తన తండ్రికి ఇన్నోవా క్రిస్టాను గిఫ్టుగా ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్.. దాని ఫీచర్లు ఇవే !

ఒక వ్యక్తికి జీవితంలో మొదటిసారి గిఫ్టులు ఇచ్చేది తల్లిదండ్రులే. పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత తిరిగి తల్లిదండ్రులకు బహుమతులు ఇచ్చి వారిని సంతోషపెడతారు. పిల్లలు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడం చూస్తే వారికి ఎప్పుడూ సంతోషమే. దానితో పాటు వారు మనస్ఫూర్తిగా కొన్ని బహుమతులు కూడా ఇస్తే ఆ తల్లిదండ్రుల కంటే సంతృప్తి చెందిన వారు ఇంకెవరూ ఉండరు.

ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఓ హీరోయిన్ తన తండ్రికి సరికొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) కారును బహుమతిగా ఇచ్చింది. ఆమె మరెవరో కాదు, ఎం.ఎస్. ధోని అన్‌టోల్డ్ స్టోరీ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దిశా పటాని (Disha Patani). 2015లో విడుదలైన లోఫర్(Loafer) అనే తెలుగు సినిమాతో దిశా సినీ రంగ ప్రవేశం చేసింది.

Disha Patani

మధ్యలో చైనీస్ సినిమాల్లో నటించి అంతర్జాతీయంగా కూడా దిశా గుర్తింపు పొందింది. గత సంవత్సరం కల్కి 2898 AD (Kalki 2898 AD), కంగువా (Kanguva) చిత్రాల్లో దిశా నటించింది. ఇందులో కల్కి భారీ విజయం సాధించగా, కంగువా భారీ ఫ్లాప్‎గా నిలిచింది. అక్షయ్ కుమార్ నటించిన వెల్‌కమ్ టు జంగిల్(Welcome to Jungle) సహా అనేక చిత్రాలతో దిశా ప్రస్తుతం బాలీవుడ్‌లోని హీరోయిన్లలో ఒకరిగా ఉంది.

సినిమాల్లో హీరోయిన్ పాత్రలతో పాటు ఐటమ్ సాంగ్స్‌ చేసి కూడా దిశా వేలాది మందిని అభిమానులుగా మార్చుకుంది. ఫిట్‌నెస్-ఫోకస్ పోస్ట్‌లతో సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్‎గా మారిపోయింది. ఇప్పుడు సినిమా లేదా ఫ్యాషన్‌కు సంబంధం లేకుండా తన తండ్రికి కారు కొనిచ్చి దిశా వార్తల్లో నిలిచింది. దిశ తన ఇంటి కోసం ప్లాటినం వైట్ పర్ల్ (Platinum White Pearl) రంగులో ఉన్న ఇన్నోవా క్రిస్టా కారును కొనుగోలు చేసింది.

Disha Patani

దిశా తల్లి పద్మ పటాని (Padma Patani), తండ్రి జగదీష్ సింగ్ పటాని (Jagdish Singh Patani), సోదరి ఖుష్బు (Khushboo) హిందూ ఆచారాలు పాటించిన తర్వాత కారు తాళాలను స్వీకరించారు. వృత్తి రీత్యా ముంబైలో స్థిరపడిన దిశా, తన సొంత ఇంటికి, ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి (Bareilly), తాత్కాలిక నంబర్‌ప్లేట్ కూడా లేని కారును డెలివరీ చేయించింది. బరేలీలోని టయోటా డీలర్‌షిప్ అధికారులు దీనికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

జపనీస్ వాహన తయారీ సంస్థ టయోటా ప్రముఖ ఎంపీవీ (MPV) ఇన్నోవా సెకండ్ జనరేషన్ వెర్షనే ఇన్నోవా క్రిస్టా. కొత్త తరం ఇన్నోవా హైక్రాస్(Innova Hycross)తో పాటు టయోటా క్రిస్టాను కూడా విక్రయిస్తోంది. హైక్రాస్ వచ్చినా క్రిస్టాను కొందరు ఇప్పటికీ ఇష్టపడుతున్నారు. క్రిస్టా వైట్ - ప్లాటినం వైట్ పర్ల్, సూపర్‌వైట్, సిల్వర్ మెటాలిక్, అవంత్ గార్డ్ బ్రాంజ్ మెటాలిక్, ఆటిట్యూడ్ బ్లాక్ మైకా అనే ఐదు రంగులలో లభిస్తుంది.

Disha Patani

ప్రస్తుతం క్రిస్టా డీజిల్ పవర్‌ట్రైన్ (Diesel Powertrain) ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. 150 hp పవర్, 343 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ క్రిస్టాకు ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్-ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌నే చాలా మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఆపిల్ కార్‌ప్లే(Apple CarPlay), ఆండ్రాయిడ్ ఆటో(Android Auto) ఉన్న 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, యాంబియంట్ లైటింగ్, మడతపెట్టే సీట్ బ్యాక్ టేబుల్స్, ప్యాసింజర్ సీట్లకు సులభమైన స్లైడ్ ఫంక్షన్, రెండవ వరుసకు వన్-టచ్ టంబుల్ వంటి ఫీచర్లు కొత్త క్రిస్టాలో ఉన్నాయి.

వైర్‌లెస్ ఛార్జర్‌లు, వెల్‌కమ్ డోర్ ల్యాంప్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి విస్తృతమైన యాక్సెసరీలను కూడా టయోటా ప్రీమియం ఎంపీవీలో అమర్చింది. ఏడు SRS ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), బ్రేక్ అసిస్ట్ వంటి విస్తృతమైన సేఫ్టీ ఫీచర్లు కూడా క్రిస్టాకు లభిస్తాయి. క్రిస్టా ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.99 లక్షల నుంచి రూ. 26.82 లక్షల వరకు ఉంది.

చాలా తక్కువ కాలంలో రూ. 26 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించిన దిశా, తన తండ్రికి క్రిస్టా బహుమతిగా ఇవ్వడం కొందరికి కాస్త తక్కువ అనిపించవచ్చు. బహుశా క్రిస్టా కావాలని దిశ తండ్రి భావించి ఉండొచ్చు.

మెర్సిడెస్ బెంజ్ S450 (Mercedes Benz S450), ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB (Land Rover Range Rover Autobiography LWB), BMW 7 సిరీస్ (BMW 7 Series), రేంజ్ రోవర్ స్పోర్ట్ HSE (Range Rover Sport HSE) వంటి కార్లు దిశ గ్యారేజీలో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 28, 2025, 13:30 [IST]
English summary
Why innova crysta disha patanis heartwarming gift to her dad raises questions
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+