బైకులకు 'సైడ్ స్టాండ్' ఎడమవైపు మాత్రమే ఎందుకుంటుంది.. తెలుసా..!!

ప్రాచీన కాలంలో వాహన వినియోగం చాలా తక్కువ. కానీ ఈ రోజు మనం 21 వ శతాబ్దంలో ఉన్నాము. కావున మన నిత్యజీవితంలో వాహనాలు కూడా ఒక భాగమైపోయింది. ఈ రోజు ప్రతి కుటుంబం కనీసం ఒక మోటార్‌సైకిల్ లేదా ఒక స్కూటర్ కలిగి ఉంది. ప్రస్తుతం ఖచ్చితంగా వాహనాలతో చాలా అవసరం ఉంది. అది అందరికి తెలిసిన విషయమే.

బైకులకు సైడ్ స్టాండ్ ఎడమవైపు మాత్రమే ఎందుకుంటుంది.. తెలుసా..!!

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వాహన వినియోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇటీవల విడుదలవుతున్న వాహనాలలో అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతమున్న ఫీచర్స్ మరియు పరికరాలను మునుపటి మోడల్స్ తో పోల్చితే దాదాపు ఎంతవరకు అప్డేట్ అయ్యాయనే విషయం వాహనాలు వినియోగిస్తున్న అందరికి తెలుసు.

బైకులకు సైడ్ స్టాండ్ ఎడమవైపు మాత్రమే ఎందుకుంటుంది.. తెలుసా..!!

వాహనాలు వినియోగించేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వినియోగిస్తూనే ఉంటారు. ఇందులో మునుపటి నుంచి ఈ రోజు వరకు మారని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో సైడ్ స్టాండ్ లేదా కిక్‌స్టాండ్‌ ఉన్నాయి. అయితే ఈ రోజు వరకు కూడా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్స్ లో సైడ్ స్టాండ్ ఎడమ వైపున మాత్రమే ఉంటుంది. కానీ అన్ని మోటార్‌సైకిల్స్ మరియు స్కూటర్స్ లో ఎందుకు ఎడమవైపున మాత్రమే సైడ్ స్టాండ్ ఉంటుంది అనే విషయాన్నీ ఆలోచించరా..? ఈ ప్రశ్నకు కొంతమందికి సమాధానం తెలిసినప్పటికీ, చాలామందికి దీనికి సమాధానం తెలియదు. కావున ఈ ఆర్టికల్ లో సైడ్ స్టాండ్ ఎడమవైపు ఉండటానికి కారణం ఏమిటి, అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం.. రండ.

బైకులకు సైడ్ స్టాండ్ ఎడమవైపు మాత్రమే ఎందుకుంటుంది.. తెలుసా..!!

బైకులకు సైడ్ స్టాండ్ ఎడమవైపున ఉండుటకు కారణాలు:

సాధారణంగా ఒక బైక్ కి వెనుక బ్రేక్ పెడల్ అనేది కుడివైపున ఉంటుంది, అది బైక్ రైడర్స్ కి తెలుసు. వెనుక బ్రేక్ కుడి పాదం ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. ఎడమవైపు కిక్‌స్టాండ్ కలిగి ఉండటం వలన మోటార్‌సైకిల్ యొక్క స్థిరత్వానికి ఎలాంటి సమస్య ఉండదు మరియు సులభంగా ఆపరేట్ చేయవచ్చు. ఒక వేళా కుడివైపున ఉంటే నిర్వహణకు కొంత కఠినంగానే ఉంటుంది.

బైకులకు సైడ్ స్టాండ్ ఎడమవైపు మాత్రమే ఎందుకుంటుంది.. తెలుసా..!!

బైకులు మరియు స్కూటర్లలో ఎగ్జాస్ట్ పైప్ సిస్టమ్ అనేది దానికి కుడి వైపున ఉంచబడింది. అంటే కాకుండా దానికున్న కిక్ స్టార్ట్ కూడా కుడి వైపున ఉంటుంది, కాబట్టి కంపెనీలు దాని కుడి వైపున స్టాండ్ ఉంచరు. ఎడమవైపు సైడ్ స్టాండ్ ఉండటం వల్ల కిక్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఆటంకం ఉండదు. ఇది కూడా సైడ్ స్టాండ్ ఎడమవైపు ఉండటానికి ఒక ప్రధాన కారణం.

బైకులకు సైడ్ స్టాండ్ ఎడమవైపు మాత్రమే ఎందుకుంటుంది.. తెలుసా..!!

మోటార్ సైకిల్ యొక్క సైడ్ స్టాండ్ ఎడమ వైపున అన్ని మోటార్ సైకిల్స్ లో సమానంగా ఉంచబడుతుంది. ఈ కారణం చేత బైక్ లేదా స్కూటర్ పార్కింగ్ స్థలంలోని పార్కింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కపక్కనే పార్క్ చేయవచ్చు. ఒక వేళా ఈ సైడ్ స్టాండ్ అనేది బైకులలో ఎడమ మరియు కుడివైపున ఉంటే పార్కింగ్ సమయంలో చాలా అవకతవకలు ఏర్పడతాయి.

బైకులకు సైడ్ స్టాండ్ ఎడమవైపు మాత్రమే ఎందుకుంటుంది.. తెలుసా..!!

సాధారణంగా ప్రపంచంలోని దాదాపు 90 శాతం కంటే ఎక్కువమంది కుడి చేతి వాటం కలిగి ఉన్నారు. కావున బైక్ లేదా స్కూటర్ తయారీ కంపెనీలు సైడ్ స్టాండ్‌ను ఎడమ వైపున ఉంచుతాయి. ఈ సమయంలో కుడివైపు అలవాటు ఉన్న రైడర్స్, కుడి కాలుతో భూమిపై పట్టు పొందుతారు. అప్పుడు సైడ్ స్టాండ్ ఎడమవైపున సులువుగా ఉపయోగించుకోవచ్చు.

బైకులకు సైడ్ స్టాండ్ ఎడమవైపు మాత్రమే ఎందుకుంటుంది.. తెలుసా..!!

సాధాహరణంగా మోటార్ సైకిళ్లు ఇంగ్లాండ్ మరియు జర్మనీ వంటి దేశాలలో తయారయ్యాయి. కావున ఈ దేశాల్లో రోడ్డు యొక్క ఎడమ వైపున నడపడానికి నియమాలను కలిగి ఉన్నాయి. కావున ఆ నిబంధనలకు అనుకూలంగా మరియు వారి సౌలభ్యం కోసం, బైక్ యొక్క సైడ్ స్టాండ్ ఎడమ వైపున ఉంచబడింది. ప్రారంభం నుంచి ఈ పద్ధతి అమలులో ఉంది కావున ఈ నాటికి కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. కావున బైకులకు మరియు స్కూటర్లకు ఎడమవైపున సైడ్ స్టాండ్ ఉంటుంది.

బైకులకు సైడ్ స్టాండ్ ఎడమవైపు మాత్రమే ఎందుకుంటుంది.. తెలుసా..!!

ఒక వేళా మోటార్ సైకిల్స్ మరియు స్కూటర్లలో సైడ్ స్టాండ్ అనేది కుడివైపున ఉండాలంటే, వాటిలోని ఎగ్జాస్ట్ పైప్ మరియు బ్రేక్ పెడల్ వంటివన్నీ కూడా కుడివైపున ఉండాలి. ఇది బైక్ యొక్క అసలు వ్యవస్థనే అస్తవ్యస్తం చేస్తుంది. ఈ పై చెప్పిన కారణాల వల్ల బైకులు మరియు స్కూటర్స్ లో సైడ్ స్టాండ్ అనేది ఎడమవైపున మాత్రమే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మరియు బైకులు & కార్ల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందటానికి మా DriveSpark ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Why are bike side stands commonly placed on the left side important reasons
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X