హ్యాట్సాఫ్ టు ఇండియన్ ఆర్మీ: చైనాకు ముప్పు తిప్పలు పెడుతున్న భారతీయ సైన్యం

By Anil

ముందు నుండి ఇండియాను పొగుడుతూనే వెనుక నుండి ఎలాగైనా ఇండియాను నాశనం చేయాలనుకునే దేశాలు చాలానే ఉన్నాయి. అందులో చైనా మరియు పాకిస్తాన్. వీరి చేష్టలు ఇండి్యాకే కాదు ప్రపంచ దేశాలకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఈ మధ్య చైనా భారత్‌తో అర్థలేని వాదనలు చేస్తూ భారతీయ సైన్యం యొక్క సహనాన్ని పరీక్షిస్తూ భూభాగ ఆక్రమణలకు పాల్పడూ వస్తోంది. అందుకు ఇండియన్ ఆర్మీ చైనాతో పాటు మిగతా శత్రు దేశాలకు కూడా గట్టి సమాధానం చెప్పింది.

అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణుల ద్వారా చైనా గుండెల్లో గుబులు పుట్టించింది. ఈ దెబ్బకు మిగతా శత్రు దేశాలకు కూడా కనువిప్పు కలిగింది.

చైనా దుస్సాహసం

చైనా దుస్సాహసం

పొరుగు దేశంతో కలిసిమెలసి ముందుకు సాగాల్సిన చైనా, అడ్డదారిలో భారత్ భూ బాగాన్ని ఆక్రమిస్తూ వచ్చింది. ఈ విశయమై ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరిపిన ఫలితం లేకపోయింది. చైనా చేష్టలు రోజురోజుకీ వికృతం అయ్యాయి. అయితే ఇండియన్ ఆర్మీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించడానికి సిద్దమైంది. ఈ దెబ్బకు చైనా చచ్చినట్లు వెనక్కి తగ్గింది.

భద్రతలో భాగంగా

భద్రతలో భాగంగా

ఇది చైనా మూకలను హతమార్చడానికి తీసుకున్న నిర్ణయం కాదంటూ, తమ దేశ భద్రతలో బాగంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.

పరోక్ష సూచనలు

పరోక్ష సూచనలు

భారత దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీకి మరే ఇతర దేశాలతో చేతులు కలపాల్సిన అవసరం లేదు మరియు తమ దేశాన్ని రక్షించుకోవడానికి పూర్తి శక్తిసామర్థ్యాలను కలిగి ఉన్నామంటూ అధే విధంగా భారత సరిహద్దుల్లో ఏ విధమైన చొరబాట్లకు పాల్పడినా ఉపేక్షించేది లేదని మరో సారి చెప్పకనే స్పష్టం చేసింది భారత సైన్యం.

అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా

అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా

ఇండియాకు మరియు చైనాకు మధ్యన ఉన్న అరుణాచల్ ప్రదేశ్భూ బాగంలో భారత్ ఇప్పటికే అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణులతో సిద్దంగా ఉంది మరియు అనువుగా ఉండే అన్ని ప్రదేశాలకు వీటిని తరలిస్తోంది. ఏ ప్రదేశం నుండైనా సరే దాడి చేయడమే ముఖ్య లక్ష్యంగా క్షిపణులను అమర్చుకుంటోంది.

అవసరానికి మించి ఉన్నాయంటూ ఆరోపణలు

అవసరానికి మించి ఉన్నాయంటూ ఆరోపణలు

అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైన్యం బ్రహ్మోస్ క్షిపణులను అతిగా సమకూర్చుకుంటున్నందు వలన చైనాలో ఉన్న టిబెట్, యునాన్ ప్రావిన్స్ వంటి ప్రాంతాలు తీవ్ర ముప్పును ఎదుర్కుంటాయని చైనా అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది.

భూ భాగం చొరబాటు

భూ భాగం చొరబాటు

చైనా భారత భూ బాగంలోకి చొరబాటు యత్నిస్తున్న సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిన సంగతే. అయితే వారిని తిప్పికొట్టడానికి ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్న నిర్ణయాలు చైనాకు భయాన్ని పుట్టిస్తున్నాయి. భారీగా ఆయుధాలతో మొహరిస్తుండటం వలన భారత్ చైనా భూ బాగాన్ని ఆక్రమిస్తోంది అనే ఆధారం లేని వాదనలు కూడా చైనా చేస్తోంది.

బ్రహ్మోస్ మిస్సైల్ ప్రత్యేకతలు

బ్రహ్మోస్ మిస్సైల్ ప్రత్యేకతలు

ప్రపంచ దేశాలన్ని కూడా బ్రహ్మోస్ మిస్సైల్‌కు భయపడాల్సిందే. ఇలాంటి మిస్సైల్స్‌ను ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ద నౌకలు, సబ్‌మెరైన్ల నుండి అదే విధంగా నేల మీద నుండి కూడా ప్రయోగించవచ్చు.

