తెలుపు రంగు కార్లనే ఎందుకు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు... దీని వెనుక సీక్రెట్ ఇదేనా..!!
భారత్ సహా ప్రపంచంలో ఉన్న మొత్తం కార్ల సంఖ్యలో అధికంగా తెలుపు రంగు కార్లు ఉన్నాయి. ఓ సర్వే ప్రకారం భూమిపై సుమారు 40 శాతం కంటే ఎక్కువ తెలుపు రంగు కార్లు ఉంటాయని సమాచారం. అయితే ప్రజలు ఎక్కువగా తెలుపు రంగు కార్లనే ఎందుకు ఇష్టపడుతున్నారు. అయితే దీని వెనుక అనేక కారణాలున్నాయి.
రీ సేల్ వాల్యూ: సాధారణంగా అత్యధిక శాతం ప్రజలు కోరుకునే రంగుల్లో తెలుపు ఒకటి. అందువల్ల కార్లు కూడా అదే రంగులో ఉండాలని కోరుకుంటారు. దాంతోపాటు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో తెలుపు రంగు కార్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇతర రంగుల కంటే తెలుపు రంగు కార్లకు మళ్లీ పెయింటింగ్ వేయడం సులభం. గతంలో ఉన్న రంగుతో సరిగ్గా సరిపోలుతుంది.

ధర కొంచెం తక్కువ: హోండా కార్లు మినహా ఇతర కార్ల తయారీ సంస్థలు తెలుపు రంగు కార్లను సాధారణంగా తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతాయి. ఎందుకంటే ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగు పెయింటింగ్ ఖర్చు తక్కువగా ఉంటుంది. తక్కువ ధరకే కారు కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పుడు అదే రంగు కార్లవైపు ప్రజలు మొగ్గు చూపిస్తారు.
నిర్వహణ సులభం: తెలుపు లేత రంగు. ఈ రంగు కార్లపై డెంట్లు, గీతలు ఉన్నా సరిగా కనిపించవు. అదే ఇతర రంగుల కార్లపై చిన్న గీతలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ విధంగా తెలుపు రంగు కార్ల నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది.

డస్ట్ ఫ్రీ : సాధారణంగా తెలుపు రంగు కార్లకు ఎక్కువగా దుమ్ము పడుతుంది అనుకుంటాం. కానీ అది తప్పుడు అభిప్రాయం. ఉదాహరణకు రెండు రోజుల పాటు తెలుపు, నలుపు రంగు కార్లను ఒకచోట పార్కింగ్ చేస్తే.. తెలుపు రంగు కారు కంటే నలుపు రంగు కారుపై ఎక్కువ దుమ్ము ఉంటుంది.
ఎందుకంటే ముదురు రంగులు దూళిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. అదే తెలుపు రంగు కార్లపై కొంచెం తక్కువగా డస్ట్ ఉంటుంది. అయితే ఎక్కువ కాలం తెలుపు రంగు కారును ఒకే చోట పార్కింగ్ చేస్తే.. ఇతర రంగుల మాదిరిగా దుమ్ము, దూళితో నిండిపోతుంది.

సైన్స్ : వేసవి కాలంలో సూర్యకాంతి కారణంగా కారు లోపలి భాగం చాలా వేడిగా ఉంటుంది. తెలుపు వంటి లేత రంగుల కంటే ఇతర ముదురు రంగులు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. అందువల్ల వేడి వాతావరణంలో తెలుపు రంగు కార్ల వినియోగించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.
భారత సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం : భారత్‌లో సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం తెలుపు రంగుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తెలుపు రంగు.. శాంతి, పరిశుభ్రత, స్వచ్ఛతకు ప్రతిరూపంగా భావిస్తారు. ప్రభుత్వం సైతం తమ అధికారులకు తెలుగు రంగు కార్లనే ఎక్కువగా కేటాయిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








