మోటార్‌సైకిళ్లకు విండ్‌షీల్డ్ ఎందుకు ఉండాలి? దాని ఉపయోగం ఏమిటి?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొన్ని క్రూయిజర్ మరియు ప్రీమియం మోటార్‌సైకిళ్లలో ముందు వైపు హెడ్‌లైట్‌కు ఎగువన విండ్‌షీల్డ్ ఉంటుంది. ఈ విండ్‌షీల్డ్స్ మీ మోటార్‌కిల్‌కు అందమైన రూపాన్ని ఇవ్వడమే కాకుండా, రైడర్‌కు అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవేంటో తెలుసుకుందాం రండి.

మోటార్‌సైకిళ్లకు విండ్‌షీల్డ్ ఎందుకు ఉండాలి? దాని ఉపయోగం ఏమిటి?

వాస్తవానికి అన్ని ద్విచక్ర వాహనాలకు ఈ విండ్‌షీల్డ్ ఆప్షన్ ఉండదు, కానీ ఆఫ్టర్ మార్కెట్ మోడిఫికేషన్ ద్వారా కొన్ని రకాల ద్విచక్ర వాహనాలకు విండ్‌షీల్డ్‌ను అమర్చుకోవచ్చు. తరచూ హైవేలపై ప్రయాణించే వారు మరియు సుదూర ప్రయాణాల కోసం మోటార్‌సైకిళ్లను ఉపయోగించే వారికి ఈ బైక్ విండ్‌షీల్డ్స్ చక్కగా ఉపయోగపడుతాయి.

మోటార్‌సైకిళ్లకు విండ్‌షీల్డ్ ఎందుకు ఉండాలి? దాని ఉపయోగం ఏమిటి?

ఎదురుగాలి నుండి రక్షణ

మోటార్‌సైకిల్‌పై వేగంగా వెళ్తున్నప్పుడు ఎదురుగా వీచే గాలి రైడర్‌ను చాలా ఇబ్బంది పెడుతుంది. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు బైక్‌పై ఎయిర్ డ్రాగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, బైక్‌ను నడిపే రైడర్ తనను ఎవరో గట్టిగా వెనక్కి నెట్టివేస్తున్నట్లుగా భావిస్తుంటారు.

మోటార్‌సైకిళ్లకు విండ్‌షీల్డ్ ఎందుకు ఉండాలి? దాని ఉపయోగం ఏమిటి?

అయితే, బైక్‌లకు విండ్‌షీల్డ్ ఉండటం వలన, అది మీ ముఖం మరియు శరీరాన్ని గాలి నుండి కాపాడుతుంది. ఎదురుగా వీచే గాలికి అడ్డుగా, రక్షక కవచంలా ఉంటుంది. ఫలితంగా, మీరు ఎక్కువ దూరం టూవీలర్ నడిపినప్పటికీ, అంత తేలికగా అలసిపోరు. అలాగే వెన్నునొప్పి వచ్చే అవకాశాలను తక్కువగా ఉంటాయి. మొత్తంమీద, విండ్‌షీల్డ్ వలన మీరు సౌకర్యవంతమైన రైడ్ అనుభూతిని పొందుతారు.

మోటార్‌సైకిళ్లకు విండ్‌షీల్డ్ ఎందుకు ఉండాలి? దాని ఉపయోగం ఏమిటి?

వర్షం నుండి రక్షణ

మోటార్‌సైకిళ్లపై ఉండే విండ్‌షీల్డ్ మిమ్మల్ని కేవలం గాలి నుండి మాత్రమే కాకుండా వర్షం నుండి కూడా రక్షిస్తుంది. భారీ వర్షాల సమయంలో మోటార్‌సైకిల్ నడపటం అంత సులువైన విషయం కాదని మనందరికీ తెలుసు. కానీ అలాంటి సందర్భాల్లో, మోటార్‌సైకిల్‌పై ఉండే విండ్‌షీల్డ్ ఎదురుగా వచ్చే వర్షపు బిందువుల అడ్డుకుని మీ ముఖం మరియు ఛాతీకి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

మోటార్‌సైకిళ్లకు విండ్‌షీల్డ్ ఎందుకు ఉండాలి? దాని ఉపయోగం ఏమిటి?

కీటకాల నుండి రక్షణ

రాత్రి వేళల్లో మోటార్‌సైకిల్‌పై ప్రయాణించేటప్పుడు లైట్ల కాంతికి వచ్చే కీటకాలు, పురుగులు రైడర్‌ని చాలా ఇబ్బంది పెడతాయి. కొన్ని సందర్భాల్లో ఈ కీటకాల కారణంగా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అయితే, మోటార్‌సైకిల్‌పై విండ్‌షీల్డ్ అమర్చబడి ఉన్నట్లయితే ఈ సమస్యను తప్పించుకోవచ్చు. బైక్‌పై ఈ విండ్‌షీల్డ్ చిన్నపాటి రాళ్లు, దుమ్ము, ధూళి మరియు కీటకాల నుండి రక్షణను అందిస్తుంది.

మోటార్‌సైకిళ్లకు విండ్‌షీల్డ్ ఎందుకు ఉండాలి? దాని ఉపయోగం ఏమిటి?

శబ్దం తగ్గింపు

మోటార్‌సైకిల్ నడుపుతున్నప్పుడు మనం రోడ్డుపై ఎక్కువ శబ్దాన్ని వింటుంటాం. హైవేలపై రైడ్ చేస్తున్నప్పుడు గాలి వలన కలిగే శబ్ధం చాలా చిరాకుగా అనిపిస్తుంది. ముఖ్యంగా, టూవీలర్‌పై ఫుల్ ఫేస్ హెల్మెట్ ధరించని వారికి ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే, మోటార్‌సైకిల్‌పై సరైన విండ్‌షీల్డ్ అమర్చడం ద్వారా ఈ శబ్ద తీవ్రత తగ్గుతుంది.

మోటార్‌సైకిళ్లకు విండ్‌షీల్డ్ ఎందుకు ఉండాలి? దాని ఉపయోగం ఏమిటి?

ఈ విండ్‌షీల్డ్ వలన గాలి శబ్దం తగ్గడంతో మీరు బైక్ యొక్క ఇంజన్ మరియు ఇతర శబ్దాలను బాగా వినవచ్చు. దీని వెనుక చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బైక్ ఇంజన్ లేదా సైలెన్సర్ చేసే శబ్ధాన్ని స్పష్టంగా వింటూ రైడ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. అదే సమయంలో, మోటారుసైకిల్ చైన్, వీల్స్ లేదా బ్రేక్‌ల వంటి భాగాలలో ఏమైనా సమస్యలు ఉంటే మీరు సులభంగా గుర్తించవచ్చు.

మోటార్‌సైకిళ్లకు విండ్‌షీల్డ్ ఎందుకు ఉండాలి? దాని ఉపయోగం ఏమిటి?

మైలేజ్ పెరుగుతుంది

మోటార్‌సైకిళ్లపై విండ్‌షీల్డ్ దాని ఓవరాల్ ఏరోడైనమిక్ డిజైన్‌ను మెరుగుపరుస్తాయి. ఇవి రోడ్డుపై గాలి సమర్థవంతంగా అడ్డుకొని, రైడర్ మరియు బైక్‌పై ఎయిర్ డ్రాగ్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా, మోటార్‌సైకిల్‌పై రైడర్ గాలికి ఎదురుగా వెళ్లేటప్పుడు సదరు బైక్ ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా, మోటార్‌సైకిల్ మైలేజ్ కూడా స్వల్పంగా పెరుగుతుంది.

Most Read Articles

English summary
Why We Need To Have Windshield On Motorcycle, Explained. Read in Telugu.
Story first published: Monday, July 26, 2021, 17:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X