మీకు తెలుసా బైక్‌లకు డీజిల్ ఇంజిన్ ఎందుకు అమర్చరో.. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల మధ్య తేడాలు ఇవే..
మోటార్‌సైకిల్స్ అన్నీ పెట్రోల్ ఇంజిన్‌లతో తయారు చేయబడినవే అని చాలా మందికి తెలిసిందే. కానీ మీరు కారు కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు మీకు పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజన్ అనే రెండు ఆప్షన్‌లు ఉంటాయి. కానీ బైక్‌లలో మాత్రం డీజిల్ ఇంజిన్(Diesel Engine) ఆప్షన్ ఉండదు.. అది ఎందుకనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా..
కాగా పెట్రోల్ ఇంజిన్(Petrol Engine Bikes) కారు కంటే డీజిల్ ఇంజిన్‌తో నడిచే కారుతోనే కస్టమర్లకు ఎక్కువ లాభాలు ఉంటాయి. అంతే కాకుండా బస్సులు, ట్రక్కుల్లాంటి భారీ వాహనాల్లో సైతం డీజిల్ ఇంజిన్‌నే వాడతారు. అందుకే ట్రావెల్ వాహనాలు ఎక్కువగా డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లు కేవలం కార్లలో మాత్రమే ఉంటాయి.

కానీ బైక్‌కు మాత్రం ఒకే ఇంజిన్ ఆప్షన్ ఉంటుంది. అందుకే మార్కెట్లో ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్ బైక్ మాత్రమే వాడుకలో ఉంది. గతంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ డీజిల్‌తో నడిచే బుల్లెట్ బైక్‌లను విక్రయించేది. కానీ ఇప్పుడు డీజిల్ ఇంజిన్‌తో ఏ విక్రయాలు జరపడం లేదు.
భారత్‌లో కార్ల వినియోగదారుల కంటే ఎక్కువగా బైక్ కస్టమర్లు ఉన్నారు. రోజువారీ అవసరాల కోసం చాలా మంది బైక్‌లను సౌకర్యంగా ఫీలవుతారు. పార్కింగ్‌తో రద్దీ రోడ్లపై సులభంగా ప్రయాణించడానికి ఉంటుంది. లాంగ్ జర్నీస్‌లో రోజు 100 నుంచి 150 కి.మీ ప్రయాణించే వారు ఉంటారు. అయితే అలాంటి వారికి పెట్రోల్ ఇంజిన్ బైక్‌ల కంటే డీజిల్ ఇంజిన్ బైక్‌లు ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది.

అయితే టూ వీలర్ మార్కెట్లో ఇంత మార్కెట్ ఉన్నప్పటికీ ఆటో మేకర్లు డీజిల్ ఇంజిన్ బైక్‌లను ఎందుకు ఉత్పత్తి చేయడం లేదనేది మీకు తెలుసా.. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటి కారణంగానే మార్కెట్లో కేవలం పెట్రోల్‌తో నడితే బైక్‌లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.
డీజిల్ ఇంజినీరింగ్ కంప్రెషన్ నిష్పత్తి 24:1 అయితే పెట్రోల్ ఇంజిన్‌కి వచ్చేసరకి ఇంది 11:1. కాబట్టి డీజిల్ ఇంజిన్‌తో బైక్‌ను రూపొందిస్తే.. దాని పరిమాణం, బరువు పెద్దదిగా ఉంటుంది. కాబట్టి బైక్ లాంటి చిన్న వాహనంలో డీజిల్ ఇంజన్ వాడటం కష్టంగా ఉంటుంది.

డీజిల్ ఇంజిన్లు అధిక కంప్రెషన్ నిష్పత్తిని కలిగి ఉండటంతో.. ఇంజిన్ నడుస్తున్నప్పుడు, దాని నుండి వెలువడే శబ్దం ఎక్కువ కంపనాలను కలిగిస్తుంది. బైక్‌ల వంటి వాహనాల్లో అధిక శబ్దం మరియు వైబ్రేషన్‌తో బైక్‌ను నడపడం రైడర్లకు అసౌకర్యంగా ఉంటుంది. దీని వల్ల వాహనదారులు సరిగా డ్రైవ్ చేయలేరు కాబట్టి.. బైక్‌లలో డీజిల్ ఇంజిన్‌లను నివారిస్తున్నారు.
డీజిల్ ఇంజిన్‌ను అమర్చినట్లయితే ట్యాంక్ పరిమాణం పెద్దదిగా ఉంటుంది కాబట్టి బరువు పెరుగుతుంది. దీంతో ఇంజిన్ ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా బైక్ మొత్తం ధర ఎక్కువగా ఉండే పెరగొచ్చు. దీని కారణంగా డీజిల్ ఇంజిన్ విడిభాగాల ధర పెట్రోల్ ఇంజిన్ బైక్‌ల కంటే రెట్టింపు అవ్వొచ్చు.

ఇంకా డీజిల్ ఇంజిన్ బైక్‌కు మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ యజమాని ప్రతి 3000 కి.మీకి బైక్ ఇంజిన్‌లోని ఆయిల్‌ను మార్చవలసి ఉంటుంది. కానీ డీజిల్ ఇంజన్ అమర్చినట్లయితే ప్రతి వెయ్యి కిలోమీటర్లకు ఆయిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇలా డీజిల్ ఇంజిన్ బైక్‌లోని ప్రతి భాగానికి మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పెట్రోలు, డీజిల్ ధరల వ్యత్యాసంతో దీన్ని పోల్చి చూస్తే, పెట్రోల్ మరింత లాభదాయకంగా ఉంటుంది. ఇంకా డీజిల్ ఇంజిన్ బైక్ ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ తక్కువ RPM ఉంటుంది. దీని కారణంగా పికప్ నెమ్మదిగా ఉంటుంది.
RPM తక్కువగా ఉంటే బైక్‌ను మీరు స్పీడ్‌గా డ్రైవ్ చేయలేరు. కానీ పెట్రోల్ ఇంజిన్ బైక్‌లో RPM ఎక్కువగా ఉండటంతో మీరు బైక్ వేగాన్ని పెంచవచ్చు. ఈ కారణంగానే డీజిల్ ఇంజిన్ బైక్ కంటే పెట్రోల్ ఇంజిన్ బైక్ స్పీడ్ ఎక్కువగా ఉంటుందని గమనించాలి.
ఒక్క భారత్‌లోనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ఇంజిన్ బైక్‌ను ఏ కంపెనీ తయారు చేయకపోవడానికి పైన పేర్కొన్న సాంకేతిక సమస్యలే కారణం. రాయల్ ఎన్‌ఫీల్డ్ గతంలో డీజిల్ ఇంజిన్ బైక్‌లను తయారు చేసి విక్రయించింది. కానీ ఇప్పుడు ఆ సంస్థ తన ఆలోచనను విరమించింది. అందుకే డీజిల్ ఇంజిన్లతో కూడిన బైక్‌లు భవిష్యత్తులో సాధ్యం అయ్యే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications








