కార్లలో యాక్సిలరేటర్ పెడల్ కంటే బ్రేక్ పెడల్ ఎత్తులో ఉంటుంది ఎందుకు?

మీరు ఎప్పుడైనా గమనించారా.. కార్లలో యాక్సిలరేటర్ పెడల్ కంటే బ్రేక్ పెడల్ కొంచెం ఎత్తులో ఉంటుంది. ఇదేదో తయారీ లోపమో లేక మరేదైనా సమస్యో కాదు. దీని వెనుక ఓ పెద్ద కారణం ఉంది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కార్లలో యాక్సిలరేటర్ పెడల్ కంటే బ్రేక్ పెడల్ ఎత్తులో ఉంటుంది ఎందుకు?

సాధారణంగా, దాదాపు అన్ని కార్లలో యాక్సిలరేటర్ పెడల్ కంటే బ్రేక్ పెడల్ కొంచెం ఎత్తులో అమర్చబడి ఉంటుంది. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, కారును నడిపే డ్రైవర్ ఈ రెండు పెడల్స్ ని సులువుగా గుర్తించడానికి వీలుగా ఇలా అమర్చబడి ఉంటాయి. అంతేకాకుండా, మీరు ఈ రెండు పెడల్స్ డిజైన్‌ని కూడా గమనించినట్లయితే, బ్రేక్ పెడల్ పెద్దదిగా మరియు వెడల్పుగా ఉంటుంది. అయితే, యాక్సిలరేటర్ పెడల్ సన్నగా మరియు పొడవుగా ఉంటుంది.

కార్లలో యాక్సిలరేటర్ పెడల్ కంటే బ్రేక్ పెడల్ ఎత్తులో ఉంటుంది ఎందుకు?

ఈ రెండింటినీ వేర్వేరు ఎత్తులలో అమర్చడం వలన డ్రైవర్ కారును నడిపేటప్పుడు వీటిని సులువుగా గుర్తించి, అవసరమైన సమయంలో సరైన పెడల్ ను ఉపయోగించడం సాధ్యమవుతుంది. అలాకాకుండా, ఈ రెండు పెడల్స్ కూడా ఒకే ఎత్తులో అమర్చబడి ఉన్నట్లయితే, డ్రైవర్ బ్రేక్ పెడల్ నొక్కడానికి బదులుగా తెలియకుండా యాక్సిలరేటర్ పెడల్ నొక్కడం లేదా యాక్సిలరేటర్ పెడల్ నొక్కాల్సిన చోట బ్రేక్ పెడల్ నొక్కడం వంటి గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది.

కార్లలో యాక్సిలరేటర్ పెడల్ కంటే బ్రేక్ పెడల్ ఎత్తులో ఉంటుంది ఎందుకు?

బ్రేక్ మరియు యాక్సిలరేటర్ పెడల్స్ రెండూ కూడా ఒకే ఎత్తులో ఉంటే, డ్రైవర్ అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ పెడల్ నొక్కడానికి బదులు తెలియక యాక్సిలరేటర్ పై కాలు వేస్తే కారు ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి కారు డ్రైవర్ యాక్సిలరేటర్ పెడల్ మరియు బ్రేక్ పెడల్ రెండింటినీ విడివిడిగా ఉపయోగించడం చాలా అవసరం. అందుకే, ఇవి వేర్వేరు ఎత్తులలో అమర్చబడి ఉంటాయి.

కార్లలో యాక్సిలరేటర్ పెడల్ కంటే బ్రేక్ పెడల్ ఎత్తులో ఉంటుంది ఎందుకు?

కారులో ఉండే ఈ పెడల్స్ మీకు బాగా అలవాటైన తర్వాత, వాటి స్థానాలు మీ మైండ్ లో రిజిస్టర్ అయిపోతాయి. కాబట్టి, మీరు ప్రతిసారి ఈ పెడల్స్ ఏ స్థానంలో ఉన్నాయని క్రిందకి చూసుకోవాల్సిన అసరం ఉండదు. ఆటోమేటిక్ మీ కాలు సరైన పెడల్ పైకి వెళ్తుంది. అయితే, ఇలా ఈ రెండు పెడల్స్ వేర్వేరు ఎత్తులో ఉండటం గురించి చాలా మంది తరచూ డ్రైవర్లు ఫిర్యాదు చేస్తుంటారు.

