పెద్ద వాహనాలకు ఎక్కువ టైర్లు ఎందుకు ఉంటాయో తెలుసా?? మీరు ఊహించింది అయితే అస్సలు కాదు.. !
మీరు ఎప్పుడైనా రోడ్లపై వెళ్తున్న భారీ ట్రక్‌లు లేదా లారీలను గమనించారా.. వాటిలో చాలా ట్రక్‌లకు అదనపు టైర్లు ఉండడాన్ని గుర్తించే ఉంటారు. కానీ అవి రోడ్లను తాకకుండా కొంచెం పైకి లిఫ్ట్ చేయబడి ఉంటాయి. అయితే అవి స్పేర్ టైర్లు లేదా అలంకరణ కోసం ఉన్నాయని మనలో చాలా మంది అనుకుంటాం. కాదు అది సరైన కారణం కాదు.
భారీ ట్రక్‌లకు, లారీలకు అదనపు టైర్లు ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా.. దానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. సాంకేతిక కారణాలు సహా మరో కారణం ఉంది. అందువల్లనే చాలా ట్రక్‌లకు అదనపు టైర్లు ఉంటాయి. మరిన్ని వివరాలు మీ కోసం..

ట్రక్కుకు ఎన్ని యాక్సిల్‌లు ఉంటే అంత బరువును మోయగలదు. అయితే ఎక్కువ యాక్సిల్‌లు ఉండడం వల్ల రోలింగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఫలితంగా టక్కు సామర్థ్యం కొంత తగ్గుతుంది. మరియు అదనపు నిర్వహణ ఖర్చులు కూడా అవుతాయి. దాంటోపాటు ఎక్కువ టైర్లు వినియోగంలో ఉంటే.. అవన్నీ కొంత సమయం తర్వాత మార్చవలసి ఉంటుంది. పైగా వీటి ధర కూడా చాలా ఎక్కువ ఉంటుంది.
భారీ ట్రక్కులకు అదనంగా ఉండే టైర్లను 'డ్రాప్ యాక్సిల్స్' లేదా 'లిఫ్ట్ యాక్సిల్స్' అంటారు. డ్రాప్ యాక్సిల్స్ ఎక్కువ సమయం పైకి లిఫ్ట్ చేయబడి ఉంటాయి. ట్రక్కకు అదనపు సామర్థ్యం అవసరమైతే డ్రాప్ యాక్సిల్స్‌ను కిందకు దించవచ్చు.
అయితే ఈ డ్రాప్ యాక్సిల్ ఎంత పనిచేస్తుందనేది ట్రక్కుపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ట్రక్కు మిగిలిన టైర్లు, యాక్సిల్ కాస్త మందంగా ఉంటాయి. కానీ డ్రాప్ యాక్సిల్ టైర్లు కొంచెం సన్నగా ఉండే అవకాశం ఉంటుంది. హెవీడ్యూటీ ట్రక్కుల్లో డ్రాప్ యాక్సిల్ కూడా మందంగా ఉండే అవకాశం ఉంది.
అయితే ఈ డ్రాప్ యాక్సిల్ అవసరమైన సమయాల్లో ఉపయోగించుకోవడానికే కాక.. కొన్ని రాష్ట్రాల్లో కమన్షియల్ వాహనాల నిబంధనల కోసం కూడా అవసరం అవుతాయి.
ఉదాహరణకు ఓ ట్రక్కుకు ఐదు సాధారణ యాక్సిల్ మరియు మరో ఐదు డ్రాప్ యాక్సిల్‌లు ఉన్నాయనుకోండి. ట్రక్ బకెట్‌కు సుమారు 1000 కేజీల బరువు మోసుకెళ్లగలదు అనుకోండి. సాధారణ యాక్సిల్ మాత్రం కేవలం 500 కేజీల బరువు వరకు తీసుకెళ్లగలదు అనుకోండి. ఓ రోజు 500 కేజీల బరువును ట్రక్ సులభంగా తీసుకెళ్లగలదు. అదే 1000 కిలోల బరువును తీసుకెళ్లాలంటే డ్రాప్ యాక్సిల్ అవసరం ఉంటుంది.

ట్రక్‌కు అదనపు సామర్థ్యం అవసరమైతే.. డ్రాప్ యాక్సిల్‌ను కిందకు లిఫ్ట్ చేసి వినియోగించుకోవచ్చు. కేవలం అదనపు బరువులు మోయడానికే కాకుండా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కమన్షియల్ వాహనాల నిబంధనలకు అనుగుణంగా కూడా డ్రాప్ యాక్సిల్ ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








