Vintage Cars వింటేజ్ కార్లు ఎందుకంత బెస్ట్.. ఏముంది వీటిలో స్పెషాలిటీ!!
కారు ప్రతి ఒక్కరి జీవింతో ముఖ్య భాగమైపోయింది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ, ఆర్థిక అవసరాల కోసం ఖచ్చితంగా కారు ఉండాలనుకుంటారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆటో మేకర్లు సరికొత్త మోడల్స్‌లో కార్లను ప్రవేశపెడుతున్నారు. అయితే పాత కాలం(Vintage Cars) కార్లను మాత్రం నేటి తరం కార్లతో పోల్చలేం. ఎందుకంటే వాటి ప్రత్యేకతే వేరు.
ప్రస్తుత కాలంలో చాలా మంది వింటేజ్ కార్ల(Vintage Cars Vs Modern Cars)పై మోజు పెంచుకుంటున్నారు. సెలబ్రిటీలు, ప్రముఖులు వారి గ్యారేజీలో వింటేజ్ కార్లకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. రోడ్లపై వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు ఓ రకమైన అనుభూతికి లోనవుతారు. ఇటీవల ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ వింటేజ్ కార్లలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వింటేజ్ కార్లు ఎందుకింత స్పెషల్.. ఏముందీ వీటిలో అంతగా..

వింటేజ్ కార్ల(Why Vintage Cars The Best)ను నడుపుతున్నప్పుడు అందులోని అనుభూతిని ప్రస్తుత తరం కార్లను నడుపుతుండగా పొందలేరనేది వాస్తవం. వ్యాపార, రవాణా అవసరాల కోసం తయారు చేసిన కార్లు.. ప్రస్తుతం తమ ఆనందం కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే అత్యంత ప్రసిద్ధి చెందిన వింటేజ్ కార్లను పరిశీలిస్తే బుగాటి టైప్ 35 నుంచి డెలోరియన్ DMC - 12 వరకు అని చెప్పవచ్చు.
అయితే క్లాసిక్ కార్లు, ఆధునిక కార్లు రెండూ వాటి సానుకూల లక్షణాలను కలిగి ఉన్నాయి. కానీ వింటేజ్ కార్లు ప్రస్తుత తరం కార్ల కంటే ఎక్కువ క్రేజ్ కలిగి ఉన్నాయి. మీరు రోడ్డుపై క్లాసిక్ కారును చూసినప్పుడు, ఒక్కసారిగా మీ దృష్టి దాని డిజైన్, లుక్‌పై పడుతుంది. కానీ మీరు మిగిలిన విషయాలను గమనించరు. ఎందుకంటే కారులో క్లాసిక్‌గా ఉండే డిజైన్, ఆకారం ఆకర్షణీయంగా ఉంటుంది.

భద్రత మరియు ఉద్గారాల ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా క్లాసిక్ కారు బాడీ మరియు ఇంటీరియర్‌ను తరచుగా అప్‌డేట్ చేస్తారు. అయినప్పటికీ, క్లాసిక్ కారు ఎక్స్‌టీరియర్ మాత్రమే అలాగే ఉంటుంది. అందుకే అవి ఇప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుత తరం కార్ల కంటే క్లాసిక్ కార్లు ఎందుకు ది బెస్ట్‌గా ఉన్నాయంటే..
వింటేజ్ కార్లు తేలికైనవి ఇంకా చిన్నగా ఉంటాయి. కాలక్రమేణా వాటి సైజ్ పెరుగుతోంది. 1959లో ప్రవేశపెట్టినప్పటి వాటి బరువు దాదాపు రెట్టింపు అయింది. తేలికైన స్పోర్ట్స్ కార్లు వాటి మోడిఫికేషన్ కార్ల కంటే మెరుగ్గా పనిచేస్తాయి. తేలికగా, చిన్నగా ఉన్నప్పటికీ, క్లాసిక్ కార్లు ఎక్కువ మన్నికైనవిగా ఉండటంతో పాటు బలంగా ఉంటాయి.

ఆధునిక కార్లతో పోలిస్తే, పాతకాలపు కార్ల(Vintage Cars Design And Look),కు మెయింటెనెన్స్ చాలా తక్కువ. వాటిని నిర్వహించడం, సర్వీస్ చేయడం సులభం. ఆధునిక వాహనాలపై క్రాష్ టెస్టుల కారణంగా వాటిలో ఎలక్ట్రానిక్స్ ఫీచర్లు ఎక్కువగా ఉండటంతో ధర ఎక్కువగా ఉంటుంది. మరో అడ్వాంటేజ్ కారు ప్రతి మెషినరీ పార్ట్‌ను తొలగించి రీబిల్డ్ చేయవచ్చు. ఆధునిక వాహనాలకు తరచుగా సెన్సార్లు మరియు ఎలక్ట్రానిక్స్‌ల భర్తీ అవసరమవుతుంది. ఇది ఖర్చుతో కూడుకున్నది.
మీరు కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇంకా ఫైనాన్స్‌లో కొనుగోలు చేస్తే వడ్డీ చెల్లింపుల కారణంగా మీరు చివరికి అమ్మకం ధర కంటే చాలా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కొత్త కారు కొనడం తెలివైన పెట్టుబడి కాదు. మీరు కారును సెకండ్ హ్యాండ్‌లో కొని మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే పాతకాలపు కారును కొనుగోలు చేయడం చాలా బెస్ట్.
వింటేజ్ కార్ల(Vintage Cars Maintenance)ను ఆధునిక కార్ల కంటే మెరుగ్గా రూపొందించారు. అయితే కొన్ని ఆధునిక కార్లు అద్భుతంగా కనిపిస్తాయి. ఉదా, మెక్‌లారెన్ స్పీడ్‌టైల్. మీరు ఏదైనా ఆధునిక కారును లెజెండరీ ఫెరారీ 250 GTO లేదా జాగ్వార్ E-టైప్‌తో పోల్చినట్లయితే, క్లాసిక్ కారు ఖచ్చితంగా ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తుంది. పాతకాలపు కార్లు మెరుగైన డిజైన్‌ను కలిగి ఉండటానికి కారణం డిజైనర్ల స్వేచ్ఛ. గతంలో, డిజైనర్లు ఎటువంటి పరిమితులను ఎదుర్కోలేదు.
చివరగా పబ్లిక్ రోడ్లపై వింటేజ్ కార్లలో ప్రయాణించడం మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అంతరాయం లేకుండా డ్రైవింగ్ చేసే స్వేచ్ఛ మీకు ఉంటుంది. ఓల్డ్ జనరేషన్ సినిమాల్లో వింటేజ్ కార్లను ఉపయోగించడంతో ఆ సినిమాలకే ప్రత్యేక ఆకర్షణ వస్తుంది. వింటేజ్ కార్లు కొత్త కార్లతో సరిపోలని స్టైల్ మరియు పనితీరును అందిస్తాయి.


Click it and Unblock the Notifications








