ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో]
సాధారణంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో అడవిజంతులు అప్పుడప్పుడు దాడి చేస్తూనే ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే, ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాల వెలుగులోకి వచ్చాయి. అయితే గ్రామాల మీద సరే, రోడ్డుపైన వెళ్లే వాహనాలపైన కూడా ఒక్కోసారి దాడిచేస్తాయి. ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఈ సంఘటనలో ఏమైనా ప్రమాదం జరిగిందా.. అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
![ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో] ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/wild-bison-attacks-autorickshaw1-1663133772.jpg)
నివేదికల ప్రకారం ఈ సంఘటన కేరళలో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ని 'న్యూస్ 18 తమిళనాడు' ఛానల్ షేర్ చేసింది. ఈ ఈడియోలో మీరు గమనించినట్లైతే, ఒక అడవి దున్న రోడ్డుపై వస్తున్న ఒక ఆటో రిక్షాపై దాడి చేసింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు.
![ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో] ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/wild-bison-attacks-autorickshaw2-1663133782.jpg)
రోడ్డుపైన ఆటో రిక్షా వెళ్తున్నపుడు అందులో వెలుగుతున్న ఎల్ఈడీ లైట్లు, మరియు ఆటో లోపల వెలుగుతున్న కలర్ పుల్ లైట్స్ అన్నీ కూడా ఆ అడవి దున్నను భయపెట్టినట్లు అనిపిస్తోంది. ఈ కారణంగానే ఆ అడవి దున్న ఆటోపైన దాడి చేసింది.
ఈ వీడియోలో మొదటి ఆ అడవి దున్న రోడ్డుపై నిలబడి ఉంది, దీనిని గమనించిన ఆటోరిక్షా మెల్లగా ముందుకు కదులుతుంది, దాని వెనుక ఒక కారు కూడా ఉండటం చూడవచ్చు. ఆ సమయంలో రోడ్డుపైన నిలబడి ఉన్న అడవి దున్న ఆటో రిక్షాలో లైట్లకు చిరాకు పడి మెల్లగా ముందుకు ఆచి దాని కొమ్ములతో ఆ ఆటో ని ఒక్కసారిగా పైకి లేపి వదిలింది.
![ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో] ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/wild-bison-attacks-autorickshaw3-1663133793.jpg)
ఆ అడవి దున్న ఆ సమయంలో ఒక్కసారిగా అలా చేయడంతో ఆటో రిక్షాలోని వారందరూ చాలా భయానికి గురై ఉంటారు. అయితే ఆటో రిక్షా బోర్లా పడలేదు, తరువాత ఆ అడవి దున్న అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఒక్క సారిగా దాడికి దిగిన అడవి దున్నను చూసి అందరూ హడలిపోయారు.
![ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో] ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/wild-bison-attacks-autorickshaw4-1663133805.jpg)
ఈ అడవి దున్న వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు, కానీ ఆటో రిక్షా బాగా దెబ్బతినంట్లు తెలుస్తుంది. ఇందులో ఆటో రిక్షా మడ్‌గార్డ్ పూర్తిగా ధ్వంసమైపోయింది. అంతే కాకుండా ఆటో రిక్షా యొక్క విడి భాగాలూ కూడా రోడ్డుపై పడటాన్ని చూడవచ్చు.
![ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో] ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/wild-bison-attacks-autorickshaw5-1663133816.jpg)
నిజానికి అడవి దున్నలు అత్యంత శక్తివంతమైన అడవి జంతుల్లో ఒకటి. ఇది పశువుల జాతికి చెందిన జంతువులు. కావున ఇవి కండలు తిరిగి చాలా బలిష్టంగా ఉంటాయి. అలాంటి జంతువులు దాడి చేస్తే ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు. కాబట్టి వీలైనంతవరకు అలంటి అడవి జంతువులకు దూరంగా ఉండటం చాలా మంచిది. అయితే అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి.
![ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో] ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/wild-bison-attacks-autorickshaw6-1663133825.jpg)
అయితే అడవి మార్గంలో ఉన్న రోడ్లమీద వాహనదారులు ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక వేళా రోడ్డుపైన అడవిజంతువులు ఎదురైతే, వాహనం యొక్క లైట్లు ఆపివేయడం మంచిది. ఒక వేళా లైట్లు లేదా హారన్ వంటి వాటితో ఆ జంతువులను విసిగిస్తే, తప్పకుండా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా దీనిని వాహన దారులు గుర్తుంచుకోవాలి.
![ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో] ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/wild-bison-attacks-autorickshaw7-1663133837.jpg)
అడవి ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఏనుగులు, పులులు, చిరుతలు, విష సర్పాలు వంటివి కూడా రోడ్లమీదికి వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని వాహనదారుడు తప్పకుండా గమనించుకుంటూ.. ఒకవేల కనిపించినా వాటికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ముందుకు సాగిపోవాలి. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
![ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో] ఆగ్రహించిన అడవి దున్న, పైకి లేచి కిందపడిన ఆటో రిక్షా [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/elephant-chases-mahindra-bolero9-1663133902.jpg)
మహీంద్రా బొలెరో వెంట పడిన ఏనుగు:


Click it and Unblock the Notifications