కార్లలో యాక్సిలరేటర్ పెడల్ కంటే బ్రేక్ పెడల్ ఎత్తులో ఉంటుంది ఎందుకు?

యాక్సిలరేటర్ పెడల్ నుండి కాలుని పైకెత్తి బ్రేక్‌ పైడల్ నొక్కడం అసౌకర్యంగా ఉందని మరియు కాలు నొప్పి కూడా వస్తుందని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. అయితే, కార్లలో యాక్సిలరేటర్ పెడల్ మరియు బ్రేక్ పెడల్ రూపకల్పన వెనుక ఒక భద్రతా కారణం ఉందని చాలా మందికి తెలియదు. కానీ ప్రారంభ కాలంలో అందుబాటులోకి వచ్చిన కార్లలోని పెడల్స్‌లో ఈ డిజైన్ లేదు.

కార్లలో యాక్సిలరేటర్ పెడల్ కంటే బ్రేక్ పెడల్ ఎత్తులో ఉంటుంది ఎందుకు?

అంటే తొలినాళ్లలోని కార్లలో యాక్సిలరేటర్ పెడల్ మరియు బ్రేక్ పెడల్ రెండూ కూడా ఒకే ఎత్తులో ఉండేవి. చాలా కంపెనీల కార్లలో కూడా ఇదే డిజైన్ ఉండేది. ఈ కారణంగా, డ్రైవర్లు రకరకాల సమస్యలను ఎదుర్కున్నారు. ప్రత్యేకించి, అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్లు పెడల్స్ విషయంలో గందరగోళానికి గురయ్యి ప్రమాదాలబారిన పడేవారు.

కార్లలో యాక్సిలరేటర్ పెడల్ కంటే బ్రేక్ పెడల్ ఎత్తులో ఉంటుంది ఎందుకు?

ఆ సమయంలో చాలా మంది ప్రజలు బ్రేక్ పెడల్‌కు బదులుగా యాక్సిలరేటర్ పెడల్‌పై అడుగు పెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది డ్రైవర్లు తమకు తెలియకుండానే పెడల్స్ మార్చడం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయి. కాబట్టి గందరగోళాన్ని నివారించేందుకు తర్వాత రోజుల్లో పెడల్స్ డిజైన్ మార్చబడింది.

కార్లలో యాక్సిలరేటర్ పెడల్ కంటే బ్రేక్ పెడల్ ఎత్తులో ఉంటుంది ఎందుకు?

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న కార్లలో ఈ రెండు పెడల్స్ ని గమనించినట్లయితే, వీటి ఎత్తు ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా, లేటెస్ట్ కార్లలో యాంటీ స్లిప్ పెడల్స్ కూడా జోడించబడ్డాయి. ఇవి డ్రైవర్ కాలుని పొరపాటున కూడా జారిపోకుండా ఉండేలా గ్రిప్ తో పట్టి ఉంచుతాయి. ఒకవేళ మీ పాత కారులో ఈ పెడల్స్ పూర్తిగా అరిగిపోయినట్లు అనిపించినా లేదా బలహీనంగా ఉన్నట్లు గుర్తించినా వెంటనే వాటిని కొత్త వాటితో భర్తీ చేసుకోండి. అలాగే, ఆఫ్టర్ మార్కెట్లో లభించే నాసిరకం పెడల్ క్యాప్స్ లేదా కవర్స్ ని ఉపయోగించి అనవసరమైన ప్రమాదాలను కొని తెచ్చుకోకండి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇప్పటివరకు చాలామంది మదిలో మెదిలే ప్రశ్నకు సమాధానం దొరికిపోయింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు కొత్త బైకులు మరియు కొత్త కార్లను గురించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Why brake pedal sits higher than the accelerator pedal in car
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X