భర్తకు జావా క్లాసిక్ బైక్ ని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన భార్య

ఇండియన్ మార్కెట్ లో జావా మోటార్ సైకిల్ లు అరుదుగా లభిస్తాయి. జావా మోటార్ సైకిళ్లు గత సంవత్సరం తిరిగి మార్కెట్లోకి ప్రవేశించింది.ఇప్పుడు ఉన్న యువతరం బాగా ఇష్టపడే బ్రాండ్ లలో జావా బైక్ కూడా ఒకటి. ఇది చూడటానికి స్టైల్ గా తయారుచేయబడింది. ఈ మోటార్ సైకిల్ జావా శక్తితో మరియు రిట్రో స్టైలింగ్ తో ప్రతేకంగా తయారు చేయబడింది. జావా బైక్ లో అందరూ బాగా ఇష్టపడే ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమంటే ఇందులో 2-స్ట్రోక్ ఇంజిన్ నుండి వచ్చిన ఎగ్జాస్ట్ నోట్ 4-స్ట్రోక్ ఇంజిన్ ను అనుకరించడానికి అనువుగా తయారు చేయబడింది.

భర్తకు జావా క్లాసిక్ బైక్ ని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన భార్య

జావా మోటార్ సైకిల్ విడుదలైన అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రజాదారంపొందింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే విడుదలైన అనతి కాలంలోనే వీటి స్టాక్ మొత్తం ఖాళీ అయిపోవడమే కాకుండా, ఇంకా మిగిలిన వినియోగదారులు ఈ వాహనాలపై ఆసక్తితో ఎక్కువకాలం కూడా ఎదురుచూస్తూ ఉన్నారు.

భర్తకు జావా క్లాసిక్ బైక్ ని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన భార్య

జావా మోటార్ సైకిల్ గురించి తెలుసుకోవలసిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక భార్య తన భర్తను ఎంతో ఇష్టమైన జావా మోటార్ సైకిల్ బైక్ ని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంది. దీనిని వీడియో తీసి తమ యూట్యూబ్ ఛానల్ అయిన ఓం & ఫ్యామిలి లైవ్ విలేజ్ లైఫ్ లో అప్‌లోడ్ చేశారు.

భర్తకు జావా క్లాసిక్ బైక్ ని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన భార్య

యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో ఒక హోటల్ యొక్క లాబీ లోపల మొదలవుతుంది. ఇందులో భార్య తన భర్త కళ్ళకు గంతలు కట్టుకోమని చెబుతుంది. తరువాత భార్య తన భర్తను హోటల్ బయట ఉన్న పార్కింగ్ స్థలానికి తీసుకెళుతుంది. ఆ సమయంలో భర్త చాలా సంతోషంతో ఉత్సహంగా ఉన్నాడు. ఆ ఉత్సాహం కారణంగా రెండుసార్లు కళ్ళ గుంతలను తొలగించడానికి ప్రయత్నిస్తాడు, కానీ భార్య ఆ పని చేయనీయకుండా ఆపుతుంది.

భర్తకు జావా క్లాసిక్ బైక్ ని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన భార్య

ఆమె చివరకు అతన్నిపార్కింగ్ స్థలానికి తీసుకెళ్ళి కళ్ళకు కట్టిన గంతలను తొలగిస్తుంది. ఒక సెకను అతను తన ముందు కొత్త జావాను గుర్తించలేదు, ఆశ్చర్యంతో దేనికోసమో తీవ్రంగా వెతుకుతున్నాడు. అతని మనస్సులో ఏదో చిన్న బహుమతి గురించి ఆలోచిస్తున్నాడు. కానీ అతను తన భార్య నుండి ఇంత గొప్ప బహుమతితో ఆశ్చర్యాన్ని లోను చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. చివరికి జావా మోటారుసైకిల్ చూసిన తరువాత ఆనందంతో మాటలు ఆగిపోయాయి.

సాధారణంగా అతడు అందరికి అలాంటి బహుమతులు ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేసేవాడు. ఎవరు తనకి ఎప్పుడు సర్ప్రైజ్ బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపరిచినవాళ్లు లేదు కానీ మొదటిసారిగా ఇంతగొప్ప బహుమతి ఇచ్చి తన భార్య ఆశ్చర్యానికి లోనుచేసిందని చాల సంతోషంతో సంబరపడిపోయాడు. మొత్తానికి ఆ భర్త అదృష్టవంతుడు ఎందుకంటే తన భార్య తనకి ఇష్టమైన బైక్ ని బహుమతి ఇచ్చింది.

Read More:ఇండియాలో ప్రారంభించిన యమహా ఫాసినో 125 ఎఫ్ఐ : ధర రూ.66,430 నుండి ప్రారంభం

భర్తకు జావా క్లాసిక్ బైక్ ని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన భార్య

జావా క్లాసిక్ బైక్ డ్యూయల్-ఛానల్ అమర్చిన వెర్షన్. ఇందులో 293-సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ద్వారా 27 బిహెచ్‌పి మరియు 28 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. జావా గత నెలలో కొత్త మోటారుసైకిల్ అయిన జావా పెరాక్ ను విడుదల చేసింది. భవిష్యత్ లో రాబోయే జావా క్లాసిక్ మరియు 42 లు ప్రస్తుతం ఉన్న వెర్షన్ కంటే మరింత శక్తివంతంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీటిలో ఇప్పుడున్నవాటికంటే కొన్ని ప్రేత్యేకతలను సంతరించుకుని విడుదలవ్వబోతోంది.

Source: Live Village Life With Om & Family/YouTube

Most Read Articles

English summary
Wife surprises husband with a Jawa Classic bike gift [Video]-Read in Telugu
Story first published: Friday, December 20, 2019, 10:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X