విమానం క్యాబిన్‌లో చలిగా ఉంటుంది.. దీని వెనుక ఉన్న కారణం ఇదే
ఒకప్పుడు ప్రయాణం అంటేనే ఎద్దుల బండ్లు లేదా గుర్రపు బండ్లు వంటివి ఉపయోగించేవారని అందరికి తెలుసు. అయితే ప్రస్తుతం మనం అందరూ కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున ఈ రోజు బస్సులు, ట్రైన్లు మరియు విమానాలు వంటి ప్రయాణ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది మానవుడు సాధించిన పురోగతి అని చెప్పాలి.
అయితే ప్రస్తుతం చాలామంది విమానాల్లో ప్రయాణించి ఉంటారు. కానీ విమానం లోపల ఉన్న ఉష్ణోగ్రతకు మరియు బయట ఉన్న ఉష్ణోగ్రతలకు చాలా తేడా ఉంటుంది. అంతే కాదు, లోపల చాలా చలిగా కూడా ఉంటుంది. ఇలా ఉండటానికి ప్రధాన కారణం ఏమిటి అనే విషయం మనం ఈ కథనంలో తెలుసుకుందాం.

విమానం యొక్క క్యాబిన్‌ను చల్లగా ఉంచడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎక్కువమంది ప్రయాణికులు లోపల ఉండటం వల్ల వేడి మరియు ఉష్ణోగ్రతల నుండి ఉత్పన్నమయ్యే ఆరోగ్య సంబంధిత సమస్యలు. దీని వల్ల విమానంలో ప్రయాణీకుల ఆరోగ్యం చాలా వరకు క్షీణించే అవకాశం ఉంది.

విమానం ఎత్తులో ఎగిరే సమయంలో క్యాబిన్ లోపల గాలి ఒత్తిడి తగ్గుతుంది. ఆ సమయంలో క్యాబిన్ లోపల ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. క్యాబిన్ లోపల టెంపరేచర్ పెరిగితే ఆక్సిజన్ శాతం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికులకు కావలసినంత ఆక్సిజన్ అందుబాటులో ఉండదు.

క్యాబిన్ లో ఆక్సిజన్ శాతం ఎప్పుడైతే తగ్గుతుందో, ప్రయాణికులు ఎక్కువగా మూర్చపోయే అవకాశం ఉంది. అంతే కాకూండా ఇది వృద్ధులకు మరియు పిల్లలకు మరింత ఆపదను కలిగిస్తుంది. హైపోక్సియా లక్షణాలు విమానంలో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులలో కనిపిస్తాయి. తక్కువ ఆక్సిజన్ మరియు తక్కువ గాలి ఒత్తిడి కారణంగా అలాంటి ప్రయాణీకులు మూర్ఛపోతారు. ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది.

విమానాల్లో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి విమానాల్లో ఉండే సహాయకులు ప్రయాణ సమయంలో గాలి ఒత్తిడి మరియు క్యాబిన్ లోపల ఆక్సిజన్ మొత్తాన్ని నిరంతరం కంట్రోల్ చేస్తూనే ఉంటారు. అయితే కొత్త విమానాలు గాలి పీడనం మరియు ఆక్సిజన్ కంటెంట్‌ను ఆటోమాటిక్ గా కంట్రోల్ చేసుకోగలవు. దీనికి కావాల్సిన అనేక అధునాతన సాంకేతికతలు ఇప్పుడు వీటిలో అమర్చబడి ఉంటాయి.

విమానం గాలిలో ప్రయాణించే సమయంలో, వివిధ వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తుంది. కావున ఆ సమయంలో విమానం లోపల ఉష్ణోగ్రత ఒక్కో ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే చల్లగా ఉండే కొన్ని దేశాల్లో విమానం యొక్క టెంపరేచర్ సాధారణ స్థాయిలో ఉండదు. మన భారతదేశం వంటి సమశీతోష్ణ దేశాల్లో సాధారణంగా టెంపరేచర్ 22 నుంచి 24 డిగ్రీల వరకు ఉంటుంది, కాబట్టి చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు, కానీ విమాన ప్రయాణంలో ఈ టెంపరేచర్ లో తేడాలు కనిపిస్తాయి. అప్పుడు తప్పకుండా ప్రయాణికులకు చలి అనిపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు వేర్వేరు ఉష్ణోగ్రత నియంత్రణ నియమాలను అనుసరిస్తాయి. ఈ నియమాలు విమానయాన సంస్థలచే రూపొందించబడ్డాయి. విమాన మార్గం యొక్క వాతావరణం మరియు ఉష్ణోగ్రత ప్రకారం మారుతూ ఉంటాయి. అంటే విమానం ప్రయాణించే ప్రదేశాన్ని బట్టి క్యాబిన్ యొక్క ఉష్ణోగ్రతలో మార్పు సంభవిస్తుంది. కావున భారతదేశంలో కూడా ఇదే నిభందనలు అమలులో ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ప్రస్తుతం చేరుకోవాల్సిన గమ్యాన్ని అతి త్వరగా చేరుకోవడానికి ఇతర ప్రయాణ సాధనాలకంటే ఎక్కువగా విమానాలను ఉపయోగిస్తారు. కావున ఈ రోజుల్లో విమానంలో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కావున విమానంలో ప్రయాణించేవారికి లోపాలు ఎందుకు చలిగా ఉంటుంది, ఉంష్ణోగ్రతల్లో మార్పులు ఎలా ఏర్పడతాయి అనే విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. కావున ఈ కథనం అలంటి వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికమైన విషయాలతోపాటు కొత్త బైకులు మరియు కార్లను గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ పాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








