విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో టాయిలెట్‌కు ఎందుకు వెళ్లకూడదో తెలుసా..?

విమానంలో ప్రయాణం చేయడం చాలా మందికి ఇప్పటికీ ఓ కల. గతంతో పోలిస్తే తక్కువ ధరలకే విమాన టికెట్లు అందుబాటులోకి వచ్చినా.. ఇప్పటికీ ఒకసారి కూడా విమాన ప్రయాణం చేయనివారు చాలా మందే ఉంటారు. అయితే తరచూ విమాన ప్రయాణాలు చేసేవారికి భద్రతపరంగా కొన్ని అంశాలపై అవగాహన ఉంటుంది.

అయితే కొత్తవారికి విమానంలో ప్రయాణంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదనే అంశాలపై సరైన అవగాహన ఉండదు. అయితే ఫ్లైట్‌ జర్నీ సమయంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. విమానాల్లో తరచూ ప్రయాణాలు చేస్తున్నవాళ్లు కొత్తగా ప్రయాణం చేస్తున్నవారికి కొన్ని సలహాలు ఇస్తుంటారు. ఫ్లైట్‌ ఎక్కేముందే టాయిలెట్‌కు వెళ్లాలని, అనంతరమే విమానం ఎక్కాలని సూచిస్తుంటారు.

flight passengers not allowed to use toilets

అలా ఎందుకు చెప్పారో వారికి, మీకు సరైన సమాచారం తెలియకపోవచ్చు. దాని వెనుక భద్రతా పరంగా ముఖ్యమైన కారణం ఉంది. అయితే ఇది సూచన మాత్రం కాదు. అంతర్జాతీయ విమానయాన చట్టం ప్రకారం అందరూ పాటించాల్సిన నియమం. విమాన ప్రయాణాల్లో కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి విమానం టాయిలెట్‌లో ఉన్నప్పుడు పైలెట్‌ టేకాఫ్‌, ల్యాండింగ్‌ చేయకూడదు. విమానం ప్రయాణంలో టేకాఫ్‌, ల్యాండింగ్‌ దశలు అత్యంత ప్రమాదకరమైనవి. ఆ సమయంలో విమానంలోని ప్రయాణికులు తిరిగేందుకు, కనీసం నిల్చోనేందుకు కూడా అనుమతి ఉండదు. ఆ సమయాల్లో సీటు బెల్టులు తప్పనిసరిగా ధరించి తమ సీట్లలోనే కూర్చోవాలి.

flight passengers not allowed to use toilets

విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో ప్రయాణికులు సహా ఎవరూ కూడా టాయిలెట్‌ను వినియోగించేందుకు అనుమతి ఉండదు. ఎందుకంటే విమాన క్యాబిన్‌లో టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయాల్లో ప్రయాణికులకు సరైన భద్రత ఉంటుంది. అదే టాయిలెట్‌లో సీట్‌ బెల్టుల వంటి భద్రత ఉండదు. ఫలితంగా టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో టాయిలెట్‌లో ఉంటే ప్రమాదాలకు గురైయ్యే అవకాశం ఉంటుంది.

అందువల్ల ఈ రెండు సమయాల్లో టాయిలెట్‌కు వెళ్లేందుకు ప్రయాణికులను అనుమతించరు. విమానం పూర్తిగా ల్యాండింగ్‌ అయ్యాక లేదా టేకాఫ్‌ తర్వాత పూర్తి ఎత్తుకు చేరుకున్నాక మాత్రమే టాయిలెట్‌కు వెళ్లేందుకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ సీట్ల వద్ద నిల్చోనేందుకు ఫ్లైట్‌ అటెండెంట్లు అనుమతి ఇస్తారు.

flight passengers not allowed to use toilets

ఏదైనా విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో కూలిపోయి, పూర్తిగా ధ్వంసమైతే.. సీట్‌ నంబర్‌ ప్రకారం మృతదేహాలను గుర్తిస్తారు. అంటువంటి సమయంలో విమానం టాయిలెట్‌లో ఉంటే వారిని గుర్తించడం కష్టం అవుతుంది. విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయాల్లో టాయిలెట్‌కు వెళ్లేందుకు ఫ్లైట్‌ అటెండెంట్లు అనుమతి ఇవ్వకుంటే నేరుగా సీట్‌ వద్దకు వచ్చి కూర్చోవాలి. వారితో వాగ్వాదానికి దిగకూడదు. వారి విధులకు ఆటంకం కలిగించకూడదు. అటువంటి చర్యలు నేరంగా పరిగణించబడే అవకాశం ఉంటుంది.

అందువల్ల విమాన ప్రయాణానికి ముందే టాయిలెట్‌కు వెళ్లడం మంచిది. టేకాఫ్‌ అనంతరం విమానం సురక్షితమైన ఎత్తుకు చేరిన తర్వాత టాయిలెట్‌ను వినియోగించుకోవచ్చు. ల్యాండింగ్‌ పూర్తిగా అయ్యాక కూడా టాయిలెట్‌ రూంకు వెళ్లవచ్చు. ముఖ్యంగా విమాన ప్రయాణంలో ఫ్లెట్‌ అటెండెంట్లు చెప్పినట్లుగా నడుచుకోవాలి.

flight passengers not allowed to use toilets

డ్రైవ్‌స్పార్క్‌ వ్యాఖ్య: విమానం ఎక్కే ముందు టాయిలెట్‌కు వెళ్లడం ఉత్తమం. అనివార్య పరిస్థితుల్లో విమానంలో టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో టాయిలెట్‌ ఉపయోగించాల్సి వస్తే ఫ్లైట్‌ అటెండెంట్లను సంప్రదించాలి. వారు అనుమతి ఇస్తే వెళ్లవచ్చు. లేకుంటే వారి నుంచి అనుమతి వచ్చే వరకు సీట్లలోనే కూర్చోవాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, July 31, 2023, 16:31 [IST]
English summary
Why flight passengers are not allowed to use toilets during takeoff and landing
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+