"O" అక్షరంతో ఎండ్ అయ్యే మహీంద్రా వాహనాలు: ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా వారి అన్ని టూ వీలర్లు, కార్లు, ఎస్‌యూవీలు మరియు ట్రక్కుల పేర్లు O అక్షరంతో ముగిసిపోతాయి. ప్రతి వాహనం పేరు చివరిలో "O" అక్షరాన్ని వాడటం వెనకున్న సీక్రెట్స్ ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి...

జీవితం అస్సలు కలిసిరాలేదని ఎంతో మంది సంఖ్యా శాస్త్ర నిపుణులను ఆశ్రయిస్తుంటారు. అనుకున్నది ఏదీ జరగలేదు అన్ని ఆటంకాలే ఎదురౌతున్నాయిని చెప్పుకున్నపుడు, మీ పేరులో దోషం, పేరు బలం లేదు, మీ పేరులో కొన్ని మార్పులు చేసుకోండని న్యూమరాలజీ ప్రకారం సంఖ్యా శాస్త్ర నిపుణుల అనేక సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఇదంతా ఇప్పటి వరకు వ్యక్తులకే పరిమితమై ఉండేది. కానీ మహీంద్రా వాహనాల పేర్లను చూస్తే, వీరు కూడా ఖచ్చితంగా న్యూమరాలజీని ఫాలో అవుతున్నారని చెప్పవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ బృందం మహీంద్రా వాహనాల పేర్ల మీద చేసిన రీసెర్చ్‌లో ఇది నిజమే అని తేలింది. ఏ ఒకటి లేదా రెండు వాహనాల పేర్లు మాత్రమే కాదు టూ వీలర్లు, కార్లు, ఎస్‌‌యూవీలు, ట్రక్కులు ఇలా అన్నింటి పేర్లు "O" అక్షరంతోనే ఎండ్ అవుతాయి.

ఇలా మహీంద్రా వాహనాలు O అక్షరంతో ఎండ్ అయ్యే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది మాత్రమే కాదు, చివర్లో ఉన్న O ను 'ఓ' అని కాకుండా ఓహ్ అని పలుకుతోంది మహీంద్రా. ఉదాహరణకు ఎక్స్‌యూవీ500 లో చివరి రెండు ఓ లను, "డబుల్ ఓహ్"గా సంభోదించాలన్నమాట.

మహీంద్రా కార్లలో O అక్షరంతో ఎండ్ అయ్యే వాహనాలు...

మహీంద్రా కార్లలో O అక్షరంతో ఎండ్ అయ్యే వాహనాలు...

బొలెరో (Bolero), స్కార్పియో (Scorpio), జైలో (Xylo), క్వాంటో (Quanto), వెరిటో (Verito), ఎక్స్‌యూవీ500 (XUV500), టియువీ300 (TVU300) ఈ వాహనాల పేర్లలోని చివరి అక్షరాల్లో O అక్షరాన్ని గుర్తించగలరు.

మహీంద్రా టూ వీలర్స్ పేర్లు

మహీంద్రా టూ వీలర్స్ పేర్లు

కార్లు, ఎస్‌యూవీలు, ట్రక్కులతో మాత్రమే మహీంద్రా ఆగిపోలేదు. టూ వీలర్ సెగ్మెంట్లో కూడా విభిన్నమైన ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. మహీంద్రా వద్ద ఉన్న అన్ని టూ వీలర్ల పేర్లు చివర్లో O అక్షరాన్ని గుర్తించగలరు. మోజో (Mojo), గస్టో (Gusto), సెంచ్యురో (Centuro), ప్యాంటెరో (Pantero), డ్యూరో (Duro), రోడియో (Rodeo).

మహీంద్రా కమర్షియల్ వాహనాలు

మహీంద్రా కమర్షియల్ వాహనాలు

దేశీయ ఆటోమోటివ్ దిగ్గజం వివధ రకాల రవాణా మాధ్యమాలకు అనుగుణంగా అన్నింటిలో తమ వాహనాలు ఉండే లక్ష్యంతో వాణిజ్య వాహనాల సెగ్మెంట్లో అనేక ఉత్పత్తులను విడుదలను చేసింది. చిన్న స్థాయి కమర్షియల్ వాహనాల నుండి పెద్ద పెద్ద లారీలు మరియు ట్రక్కుల వరకు ఉత్పత్తి చేస్తోంది మహీంద్రా. అయితే వీటి పేర్లు కూడా O అక్షరంతో ఎండ్ అవడ గమనార్హం.

చిన్న పాటి వాణిజ్య వాహనాలైన మ్యాక్సిమో (Maxximo), జీతో (Jeeto), సుప్రో (Supro), బొలెరే పికప్ ట్రక్కు (Bolero) మరియు ఇంపీరియో (Imperio) తో పాటు పెద్ద కమర్షియల్ శ్రేణిలో ట్రక్సో (Truxo) మరియు ట్రాకో (Traco) పేరుతో అనేక వాహనాలను అందుబాటులో ఉంచింది మహీంద్రా.

చివర్లో O అక్షరం వచ్చేలా మహీంద్రా తమ అన్ని వాహనాల పేర్ల ఎందుకు నిర్ణయిస్తోందనేది ఇప్పుడు అందరి మదిని తొలిచేస్తున్న ప్రశ్న. దీనికి మహీంద్రా అండ్ మహీంద్రా హెడ్ ఆనంద్ మహీంద్రా ఓ సారి మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో సమాధానం ఇచ్చాడు.

మహీంద్రా స్కార్పియోను విడుదల చేసిన తరువాత, మహీంద్రా విలువ ఎంతో పెరిగింది. అంతే కాకుండా అసలైన విజయాన్ని స్కార్పియో ద్వారానే చవిచూడటం జరిగింది. ఆ పేరులో మంచి బలం ఉండటం మరియు చివరిలో O అక్షరం రావడటాన్ని అదృష్టంగా భావించామని తెలిపాడు.

మహీంద్రా నుండి వచ్చే ప్రతి మోడల్‌లో పేరుకు చివరిలో O అక్షరం వచ్చేలా నిర్ణయిస్తూ వచ్చారు. తొలుత బొలెరో, స్కార్పియో లతో పాటు ఎక్స్‌యూవీ500, టియువీ300 మరియు గత ఏడాది విడుదలైన కెయువి100 కూడా మంచి సక్సెస్ సాధించిపెట్టాయి.

ఈ సంప్రదాయాన్ని కార్లు మరియు ఎస్‌యూవీ వాహనాలకు మాత్రమే పరిమితం చేయకుండా టూ వీలర్లు మరియు వాణిజ్య వాహనాలకు కూడా పరిచయం చేశాడు. అవి కూడా అదే రీతిలో విజయాన్ని అందుకున్నాయి.

అయితే మహీంద్రా వాహనాల మీద మంచి అవగాహన ఉన్న వారికి , మహీంద్రాలోని కొన్ని వాహనాలకు చివర్లో "O" అక్షరం ఉండదు కదా అనే డౌట్ రావచ్చు. నిజమే, అలాంటి వాటికి ఉదాహరణ అర్మాడా (Armada), థార్ (Thar), కమాండర్ (Commander) మరియు లోగాన్ (Logan).

పైన తెలిపిన వాహనాలు పేర్లు స్కార్పియో కంటే ముందుగా పరిచయం అయ్యాయి కాబట్టి వాటిలో O అక్షరం లేదు . కానీ లోగాన్ సెడాన్ మాత్రం 2007లో పరిచయం అయ్యింది అంటే స్కార్పియో తరువాత. మరి లోగాన్ పేరులో O లేదు కదా అని మరొక డౌట్ రావచ్చు.

మహీంద్రా లోగాన్ కారును ఫ్రెంచ్‌కు చెందిన రెనో భాగస్వామ్యంతో పరిచయం చేసింది. కాబట్టి వెహికల్ పేరును ఖరారు చేయడంలో ఇరు సంస్థల జోక్యం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రెనోకు చెందిన లోగాన్ పేరును దీనికి నామకరణం చేసారు. ఆ తరువాత కాలంలో లోగాన్ ఆధారంతో వెరిటో మరియు వెరిటో వైబ్ ఉత్పత్తులను అభివృద్ది చేసింది మహీంద్రా.

ఆనంద్ మహీంద్రా గారు మహీంద్రా అండ్ మహీంద్రాకు సి.ఇ.ఒ గా నియమితులయ్యాక కేవలం కార్లకు మాత్రమే పరిమితం కాకుండా, ఎస్‌యూవీలు, ట్రక్కులు, లారీలు, టూ వీలర్లు, విమానాలు, నౌకలతో పాటు అనేక రంగాలలో మహీంద్రా కార్యకలాపాలను విస్తరింపజేశాడు.

"O" అక్షరంతో ముగిసే పేర్లతో మహీంద్రా ఇంకా ఎన్నో ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. దీనిని మూఢనమ్మకంగా చెప్పుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఓ పెద్ద ఆటోమొబైల్ సంస్థ దీనిని నమ్ముతోంది. ఈ నమ్మకంతో ఎన్నో విజయాలు సాధిస్తోంది.

English summary
Read In Telugu Why Mahindra Models End With O
Story first published: Monday, June 26, 2017, 13:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark