనేది తెలియరాలేదు. అయితే ఇక్కడ గమనించవలసిన మరో విషయం కూడా ఉంది. అదేంటంటే, వీడియోను జాగ్రత్తగా గమనిస్తే, ప్రారంభంలో పడిపోయిన బైక్‌తో పాటు, దాని వెనుక వస్తున్న మరో రెండు బైక్స్ కూడా ఇలాగే రోడ్డుకు అటు ఇటూ వంపులు తిప్పుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే వారంతా కూడా ఒకరినొకరు పరిచయస్తులుగా అనిపిస్తుంది.

Bike Hit The Oncoming truck And Fell Down

అందరు కలిసే ఇలా రోడ్డుపై బైక్స్‌తో స్టంట్లకు పాల్పడినట్లు అర్థం అవుతుంది. అలాగే, ముందు ఎవరు ఈ వీడియోను రికార్డ్ చేశారో మాత్రం తెలియరాలేదు. బహుశా వారు కూడా ఇదే గ్రూప్ వాళ్ళు కావచ్చు. బైక్స్‌తో స్టంట్లు చేస్తుండగా, వారు వీడియోలను తీస్తున్నారని తెలుస్తుంది. కింద పడిపోయిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వివరాల గురించి ఎలాంటి సమాచారం లేదు.

ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన చాలా మంది ఇలా ప్రమాదకరమైన రీతిలో బైక్ స్టంట్లు చేయవద్దని కామెంట్స్ చేస్తున్నారు. రోడ్డుపై జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, రాష్‌గా వెళ్తూ తమ ప్రాణాలతో పాటు, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో నెట్టివేయద్దని సూచనలు ఇస్తున్నారు.

Biker Going Rash Driving Hit The Oncoming truck And Fell Down

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 8, 2025, 11:20 [IST]
English summary
While doing stunts with bike hit the oncoming truck and fell down video goes viral
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+