భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎందుకు అంత గిరాకీ.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..?

ఒకప్పుడు సెడాన్ బాడీ టైప్ కార్లకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ మరియు క్రేజ్ ఉండేది. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. కస్టమర్లు ఎక్కువగా సెడాన్ బాడీ టైప్ కార్ల కన్నా ఎస్‌యూవీలు మరియు హ్యాచ్‌బ్యాక్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా, ఇప్పుడు రోడ్లపై ఎలాంటి కార్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్‌యూవీ మార్కెట్ గణనీయంగా పెరిగింది. ప్రత్యేకించి ధర తక్కువగా ఉండే కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ మరింతగా పెరిగింది.

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎందుకు అంత గిరాకీ.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..?

భారతీయ వినియోగదారులు ఎక్కువగా మైక్రో, సబ్-కాంపాక్ట్, కాంపాక్ట్ మరియు ఫుల్-సైజ్ వంటి విభిన్న విభాగాలలో ఎస్‌యూవీలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. కార్ల తయారీ కంపెనీలు కూడా కొనుగోలుదారుల ఆసక్తికి అనుగుణంగా ఈ విభాగాల్లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందించడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం, భారతదేశంలో SUVల అమ్మకాలలో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో ఉంది. అంటే, మనదేశంలో ఎస్‌యూవీలకు డిమాండ్ ఎంత బలంగా ఉంటే అర్థమవుతోంది.

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎందుకు అంత గిరాకీ.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..?

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1 మిలియన్ (పది లక్షల యూనిట్ల) ఎస్‌యూవీలు విక్రయించబడుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ సర్వే ఇప్పుడు నిర్వహించినది కాదు. దాదాపు 3 సంవత్సరాల క్రితం 2019 లో నిర్వహించబడింది. అంటే, ఈ 3 ఏళ్లలో ఈ సంఖ్య మరికొన్ని లక్షల మేర పెరిగి ఉండవచ్చు. మరి ఈ విషయంలో కస్టమర్ల అభిరుచి పొడవాటి సెడాన్ కార్ల నుండి ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీల వైపుకు ఎలా మారింది? దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎందుకు అంత గిరాకీ.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..?

మనకు తెలిసినంతవరకు, రెనో డస్టర్ భారతదేశంలో మొట్టమొదటి ఎస్‌యూవీ మోడల్‌గా 2012లో మార్కెట్లో విడుదలైంది. అప్పటి వరకూ కొన్ని రకాల ఎస్‌యూవీలు మార్కెట్లోకి వచ్చి వెళ్లినప్పటికీ, డస్టర్ సాధించిన క్రేజ్ మరే మోడల్ దక్కించుకోలేకపోయింది. ఆ సమయంలో ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ ప్రవేశపెట్టిన డస్టర్ ఎస్‌యూవీకి మార్కెట్లో బలమైన డిమాండ్ ఏర్పడింది. దాని కాంపాక్ట్ డిజైన్ మరియు రగ్గడ్ లుక్ కారణంగా ఇది కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షించింది.

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎందుకు అంత గిరాకీ.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..?

అయితే, ప్రస్తుతం ఈ రెనో బ్రాండ్ భారత మార్కెట్‌లో పట్టు సాధించేందుకు చాలా కష్టపడుతోంది. కానీ, డస్టర్ ఎస్‌యూవీ మాత్రం భారతదేశంలో సుమారు 10 సంవత్సరాలుగా అమ్మకానికి ఉంది. అప్పట్లో భారతీయులు డస్టర్ రూపాన్ని కాస్త భిన్నంగా చూసారనేది నిజం. బాక్సీ టైప్ యుటిలిటీ వాహనాలకు భిన్నంగా ఉండే డస్టర్ రూపం కస్టమర్లను మొదటి చూపులోనే ఆక్టటుకునేది. డస్టర్ తర్వాత, అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ 2013లో ఎకోస్పోర్ట్ అనే కాంపాక్ట్ ఎస్‌యూవీని పరిచయం చేసింది.

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎందుకు అంత గిరాకీ.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..?

పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండి, స్టైలిష్ డిజైన్ మరియు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన మోడల్ ఇది. భారతదేశంలో ఎస్‌యూవీ కార్లు వేగంగా ప్రాచుర్యం పొందటానికి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కూడా ఓ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా, ఎకోస్పోర్ట్ మోడల్‌లో కంపెనీ టర్బో ఇంజన్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ఫోర్డ్ తన శక్తిని మరింత పెంచుకుంది. ఆ సమయంలో టర్బో పెట్రోల్ ఇంజన్ తో లభించిన ఏకైక మోడల్ కూడా ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కావటం విశేషం.

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎందుకు అంత గిరాకీ.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..?

ప్రయోజనాల పరంగా చూసుకుంటే, హ్యాచ్‌బ్యాక్‌లు మరియు ఎస్‌యూవీ మోడళ్ల కంటే సెడాన్ పరిమాణం పెద్దది. అయితే, ఎస్‌యూవీ కార్లలో ఇంటీరియర్ క్యాబిన్ చాలా సౌకర్యంగా ఉంటుంది ఎక్కువ లెగ్ రూమ్ మరియు హెడ్ రూమ్ లభిస్తుంది. కార్ల తయారీదారులు కూడా ఎస్‌యూవీ కార్ల కోసం విశాలమైన ఇంటీరియర్‌లను డిజైన్ చేయగలవు మరియు ఇంటీరియర్‌కు కావలసిన అదనపు ఫీచర్లను జోడించడానికి ఇది వారికి అనుమతిస్తుంది.

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎందుకు అంత గిరాకీ.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..?

అంతేకాకుండా, ఎస్‌యూవీలు మంచి రోడ్ ప్రజెన్స్ ను కలిగి ఉంటాయి. వీటి గంభీరమైన డిజైన్ మరియు లుక్ అండ్ ఫీల్ కూడా భారతీయ కస్టమర్లలో ఇవి బాగా ప్రాచుర్యం పొందడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. వెనుక వైపు డోరుపై స్పేర్ వీల్ తో వచ్చిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఆ ఒక్క డిజైన్ ఫీచర్ తోనే చాలా మందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం, మనదేశంలో లభిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఎక్కువ భాగం న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌లు మరియు టర్బో పెట్రోల్ ఇంజన్‌ల రూపంలో లభిస్తున్నాయి.

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎందుకు అంత గిరాకీ.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..?

సరైన ట్రాన్స్‌మిషన్ ఎంపికల కారణంగా ఇటువంటి టర్బో కార్లలో తగిన మైలేజీ కూడా అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు, హ్యుందాయ్ యొక్క ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) వేరియంట్ అధిక మైలేజీని అందిస్తుంది. వీటికి అదనంగా, తయారీదారులు SUV కార్లకు మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా అందించగలవు మరియు ఇది మన భారతీయ రహదారి పరిస్థితులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే అంశంగా చెప్పుకోవచ్చు.

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎందుకు అంత గిరాకీ.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..?

అలాగే, కార్ కంపెనీలు వెనుక స్టోరేజ్ ఏరియాను కూడా చక్కగా డిజైన్ చేసినట్లయితే ఇవి సుదూర ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటాయి. అయితే, పెద్ద పరిమాణంలో ఉండే వాహనాలలోని ఇంజన్ ఎక్కువ బరువును మోయవలసి ఉంటుంది, కాబట్టి, ఆ కారు మైలేజ్ కూడా తగ్గుతుంది. అందుకే కస్టమర్‌లు ఫుల్ సైజ్ ఎస్‌యూవీల కంటే కొంచెం చిన్న సైజులో ఉండే కాంపాక్ట్ ఎస్‌యూవీలనే ఎంచుకుంటుంటారు. కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లలో అద్భుతమైన మైలేజ్ మరియు తగినంత స్థలం ఉన్నందున వీటికి అధిక ప్రాధాన్యత లభిస్తోంది.

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎందుకు అంత గిరాకీ.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి..?

అందుకే ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలో కనీసం ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీనైనా విక్రయించాలని చూస్తున్నాయి. మనదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలు కూడా సుమారు రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్యలో ఉంటున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, మన మార్కెట్లోని దాదాపు అనేక కాంపాక్ట్ ఎస్‌యవీలు ఇప్పుడు సేఫ్టీలో కూడా బెస్ట్ అనిపించుకుంటున్నాయి. భద్రత విషయంలో సేఫ్టీ క్రాష్ టెస్టులలో అత్యుత్తమ రేటింగ్ ను దక్కించుకుంటున్నాయి.

Most Read Articles

English summary
Why compact suv segment became so popular in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X