డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటాయి, ఎందుకో తెలుసా?

ఐడిల్‌గా నిలిపి ఉంచిన డీజిల్ రైలింజన్లను ఆఫ్ చేయకుండా ఆన్‌లో ఉంచడం వెనకున్న అసలు కారణాలేంటో ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

By N Kumar

Recommended Video

What Does The ‘X’ On The Back Of Trains Mean? - DriveSpark

డీజల్ రైళ్లు జంక్షన్లు, ప్రధానమైన స్టేషన్లు మరియు క్రాసింగ్ వద్ద గంటల తరబడి నిలిచిపోతాయి. అయితే, గంటల తరబడి నిలిచిపోయినప్పటికీ నిరంతరం ఆన్‌లోనే ఉంటాయి. వాటిని అస్సలు ఆఫ్ చేయరు. కదలకుండా ఉండే రైళ్లను ఆన్‌లో ఉంచి రోజుకు కొన్ని వేల లీటర్ల డీజిల్‌ను ఇండియన్ రైల్వే ఎందుకు వ్యర్థం చేస్తోంది.

ఐడిల్‌గా నిలిపి ఉంచిన డీజిల్ రైలింజన్లను ఆఫ్ చేయకుండా ఆన్‌లో ఉంచడం వెనకున్న అసలు కారణాలేంటో ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకు ఉంటాయి

డీజిల్ రైలింజన్లు జీవిత కాలం ఆన్‌లో ఉండవు. పట్టాలెక్కి ప్రయాణిస్తున్నపుడు జంక్షన్లు లేదా క్రాసింగుల వద్ద ఆగాల్సిన వచ్చినపుడు ఎంత ఎక్కువ సమయం ఆన్‌లో ఉంటాయి. తరచూ రైళ్లలో ప్రయాణించే వారు బహుశా దీనిని గుర్తించి ఉంటారు.

డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకు ఉంటాయి

ప్రయాణం చేస్తూ స్టేషన్లలో నిలిచే ప్రతి డీజిల్ రైలింజన్ తప్పనిసరిగా ఆన్‌లోనే ఉండటం అనేది సర్వసాధారణం. మరియు ఇది తప్పనిసరి కూడా. లీకేజీ కారణంగా నష్టపోయే ఎయిర్‌ప్రెజర్‌ను ఎప్పటికప్పుడు నింపేందుకు ఇది తప్పనిసరి.

డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకు ఉంటాయి

ఎయిర్‌ప్రెజర్ నింపడానికి ఇంజన్ ఆన్‌లో ఉండానికి మధ్య లింకేంటి అని ఆలోచిస్తున్నారా...? స్టేషన్లో ఆగి ఉన్న రైళ్లను గమనించినట్లయితే, భోగీల క్రింద గాలి లీకవుతున్నట్లు తుస్ అనే శబ్దం రావడం ఆగిపోవడం, మళ్లీ రావడం ఆగిపోవడం జరుగుతుంది. ఇలా కనుక జరిగితే బ్రేకులు పడటం కష్టమవుతుంది. ఎందుకంటే రైళ్లలో ఎయిర్ బ్రేకులు ఉంటాయి.

డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకు ఉంటాయి

ఇలా నష్టపోయే గాలిని భర్తీ చేసేందుకు ఇంజన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. ఒక వేళ ఇంజన ఆఫ్ చేసి, రైలు కదలడానికి సిద్దమైనపుడు ఆన్ చేస్తే, బ్రేకులు వేయడానికి కావాల్సిన ఎయిర్ ప్రెజర్ తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. ఎంత అంటే, ఆగి ఉన్న సమయం కంటే ఎక్కువ.

డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకు ఉంటాయి

రైళ్లు చాలా పొడవుగా ఉంటాయి. ప్రతి భోగీకి కూడా బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి రైలు మొత్తం ఉన్న బ్రేకింగ్ వ్యవస్థకు సరిపడా ఎయిర్ ప్రెజర్ ఉండాలి. వీలైనంత ఎయిర్ ప్రెజర్ ఉంటేనే బ్రేకులు సమర్థవంతంగా పడతాయి. కాబట్టి, ఎంత డీజల్ నష్టపోయినా బ్రేక్ లైన్ ప్రెజర్ విషయంలో లోకో పైలట్లు అస్సలు రాజీపడరు.

డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకు ఉంటాయి

డీజిల్ రైలింజన్లు నిరంతరం ఆన్‌లో ఉండటానికి మరో కారణం ఉంది. ఈసారి కారణం ఇంజన్‌లోనే ఉంది. డీజిల్ రైల్ ఇంజన్ ఎక్కువ సేపు ఆన్‌లో లేకపోయినా... ఆ ప్రదేశంలో వాతావరణం చల్లగా ఉన్నా... ఆఫ్ చేసిన ఇంజన్ మళ్లీ ఆన్ చేయడం చాలా కష్టతరం. ఒక్కోసారి డీజిల్ ఇంజన్ పూర్తిగా ఆన్ అయ్యేందుకు 10 నుండి 20 నిమిషాలు పడుతుంది.

డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకు ఉంటాయి

రైళ్లలో ఉండే డీజిల్ ఇంజన్‌లు 16 సిలిండర్లతో చాలా పెద్దగా ఉంటాయి. ఇంజన్ స్టార్ట్ అయ్యే విషయానికి వస్తే, పెట్రోల్ ఇంజన్‌లలో ఇంధనం మండించడానికి స్పార్క్ ప్లగ్ ఉంటుంది. కానీ, డీజల్ ఇంజన్‍‌లో మాత్రం సిలిండర్లోని పిస్టన్ కదలికల ఆధారంగా ఉత్పత్తి అయ్యే వేడి ద్వారా నాజిలో స్ప్రే చేయబడిన డీజిల్ చుక్కలు మండటంతో ఇంజన్ ఆన్ అవుతుంది. పెద్ద పెద్ద ఇంజన్‌లలో ఇది చాలా కష్టతరం.

డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకు ఉంటాయి

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... డీజిల్ ఇంజన్ రైళ్లు నడుస్తున్నప్పటి కంటే ఐడిల్‌గా ఆగి ఉన్నపుడే ఎక్కువ డీజిల్ తీసుకుంటాయి. రైల్లో ఉన్న బ్యాటరీలు ఛార్జ్ అవడం మరియు బ్రేక్స్ కోసం కావాల్సిన ఎయిర్ ప్రెజర్ ఉత్పత్తి చేయడానికే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది.

డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకు ఉంటాయి

ఈ మధ్య కాలంలో రైళ్లలో ఆక్సిలరీ పవర్ యూనిట్(APU) అనే వ్యవస్థ వచ్చింది. ఇది ఐడిల్‌గా ఆగి ఉన్న డీజిల్ రైలింజన్లు తక్కువ ఇంధన వినియోగం కోసం ఉపయోగపడుతుంది. అంటే, బ్యాటరీ ఛార్జింగ్ మరియు ఎయిర్ ప్రెజర్ కోసం అదనంగా వేరొక వ్యవస్థ ఉంటుంది. కాబట్టి డీజిల్ ఇంజన్ మీద ఆదారపడాల్సిన అవసరం ఉండదు. APU ఇప్పుడు విమానాల్లో కూడా వచ్చింది.

డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకు ఉంటాయి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ రైల్వేలో డీజిల్ రైళ్లు నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి. ఎక్కువ ఇంధన వినియోగం మరియు నిర్వహణ సమస్యలు అధికమవ్వడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. డీజిల్ ఇంజన్‌లతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ రైళ్లు అత్యంత శక్తివంతమైనవి. కానీ, పొగను ఎగజిమ్ముతూ పరుగులు పెట్టే రైళ్లంటే ఇష్టపడేవారు అధికంగానే ఉన్నారు.

డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకు ఉంటాయి

రైలు ప్రయాణం ఎంతో సరదా...కాని రైలు నడిపే వారికి అదో నరకం..!!

స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ నడుస్తోన్న బ్రిటీష్ సొంత రైల్వే

300 టన్నుల బంగారు రైలు దక్కించుకోవాలనే వారి కోరిక తీరుతుందా?


ఫోర్డ్ చేసిన అవమానానికి రతన్ టాటా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు:

ఫోర్డ్ చేసిన అవమానానికి రతన్ టాటా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు

"మీకు కార్లు గురించే తెలియదు, అలాంటప్పుడు ప్యాసింజర్ కార్ల డివిజన్‌లోకి ఎందుకు ప్రవేశించారు ?" అని ఫోర్డ్ రతన్ టాటా గారిని ప్రశ్నించింది. సరిగ్గా తొమ్మిది సంవత్సరాల అనంతరం అమెరికాకు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీని రతన్ టాటా పూర్తిగా కొనేశాడు.

ఫోర్డ్ చేసిన అవమానానికి రతన్ టాటా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు

ఫోర్డ్ మీద రతన్ టాటా రివెంజ్ ఏమిటి ? 1998 లో టాటా మోటార్స్ ఇండికా హ్యాచ్‌బ్యాక్ కారుతో ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. తొలికారుతోనే టాటా ప్యాసింజర్ కార్స్ విభాగం అపజయాన్ని రుచి చూసింది. 1998లో టాటా ఇండికా తీవ్ర విఫలం చెందింది.

