భర్త బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా సుజుకి హయాబుసా బైక్ ఇచ్చిన భార్య

జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా, దేశీయ మార్కెట్లో ఇటీవల కొత్త 2021 హయాబుసాను విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలైన ఈ 2021 సుజుకి హయాబుసా ధర 16.40 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త బైక్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది వాహనప్రియులను ఆకర్షించగలిగింది.

భర్త బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా సుజుకి హయాబుసా బైక్ ఇచ్చిన భార్య

సుజుకి హయాబుసా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన సూపర్ బైకులలో ఒకటి. ఈ సూపర్ బైక్‌కు భారతదేశంలో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇటీవల ఈ కొత్త హయాబుసా సూపర్ బైక్‌ను ఒక మహిళ తన భర్తకు పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చింది.

భర్త బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా సుజుకి హయాబుసా బైక్ ఇచ్చిన భార్య

దీనికి సంబంధించిన వీడియో డైనోస్ వాల్ట్‌ అనే యూట్యూబ్‌ ఛానల్ లో అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోలో మొదట సుజుకి హయాబుసా డెలివరీని స్వీకరించడానికి షోరూమ్‌కి వెళుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న హయబుసా బైక్ సిల్వర్ మాట్టే ఫినిషింగ్ కలిగి ఉంటుంది.

భర్త బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా సుజుకి హయాబుసా బైక్ ఇచ్చిన భార్య

షోరూమ్ సిబ్బంది నుండి భార్య బైక్ కీ అందుకుని, దానిని భర్త గగన్ కు అప్పగించారు. గగన్ తన 50 వ పుట్టినరోజు వేడుకలో భాగంగా తన భార్య నుంచి తనకు ఎంతగానో ఇష్టమైన హయాబుసా సూపర్ బైక్ గిఫ్ట్ గా పొందాడు. ఈ సందర్భం అతనికి చాలా ఆనందాన్ని కలిగించినట్లు అతడు చెప్పాడు.

భర్త బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా సుజుకి హయాబుసా బైక్ ఇచ్చిన భార్య

కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన వేళ భారత మార్కెట్లో ఈ కొత్త 2021 హయబుసా విడుదలయ్యింది. ఇంత క్లిష్ట సమయంలో లాంచ్ అయినప్పటికీ కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగింది. కొత్త హయాబుసా బైక్ యొక్క మొదటి బ్యాచ్ లో 101 యూనిట్లను విడుదల చేసింది. ఈ యూనిట్లన్నీ కొన్ని గంటల్లో అమ్ముడైపోయినట్లు కంపెనీ తెలిపింది.

భర్త బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా సుజుకి హయాబుసా బైక్ ఇచ్చిన భార్య

ఈ బైక్ కి ఉన్న అత్యంత ప్రజాదరణ కారణంగా, కంపెనీ దీని సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ 2021 జూలై 1 ప్రారంభించింది. రెండవ బ్యాచ్‌లో హయాబుసా బైక్స్ 100 యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లన్నీ కేవలం ఒక గంటలోనే అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే అధిక ధర కలిగి ఉన్నప్పటికి కూడా మార్కెట్లో ఎంత ఉందో గమనించవచ్చు.

భర్త బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా సుజుకి హయాబుసా బైక్ ఇచ్చిన భార్య

2021 సుజుకి హయాబుసా బైక్‌ 1,340 సిసి లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 187.7 బిహెచ్‌పి శక్తిని, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ మరియు ద్విబై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ కొత్త 2021 హయబుసా సూపర్ బైక్ కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగవంతం అవుతుందని కంపెనీ అధికారికంగా తెలిపింది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 299 కి.మీ వరకు ఉంటుంది.

ఈ కొత్త బైక్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10 లెవెల్స్ అడ్జస్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, యాక్టివ్ స్పీడ్ లిమిటర్, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్, మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్ సిస్టమ్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త టిఎఫ్‌టి డిస్ప్లే సహాయంతో కంట్రోల్ చేయవచ్చు.

భర్త బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా సుజుకి హయాబుసా బైక్ ఇచ్చిన భార్య

ఈ కొత్త మోటారుసైకిల్ 20 లీటర్స్ సామర్థ్యం కలిగిన ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. 2021 హయబుసా ఇప్పుడు మరింత దూకుడుగా కనిపిస్తుంది. అంతే కాకుండా అప్‌గ్రేడ్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీతో చాలా సేఫ్టీగా ఉండటం వల్ల ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది.

Image Courtesy: Dino's Vault

Most Read Articles

English summary
Wife Gifts Husband Suzuki Hayabusa Bike On His Birthday. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X