ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

మీకు తెలుసా? జెట్ విమానాలు అత్యవసరంగా ల్యాండ్ కావటానికి ముందుగా కొంత ఇంధనాన్ని గాలిలోనే వదిలివేస్తాయని. ఇలా చేయడం వెనుక ఓ పెద్ద కారణం ఉంది, అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

విమానాలు తరచూ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయ్యేటప్పుడు పరిమిత గరిష్ట ల్యాండింగ్ బరువు కంటే, ఎక్కువ బరువుతో బయలుదేరుతాయి. ఇలా చేయడం వలన చాలా కఠినమైన ల్యాండింగ్ పరిస్థితుల్లో కూడా విమానం దెబ్బతినకుండా ల్యాండ్ చేయటం సాధ్యమవుతుంది.

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

సాధారణంగా ఒక విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు పూర్తి ఇంధనం మరియు పూర్తి ప్యాసింజర్/లగేజ్ సామర్థ్యంతో బయలుదేరుతుంది. ఫ్లైట్ జర్నీ కొనసాగే కొద్ది అందులోని ఇంధనం మండిపోతూ, విమానం తేలికగా మారుతుంది. అలాంటప్పుడు, ల్యాండింగ్ సమయంలో విమానంలోని అదనపు బరువు, నిర్దేశిత ఎయిర్‌క్రాఫ్ట్ క్యారీ చేయాల్సిన బరువుతో మ్యాచ్ అవుతుంది.

MOST READ:పాకిస్థాన్ క్రికెటర్ 'షోయబ్ మాలిక్' కార్ యాక్సిడెంట్ ; తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

ఈ ప్రక్రియ యధావిధిగా కొనసాగితే టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ఎలాంటి సమస్య లేకుండా సరైన బరువుతో, సరైన రీతిలో టేకాఫ్/ల్యాండింగ్ జరుగుతుంది. కానీ, ఒకవేళ విమానం టేకాఫ్ అయిన కొంత సమయానికే ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా లేదా ప్రయాణీకుల వైద్య సమస్య కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినా, అందులోని ఇంధనం పూర్తిగా కాలిపోదు, ఫలితంగా నిర్దేశిత బరువు కన్నా అదనపు బరువుతోనే విమానం ల్యాండ్ కావల్సి వస్తుంది.

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

అలాంటి పరిస్థితుల్లో విమానంలోని గరిష్ట బరువును తగ్గించడానికి పైలట్ అందులోని ఇంధనాన్ని గాలిలోనే డంప్ చేయాల్సి వస్తుంది. ఎమెర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంలో పైలట్‌కు మూడు ఆప్షన్లు ఉంటాయి.

MOST READ:మీకు తెలుసా.. 2021 కవాసకి నింజా 650 బైక్, ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా..

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

అందులో ఒకటి గరిష్ట ల్యాండింగ్ బరువుకు చేరుకునేందుకు గాను వీలైనంత ఇంధనాన్ని మండించడానికి విమానాన్ని ఎక్కువసేపు గాలిలో ఎగిరించడం, కానీ అత్యవసర పరిస్థితుల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. కాగా, ఇందులో రెండవ ఆప్షన్ విమానాన్ని అధిక బరువుతోనే నేలపై ల్యాండింగ్ చేయటం, ఇది కూడా సాహసోపేతమైన చర్యగానే చెప్పుకోవచ్చు.

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

ఇకపోతే, మూడవది ఇంధనాన్ని గాలిలోనే డంప్ చేయటం. ఇది చాలా సులువైనది మరియు కొన్ని సందర్భాల్లో సురక్షితమైనది. కంట్రోల్ రూమ్ ఆదేశాల మేరకు, విమానంలో పరిస్థితిని బట్టి పైలట్ ఈ మూడు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

MOST READ:గుడ్ న్యూస్.. రెనాల్ట్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్.. ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

ఉదాహరణకు, క్యాబిన్ లోపల సిబ్బంది అగ్నిని ఆర్పేందుకు ప్రయత్నిస్తూ, ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన అవసరం వస్తే, అలాంటప్పుడు ఇంధనాన్ని గాలిలో డంప్ చేయటం బెస్ట్ ఆప్షన్ కాదు. ఇలా చేయటం వలన ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది, కాబట్టి నేరుగా అధిక బరువుతోనే విమానాన్ని ల్యాండ్ చేయటం మంచిది.

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

అలా కాకుండా, విమానంలో ఏదైనా ఒక హైడ్రాలిక్ సమస్య ఏర్పడినట్లయితే, అలాంటి సందర్భంలో వెంటనే ల్యాండింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా, పైలట్‌కు అధిక సమయం లభిస్తుంది. కాబట్టి, ఇటువంటి సందర్భాల్లో పైలట్ తగినంత ఇంధనాన్ని కాల్చడం లేదా దానిని గాలిలో డంప్ చేయడం వంటివి చేయవచ్చు.

MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

సాధారణంగా పెద్ద విమానాలు ల్యాండింగ్ బరువును తగ్గించడానికి ఇంధనాన్ని గాలిలో డంప్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇంధనాన్ని డంప్ చేయడం వల్ల విమానం యొక్క బరువు చాలా త్వరగా తగ్గుతుంది. పైలట్ కొన్ని నిమిషాల్లో వేల పౌండ్ల ఇంధనాన్ని డంప్ చేయవచ్చు.

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

అయితే, పైలట్ తన స్వంత నిర్ణయంతో ఇంధనాన్ని డంప్ చేయటానికి అనుమతి ఉండదు. ఇందుకు తప్పనిసరిగా వారు గ్రౌండ్ యూనిట్ నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది. గాలిలో ఎక్కడ పడితే అక్కడ ఇంధనాన్ని డంప్ చేయకూడదు. ప్రత్యేకించి, విమానం భూమిపై నుండి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుప్పుడు లేదా ప్రజలు నివసించే ప్రాంతాల్లో దీనిని డంప్ చేయకూడు.

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

ఫ్యూయెల్ డంపింగ్ కోసం పైలట్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ఫ్యూయెల్‌ను డంప్ చేయటానికి పైలట్లు విమానాన్ని అధిక ఎత్తుకు ఎగిరించాల్సి ఉంటుంది. విమానంలోని ఈ ఇంధనాన్ని అధిక ఎత్తు నుండి గాలిలోకి వదిలినప్పుడు, ఇది భూమిని చేరుకునే లోపే ఆవిరైపోతుంది. ఫలితంగా, వాతవరణానికి, జీవ సముదాయానికి ఎలాంటి ప్రమాదం వాటిళ్లదు.

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో జెట్ విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి?

అలా కాకుండా, విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు ఇంధనాన్ని డంప్ చేసినట్లయితే, అది ప్రకృతిపై మరియు జీవరాశిపై దుష్ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, ఈ ఇంధనాన్ని మనుషులు నివసించే ప్రాంతంలో డంప్ చేసినట్లయితే, అది వారి చర్మంపై పడినా లేదా దాని గాలిని వారు పీల్చినా చర్మ, కళ్ల సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే, జెట్ విమానాలు ఎమెర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఇంధనాన్ని గాలిలో డంప్ చేస్తుంటాయి.

Most Read Articles

English summary
Why Do Jet Plane Dump Fuel Before Emergency Landing; Reasons Explained. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X