ఫోర్డ్ చేసిన అవమానానికి రతన్ టాటా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు

ఇండికా కారు మీద టాటా పెట్టుకున్న ఆశలు చివరికి ఆవిరయ్యాయి. చేసేదేమీ లేక, రతన్ టాటా మరియు అతని బృందం ఫోర్డ్ సహకారం కోసం అమెరికాకు వెళ్లారు. ప్యాసింజర్ కార్ల వ్యాపారంలో ఎక్కువ ఆసక్తికనబరిచిన డెట్రాయిట్‌లోని ఫోర్డ్ ప్రతినిధుల వద్దకు వెళ్లారు.

ఫోర్డ్ చేసిన అవమానానికి రతన్ టాటా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు

మధ్య అమెరికాలో అప్పట్లో ఫోర్డ్ అతి ముఖ్యమైన ఆటోమొబైల్ సంస్థగా ఉండేది. ఫోర్డ్ హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని డెట్రాయిట్‌లో ఫోర్డ్ బృందంతో టాటా గ్రూప్ ప్రతినిధులు సుమారుగా మూడు గంటల పాటు సమావేశమయ్యారు. అయితే ఫోర్డ్ నుండి ఎలాంటి సానుకూల స్పందనం లభించకపోగా, చేదు అనుభవం ఏదురైంది.

ఫోర్డ్ చేసిన అవమానానికి రతన్ టాటా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు

"మీకు కార్ల గురించి తెలియనప్పుడు, ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లోకి ఎలా వచ్చారు. మేము చేసే సహాయంతో ఏమిటంటే మీ సంస్థను పూర్తిగా పోర్డ్ స్వాధీనం చేసుకోవడం, ఆ తరువాత కూడా ఫోర్డ్‌గానే కొనసాగడం" అని ఫోర్డ్ చైర్మన్ భిల్ ఫోర్డ్ రతన్ టాటాతో అన్నారు.

ఫోర్డ్ చేసిన అవమానానికి రతన్ టాటా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు

బిల్ ఫోర్డ్ నుండి ఈ మాటలు విన్న తరువాత, రతన్ టాటా మరియు అతని బృందం మారు మాట్లకుండా అక్కడి నుండి నిరాశతో వెనుతిగారు. అయితే కొద్ది కాలానికే ఫోర్డ్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో పట్టును కోల్పోవడం, టాటా మోటార్స్ బాగా రాణించడం జరిగింది.

ఫోర్డ్ చేసిన అవమానానికి రతన్ టాటా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు

2008లో, ఫోర్డ్ మోటార్స్ నష్టాల్లోకి కూరుకుపోయింది, ఆ సందర్భంలో ఫోర్డ్ మోటార్స్‌ను రతన్ టాటా గారు రక్షించడానికి ముందుకు వచ్చారు. నష్టాల్లో కూరుకుపోయిన ఫోర్డ్‌ను గట్టెక్కించడానికి ఫోర్డ్ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థను రతన్ టాటా గారు కొనుగోలు చేశారు.

ఫోర్డ్ చేసిన అవమానానికి రతన్ టాటా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు

ఫోర్డ్ నెలకొల్పిన లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూశాం. ఆ సమయంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేయడానికి రతన్ టాటా గారుముందుకొచ్చారు. జెఎల్ఆర్‌ను కొనుగోలు చేసి ఆదుకున్నందుకు బిల్ ఫోర్డ్ స్వయంగా ధన్యవాదాలు చెప్పారు.

ఫోర్డ్ చేసిన అవమానానికి రతన్ టాటా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు

2014 లో రతన్ టాటా తరపున వైబి చవన్ నేషనల్ అవార్డు అందుకున్న ప్రవీన్ పి కడల్ మాట్లాడుతూ, 1999లో భారత్‌కు తెలియని అమెరికాలో వారికి ఎదురైన అవమానం గురించి చెప్పుకొచ్చారు. ఫోర్డ్ బృందంతో చర్చలు జరపడానికి రతన్ టాటాతో వెల్లిన ప్రవీన్ ఇప్పుడు టాటా క్యాపిటల్‌కు సిఇఒగా ఉన్నారు.

ఫోర్డ్ చేసిన అవమానానికి రతన్ టాటా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు

మీకు కార్ల గురించి ఏం తెలుసని హేళన చేసిన కంపెనీనే కొనుగోలు చేసి రతన్ టాటా ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రతి భారతీయుడి గర్వించదగిన ఈ సంఘటనను మీ స్నేహితులతో పంచుకోండి...

Most Read Articles

English summary
Read In Telugu: Why Are Diesel Trains Never Turned Off? — Yes, Diesel Train Engines Are Always ON!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X