Just In
- 9 hrs ago ఇలా చేస్తే 'సలార్ బైక్' మీ సొంతం.. మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం!
- 11 hrs ago వేసవిలో మీ కారు ఏసీ పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ఈ టిప్స్ తప్పనిసరి
- 16 hrs ago ఓనర్ అంటే ఇలా ఉండాలి.. పనిమనిషికి మరిచిపోలేని గిఫ్ట్.. అభినందిస్తున్న నెటిజన్లు
- 1 day ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
Don't Miss
- Sports IPL 2024: కేకేఆర్ చేతిలో ఓటమి.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- News ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే: తాజా జాబితాలో 9 మంది పేర్లు
- Movies Kalki 2898 AD అశ్వత్తామగా పవర్ఫుల్గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
- Lifestyle త్వరలోనే ఆవుపాల కన్నా ఒంటెపాలకే డిమాండ్.. ఎన్నో కారణాలు..
- Finance Success Story: మోమోస్ అమ్మి కోట్లు సంపాదించిన సైంటిస్ట్.. షాకవుతున్న జనం..!!
- Technology TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
స్కూల్ బస్సులు యెల్లో కలర్లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి
ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజిలు దాదాపుగా పిల్లలను తీసుకెళ్లడానికి బస్సులను మరియు వ్యాన్లను ఉపయోగిస్తుంటాయి. కానీ దాదాపు చాలా వరకు స్కూల్ బస్సులు యెల్లో కలర్ లోనే ఉంటాయి. ఇది అందరూ గమనించి ఉన్నారు. కానీ ఈ బస్సులు యెల్లో కలర్ లో ఎందుకుంటాయి చాలామందికి తెలియదు. మనం ఇప్పుడు స్కూల్ బస్సులు యెల్లో కలర్ లో ఎందుకుంటాయి, అనేదాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
స్కూల్ బస్సులు యెల్లో కలర్ లో ఉండటం వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా లేకపోలేదు. సాధారణంగా అన్ని రంగులలో కెల్లా మొదటగా అందరి దృష్టిని ఆకర్షించేది ఎల్లో కలర్ మాత్రమే. అయితే రెడ్ మరియు వైట్ కరల్స్ దూరం నుంచి అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు.
రెడ్ కలర్ అనేది అత్యవసర సమయాల్లో సంకేతంగా ఉపయోగిస్తారు. కావున రెడ్ కలర్ స్కూల్ బస్సులకు ఉపయోగించడం అంత మంచిది కాదు. యెల్లో కలర్ అన్ని రంగులలోకెల్లా కొంత ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్క సరిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్మొబైల్; వివరాలు
నిత్యజీవితంలో కూడా రంగుల విషయానికి వస్తే యెల్లో కలర్ కంటికి ఎక్కువగా కనిపించే రంగు. ఈ కారణంగా స్కూల్ బస్సులకు యెల్లో కలర్ ఉపయోగిస్తారు. అంతే కాదు దూరం నుండి కూడా ఈ రంగుని గుర్తించవచ్చు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే స్కూల్ బస్సుల కలర్ వెనుక ఒక సీక్రెట్ కూడా ఉంది.
పొగమంచులో, మంచులో మరియు వర్షం వంటి సమయాల్లో కూడా యెల్లో కలర్ సులభంగా గుర్తించవచ్చు. అంతే కాకుండా, మనం అనేక రంగులను కలిసి చూసినప్పుడు, యెల్లో కలర్ మొదట మన చూపును ఆకర్షిస్తుంది.
MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ [వీడియో]
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, యెల్లో కలర్ పార్శ్వ దృష్టి రెడ్ కలర్ కంటే 1.24 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే యెల్లో కలర్ మిగిలిన కలర్స్ తో పోలిస్తే 1.24 రెట్లు ఎక్కువ ఆకర్షణను కలిగి ఉంటుంది మరియు అన్ని ఇతర రంగుల కంటే ఎక్కువ దృశ్యమానతను కలిగి ఉంటుంది.
2012 సంవత్సరంలో పాఠశాల బస్సులకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలనీ హైకోర్టు ఆదేశించింది. అవి ఏమిటంటే బస్సు మీద స్కూల్ పేరును మరియు ఆ స్కూల్ కి సంబంధించిన ప్రిన్సిపాల్ యొక్క మొబైల్ నంబర్ వంటి వాటిని తప్పకుండా ప్రింట్ చేయాలి. అంతే కాకుండా స్కూల్ బస్సులో ఫస్ట్ ఎయిడ్ స్పెషాలిటీ వంటివి కూడా కల్పించాలి.
MOST READ:ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే