డీజిల్‌తో నడిచే బైక్‌లు ఎందుకు ఉండవో తెలుసా.??.. కారణాలివే.!!
కార్లలో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ఇలా ఇంజిన్లలో వేరియంట్లు ఉంటాయి. కానీ బైక్‌లలో మాత్రం పెట్రోల్ వేరియంట్ మాత్రమే ఉంటుంది. ఇందులో డీజిల్(Diesel Bikes) కానీ సీఎన్‌జీ కానీ ఉండదు. ముఖ్యంగా డీజిల్ బైక్‌లను మీరు ఎక్కడా చూసి ఉండరు. ఇలా ఎందుకని మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా.. పూర్తి వివరాలు ఈ కథనంలో..
పెట్రోల్ ఇంజిన్‌తో పోలిస్తే డీజిల్ ఇంజిన్లు మెరుగైనవని ఆటో నిపుణులు చెబుతున్నారు. ఇలా ఆలోచిస్తే డీజిల్ బైక్‌లను తయారు చేయడం పెద్ద కష్టమైన పని కూడా ఏం కాదు. పెట్రోల్ ఇంజిన్‌తో పోలిస్తే డీజిల్ ఇంజిన్ సామర్థ్యం కూడా ఎక్కువ. టార్క్ శక్తి కూడా పెట్రోల్ వాటితో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. అయినా మనకు డీజిల్ ఇంజిన్ బైక్‌లు ఎక్కడా కనిపించవు.. ఇందుకు కారణాలేంటటే..

డీజిల్ ఇంజిన్ బైక్‌లను తయారు చేయకపోవడానికి ప్రధాన కారణాలను మెకానికల్ ఇంజినీర్లు వెల్లడించారు. పెట్రోల్ ఇంజిన్ కంటే డీజిల్ ఇంజిన్ బరువుగా ఉంటుంది అని చెబుతున్నారు. ఎందుకంటే డీజిల్ ఇంజిన్ తయారుచేయాలంటే విడి భాగాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇంజిన్‌ను చల్లబరిచేందుకు కూడా అధునాతన కూలింగ్ వ్యవస్థ అవసరం పడుతుంది.
డీజిల్ ఇంజిన్(Petrol Bikes vs Diesel Bikes) కోసం విడిభాగాలు, అధునాతన కూలింగ్ వ్యవస్థ.. ఇవన్నీ ఏర్పాటు చేసేసరికి ఇంజిన్ బరువు పెరిగిపోతుంది. దీంతో వాహన వేగం కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఎవరికైనా సరే బైక్‌ను తేలికగా, స్పీడ్‌ను రైడ్ చేయాలని కోరుకుంటారు. కానీ డీజిల్ ఇంజిన్ బైక్‌ల ద్వారా ఇది సాధ్యం కాదు. ఆటో కంపెనీలు వీటిని తయారుచేయకపోవడానికి ప్రధాన కారణమిదే..

ఇక పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే డీజిల్ ఇంజిన్ బైక్‌లకు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే బైక్ యజమానులకు వీటి నిర్వహణ ఖర్చులు భారంగా మారతాయని.. ఆటో నిపుణులు చెబుతున్నారు. ఇక పెట్రోల్ ఇంజిన్ బైక్‌లతో పోలిస్తే డీజిల్ ఇంజిన్ చేసే పెద్ద శబ్దాలు, అందులోని వైబ్రేషన్లు కూడా ఎక్కువగా ఉంటాయట.
రైడింగ్ సమయంలో డీజిల్ ఇంజిన్ చేసే శబ్దాలు చిరాకు పెడతాయని ఆటో నిపుణులు పేర్కొంటున్నారు. దీని ద్వారా ఇతర వాహనదారులకు కూడా ఇబ్బందిగా మారుతుంది. ఈ కారణాల వల్ల ఆటోమొబైల్ సంస్థలు డీజిల్ బైక్‌లను తయారు చేయవని చెబుతున్నారు. కాస్ట్, మెయింటెనెన్స్, నాయిస్ తదితర కారణాల వల్ల వీటికి దూరంగా ఉంటున్నారు.

కాగా 1990ల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ టారస్(Royal Enfield Taurus) పేరిట ఓ డీజిల్ బైక్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే ఈ బైక్ నిర్వహణ వ్యయాలు ఎక్కువ ఉన్నాయంటూ కంప్లెయింట్స్ వచ్చాయి. అంతేకాకుండా కస్టమర్లలో ఈ బైక్‌లపై క్రమంగా ఆసక్తి తగ్గిపోయింది. దీంతో సంస్థ ఈ బైకుల ఉత్పత్తిని నిలిపివేయడంతో ఆ తర్వాత.. మరే సంస్థ కూడా డీజిల్ బైక్‌లను ఉత్పత్తి చేయలేదు.

కాగా పెట్రోల్ బైక్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రముఖ టూ వీలర్ సంస్థ బజాజ్ ఆటో ఇండియా(Bajaj Auto India) త్వరలో సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేయనుంది. జూన్‌లో ఈ బైక్(Bajaj CNG Bike)ను విడుదల చేస్తున్నట్లు ఇటీవల రాజీవ్ బజాజ్ వెల్లడించారు. దీంతో ఈ బైక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications








