షూటింగ్‌ కోసం మహీంద్రా స్కార్పియో N కారులో రజనీకాంత్‌ ప్రయాణం.. ఆ కారులోనే ఎందుకు?

జైలర్‌ చిత్రం భారీ విజయం అనంతరం సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ (Superstar Rajinikanth).. జైభీమ్‌ సినిమా డైరెక్టర్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది రజనీ 170వ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గత వారంలో జరిగాయి. అనంతరం కేరళలోని తిరువనంతపురంలో షూటింగ్‌ ప్రారంభం అయింది.

అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం తమిళనాడులోని పనగుడిలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్ మహీంద్రా స్కార్పియో N (Mahindra Scorpio N )వాహనంలో వచ్చారు. అయితే రజనీ కాంత్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. వారందరికి సమస్కరిస్తూ షూటింగ్‌ ప్రాంతానికి చేరుకున్నారు.

superstar rajinikanth 170 film shooting

అయితే రజనీ కాంత్‌ వద్ద BMW సహా అనేక లగ్జరీ కార్లు ఉండగా.. మహీంద్రా స్కార్పియో N వాహనంలో ఎందుకు షూటింగ్‌కు వచ్చారా అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే స్కార్పియో వాహనంలో రజనీ ప్రయాణం చేయడానికి ఓ పెద్ద కారణం ఉంది. ఇందుకు మహీంద్రా కారులో ఉన్న ఆ ప్రత్యేకతే కారణం.

మహీంద్రా స్కార్పియో దేశంలో అత్యధిక విక్రయాలు కలిగిన కార్లలో ఒకటిగా ఉంది. స్కార్పియో N కారు ఆఫ్‌ రోడ్ అయినప్పటికీ.. లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న పనగుడిలో ఇటుక, రాయి ఫ్యాక్టరీలో పోరాట సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారు. ఈ స్థలం అంతా మట్టిరోడ్లతోనే ఉంటుంది. అందువల్ల ఆఫ్‌ రోడ్ కారు అయిన మహీంద్రా స్కార్పియో N వాహనంలో రజనీకాంత్ ప్రయాణం చేశారు.

mahindra scorpio N

మహీంద్రా స్కార్పియో N కారు పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లను కలిగి ఉంటుంది. 2.0 లీటర్‌ Mstallion పెట్రోల్‌ ఇంజిన్‌ మరియు 2.2 లీటర్‌ mHawk డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. డిజిల్‌ ఇంజిన్‌ 130.07bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6- స్పీడ్‌ మాన్యువల్‌ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

అదే పెట్రోల్‌ ఇంజిన్‌ 200 bhp శక్తిని, 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 6- స్పీడ్‌ మాన్యువల్‌ లేదా ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారు ధర రూ.13.26 లక్షల నుంచి రూ.24.54 లక్షల వరకు ఉంటుంది.

why Rajinikanth travelled in mahindra scorpio N

ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌, టైర్‌ ప్రజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటి కంట్రోల్‌, హిల్‌ డిసెంట్ కంట్రోల్‌, ISOFIX చైల్డ్‌ సీట్‌ మౌంట్స్‌, గ్లోబర్‌ NCAP సేఫ్టీ రేటింగ్‌తో ఈ కారు 5 రేటీంగ్‌ను సొంతం చేసుకుంది. అదే విధంగా చిన్నారుల భద్రతలో 3 స్టార్‌ను రేటింగ్‌ను పొందింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 10, 2023, 18:00 [IST]
English summary
Why superstar rajinikanth travelled in mahindra scorpio n to participate in his 170th film shoot
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+