భారీ బరువున్న వార్‌హెడ్స్

భారీ బరువున్న వార్‌హెడ్స్

బ్రహ్మోస్ క్షిపణులు భారీ బరువున్న వార్ హెడ్లను అతి సునాయసంగా మోసుకెళ్లగలవు. ఇవి నేల, నీరు మరియు గగన తలం అనే తేడాలు లేకుండా టార్గెట్‌లను చేధిస్తాయి.

బ్రహ్మోస్

బ్రహ్మోస్

భారత్ మరియు రష్యా దేశాలు సంయుక్తంగా ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను అభివృద్ది చేశాయి. అందుకోసం దీనికి భారత్ లోని బ్రహ్మపుత్ర నది అదే విధంగా రష్యాలోని మోస్‌క్వా నది పేర్ల మీదుగా బ్రహ్మోస్ అనే పేరు పెట్టారు.

శబ్దానికన్నా 2.8 రెట్ల వేగంతో

శబ్దానికన్నా 2.8 రెట్ల వేగంతో

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు ధ్వని ప్రయాణించే వేగం కన్నా 2.8 రెట్ల ఎక్కువ వేగంగా దూసుకుపోతాయి.

శత్రువులను ఏ మార్చడం

శత్రువులను ఏ మార్చడం

దీనిని శత్రు సైన్యం వైపు ప్రయోగించిన తరువాత వివిధ ఎత్తుల్లో ప్రయాణిస్తుంది. తద్వారా ఇది సరిగ్గా లక్ష్యాన్ని చేరుకునే ప్రదేశాన్ని శత్రువులు గుర్తించలేరు. అలా వారిని ఏమరపాటుకు గురి చేసి శత్రు భూబాగాన్ని చేరుకుని విధ్వంసాన్ని సృష్టిస్తుంది.

త్రివిధ దళాల్లో

త్రివిధ దళాల్లో

భారత దేశం యొక్క త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లలో కూడా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను వినియోగించవచ్చు.

100 కు పైగా

100 కు పైగా

భవిష్యత్తులో పొంచి ఉన్న ముప్పును అంచనా వేసుకుని సుమారుగా 100 కు పైగా బ్రహ్మోస్ క్షిపణులతో పాటు ఇతర సాంకేతిక సామాగ్రిని సమకూర్చుకుంటున్నారు.

పర్వతాల్లో ఊహించని పనితీరు

పర్వతాల్లో ఊహించని పనితీరు

పర్వత శ్రేణిల్లో బ్రహ్మోస్ క్షిపణుల పనితీరు అత్భుతం అని చెప్పాలి. దీనిని పర్వత వాలు ప్రదేశాల్లో ప్రయోగించడం వలన నిట్ట నిలువుగా మరియు ఏటవాలుగా కూడా దిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఒక్క మిస్సైల్ ధర

ఒక్క మిస్సైల్ ధర

ఒక్క యూనిట్ ధర సుమారుగా 2.73 అమెరికన్ డాలర్లుగా ఉంటుంది.

బరువు

బరువు

భూ మరియు జల మార్గాల గుండా ప్రయోగించే వాటి బరువు 3,000 కిలోలు మరియు గగన తలం నుండి ప్రయోగంచే బ్రహ్మోస్ క్షిపణుల బరువు సుమారుగా 2,500 కిలోలుగా ఉంది.

ఇంజన్

ఇంజన్

ఇందులో రెండు అంచెలుగా ఇంధనాన్ని వినియోగించుకునే ఇంజన్ కలదు, మొదటి స్టేజ్‌లో సాలిడ్ ప్రొపెల్లంట్ బూస్టర్ మరియు రెండవ స్టేజ్‌లో లిక్విడ్ ఇంధనం వినియోగించుకుంటుంది.

భారత్ శత్రు దేశాలకు బ్రహ్మోస్‌తో వార్నింగ్
  • భారత సైన్యం యొక్క వెన్నెముక, ఈ 45 సాయుధ వాహనాలు
  • భారత్ శత్రు దేశాలకు బ్రహ్మోస్‌తో వార్నింగ్

    శక్తివంతమైన సైనికబలాన్ని కలిగిన దేశాలు: ఇందులో భారత్ ఉందా...?

    భారతదేశపు కొత్త జలాంతర్గామి ఫ్రిగేట్ INS కల్వరి

    భారత్ శత్రు దేశాలకు బ్రహ్మోస్‌తో వార్నింగ్

    జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా: అమెరికా పై తీవ్ర అరోపణలు !!

    ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య ప్రారంభం కానున్న యుద్దం...!!

Most Read Articles

English summary
Why The Brahmos Missile Is Bad News To China
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X