భర్త ఒడిలో నిద్రపోతున్న భార్య.. వీడియో చాలా రొమాంటిక్‌ కానీ.. ప్రయాణమే ప్రమాదకరం..!!

గతం కంటే సినిమాల ప్రభావం ప్రస్తుత తరం ప్రజలపై ఎక్కువగా ఉంటోంది. సినిమాల్లో ఉన్నట్లుగా, లేదా అందులోని నటులు ప్రవర్తించినట్లుగా తాము కూడా ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మనకి నచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నాం.. అనే అనుకుంటున్నాం. కానీ అవే కొన్నిసార్లు ప్రమాదాలకు కారణం కావచ్చు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఓ కారులో దంపతులు ప్రయాణిస్తున్నారు. భర్త కారు డ్రైవింగ్‌ చేస్తుండగా.. అతని ఒడిలో భార్య నిద్రపోవడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. అయితే ఈ వీడియో చాలా రొమాంటిక్‌గా అనిపించవచ్చు. అందులో ఎటువంటి తప్పు లేదని భావించవచ్చు.

wife sleeps on husbands lap in moving car

ఈ కారు అమెరికన్ తయారీ సంస్థకు చెందిన జీప్‌గా తెలుస్తోంది. జీప్‌ కంపాస్‌, జీప్‌ మెరిడియన్‌ కార్లు భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ జంట ప్రయాణిస్తోంది.. ఈ రెండింటిలో ఏదైనా వాహనం కావచ్చు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. అయితే రోడ్లపై ఇటువంటి ప్రవర్తన చాలా ప్రమాదకరం అని కొందరు హెచ్చరిస్తున్నారు.

డ్రైవింగ్‌ సీట్లో ఉన్న వ్యక్తులకు తన దృష్టి అంతా రోడ్డుపైనే ఉండాలి. అలాంటప్పుడే అకస్మాత్తుగా ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రమాదం బారిన పడకుండా ఉండగలుగుతారు. అయితే డ్రైవింగ్‌ సీట్లో ఉన్న వ్యక్తి ఒక చేత్తోనే కారును నడుపుతున్నారు. కొంతసేపు తర్వాత తన ఒడిలో ఉన్న భార్యను ముద్దుపెట్టుకోవడం ఈ వీడియోలో గమనించవచ్చు.

wife sleeps on husbands lap in moving car

దాంతోపాటు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్‌ చేస్తున్నారు. ఫలితంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యా్గ్‌లు తెరుకుకొనే అవకాశం ఉండదు. ఫలితంగా తమకు ప్రియమైన వారు కూడా గాయపడే అవకాశం ఉంది. ఒకరిమీద ప్రేమ వారిని ప్రమాదంలోకి నెట్టేయకూడదని ఎప్పుడూ గుర్తించుకోవాలి.

అయితే ఇటువంటి ఘటనలు ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయి. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన వైరల్‌ అయింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ జంట హగ్‌ చేసుకొని కనిపించారు. యువకుడు డ్రైవింగ్‌ చేస్తుండగా.. బైక్ ఇంధన ట్యాంకర్‌పైన కూర్చున్న యువతి.. యువకుడిని హగ్‌ చేసుకుంటూ ప్రయాణం చేశారు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్‌ అయింది.

wife sleeps on husbands lap in moving car

ఈ ఘటన ఢిల్లీ పోలీసులు దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేపట్టారు. అనంతరం వారిపై రూ.11,000 జరిమానా విధించినట్లు సమాచారం. ఈ తరహా ఘటనలపై దేశవ్యాప్తంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. భారీగా జరిమానాలు వేయడం, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే ఏం చేసినా కొంతమందిలో మార్పు రావడం లేదు. యువత సోషల్‌మీడియా క్రేజ్‌ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

డ్రైవ్‌స్పార్క్‌ వ్యాఖ్య : సినిమాలు, వెబ్‌ సిరిస్‌ల ప్రభావంతో చాలా మంది ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. ఫలితంగా తమకు ఇష్టమైన వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. రోడ్లపై ఇటువంటి ప్రవర్తన ఎప్పుడూ ప్రమాదకరం. ఏదైనా అకస్మాత్తుగా ఎటువంటి వాహనాలు, పశువులు ఎదురొచ్చినా.. వాహనాన్ని నియంత్రించే అవకాశం ఉండదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 25, 2023, 13:25 [IST]
English summary
Wife sleeps on husbands lap in moving car video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+