ఏనుగునే బెదిరించిన ఫారెస్ట్ గార్డ్.. నీ ధైర్యానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే గురూ [వీడియో]

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న దేశం, కావున ప్రతి రోజు అభివృద్ధి వైపు అడుగులు వేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే రోడ్డు మార్గాలు బాగా విస్తరించబడుతున్నాయి. ఈ రోజు మారు మూల ప్రాంతాలకు రోడ్డు సదుపాయాలు ఉన్నాయి అంటే ఏ మాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కొన్ని రోడ్డు మార్గాలు అటవీ ప్రాంతాల గుండా వేయబడి ఉంటాయి. ఇలాంటి రోడ్లమీద చాలామంది ప్రయాణించే ఉంటారు.

ఏనుగునే బెదిరించిన వ్యక్తి.. నీ ధైర్యానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే గురూ [వీడియో]

అటవీ మార్గాలలో వుండే రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సార్లు అడవి జంతువులు ఆ రోడ్లమీదికి వచ్చే అవకాశం ఉంటుంది. అలంటి సందర్భాల్లో అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే ఆవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటన ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఏనుగునే బెదిరించిన వ్యక్తి.. నీ ధైర్యానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే గురూ [వీడియో]

నివేదికల ప్రకారం కేరళకి చెందిన ఒక న్యూస్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలో ఒక అడవి ఏనుగు రోడ్డుపైకి వచ్చింది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆ ఏనుగును అదిలిస్తున్నాడు. ఆ వ్యక్తి ఫారెస్ట్ గార్డు అని తెలిసింది. ఆ ఏనుగు రోడ్డుపైకి వచ్చినప్పుడు ఆ ఫారెస్ట్ గార్డు ఒక స్కూటర్ పైన ఉంటూ ఏనుగుపైన అరుస్తున్నాడు. ఆ సమయంలో ఆ ఏనుగు ముందుకు వెనుకకు కదులుతుంది.

ఏనుగునే బెదిరించిన వ్యక్తి.. నీ ధైర్యానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే గురూ [వీడియో]

ఆ ఫారెస్ట్ గార్డు ఏనుగును అదిలించే సమయంలో ఒక వేళా ఆ ఏనుగు మీదికి వస్తే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో ముందు ఉన్న ఒక వ్యక్తి మొబైల్ కెమెరాలో మొత్తం వీడియో తీస్తున్నాడు. మొత్తం మీద ఆ ఏనుగు చివరికి అడవిలోకి వెళ్ళిపోతుంది. మొత్తం మీద అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఏనుగునే బెదిరించిన వ్యక్తి.. నీ ధైర్యానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే గురూ [వీడియో]

ఆ ఫారెస్ట్ గార్డు తన అనుభవాన్ని కూడా ఈ వీడియోలో పంచుకున్నాడు. ఇందులో ఆ ప్రాంతం గురించి బాగా తెలుసనీ చెప్పాడు. అంతే కాకుండా ఆ ఏనుగు చాలా క్రూరమైనదని చెప్పాడు. అందుకే ఈ ఏనుగును గట్టిగా అదిలిస్తూ ఒక వేళా అది మీదికి వస్తే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. మొత్తానికి ఆ ఏనుగును ఆ ఫారెస్ట్ గార్డు అడవిలోకి పంపించగలిగాడు.

ఏనుగునే బెదిరించిన వ్యక్తి.. నీ ధైర్యానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే గురూ [వీడియో]

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఈ వీడియోను ఆ ప్రాంతపు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్ఓ) కూడా చూసాడు. ఆ తరువాత మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పాడు. ఫారెస్ట్ గార్డ్ ఇటువంటి పరిస్థితులను ఈ విధంగా హ్యాండిల్ చేయడానికి మంచి అనుభవం కలిగి ఉన్నప్పటికీ, పొరపాటున ఆ ఏనుగు మీదికి వస్తే ప్రమాదం జరుగుతుంది. అంతే కాకుండా భవిష్యత్ లో ఇదే విధంగా వేరే వాళ్ళు కూడా ప్రయత్నించే అవకాశం ఉంది. కావున ఈ విధమైన చర్యలు మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పాడు.

నిజానికి అడవుల్లో వుండే ఏనుగులు చాలా ప్రమాదకరం, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉండే ఏనుగులు ఒక సారి ఏదైనా అలజడికి గురైతే ఎదురుగా ఉన్న వారిమీద దాడి చేసే అవకాశం ఉంటుంది. కావున అటవీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుంది.

ఏనుగునే బెదిరించిన వ్యక్తి.. నీ ధైర్యానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే గురూ [వీడియో]

ఇటీవల కర్ణాటకలోని కబిని రిజర్వ్‌ పారెస్ట్ లో ఒక అడవి ఏనుగు బొలెరో కారుని వెంబడిచిన సంఘటన గురించి చదువుకున్నాం. ఇందులో ఆ ఏనుగు ఎంతో కోపంతో బొలెరో కారుని తరుముకుంటూ వస్తోంది. అయితే ఆ సమయంలో బొలెరో డ్రైవర్ ఎంతో నేర్పుగా, ఓపికగా ఏ మాత్రం జంకకుండా చాలా దూరం మిర్రర్ లో చూసుకుంటూ కారుని వెనుకకు డ్రైవ్ చేసుకుంటూ తప్పించుకున్నాడు.

More from DriveSpark

Article Published On: Sunday, November 13, 2022, 14:00 [IST]
English summary
Wild elephant backing off a state highway after being scolded by a forest
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+