తక్కువ జీతం వల్ల టొయోటాను విడిచిపెట్టనున్న సీఈఓ?

By Ravi

ఏ కంపెనీలో అయినా మీకు ఇతర కంపెనీలతో పోల్చుకుంటే తక్కువ జీతం ఇస్తుంటే ఏంచేస్తారు? ఏంచేస్తాం, ఈ కంపెనీకు ఎగ్గొట్టి ఆ కంపెనీలో చేరిపోతాం. చిన్న చిన్న ఉద్యోగులే కాదు, కంపెనీల సీఈఓలు సైతం ఇదే చేస్తారు. తాజాగా ప్రపంచపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ అయిన 'టొయోటా మోటార్ కార్పోరేషన్' ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'అకియో టొయోడా' (57 ఏళ్లు), కంపెనీలో తనకు రెమ్యూనరేషన్ తక్కువగా ఇస్తున్నారనే నెపంతో టొయోటా సంస్థను వదిలిపెట్టి వెళ్లిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

టొయోటా అభివృద్ధి చరిత్రలో అకియో టొయోడా కీలక పాత్ర పోషించాడు. జపాన్ సునామీ తర్వాత ప్రపంచపు అగ్రగామి స్థానాన్ని కోల్పోయిన టొయోటాకు తిరిగి ఆ స్థానాన్ని తెచ్చిపెట్టడంలో ఈయన పాత్ర గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. మార్కెట్లో ఎప్పుటకప్పుడు పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగాడు టొయోడా. ఇంత కష్టపడి పనిచేస్తున్న సీఈఓకు జీతం కూడా ఎక్కువగానే ఉంటుందని అనుకుంటే పొరపాటే.

టొయోటా గ్రూపులో కెల్లా అత్యంత తక్కువ జీతం తీసుకుంటున్న ముఖ్య అధికారి అకియో టొయోడా. ఈ కంపెనీ సంస్థపాకుడి మనవడు అయిన టొయోడా జూన్ 2009లో కంపెనీ సీఈఓ పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుండి ఈ సంస్థ లాభాల బాటలో నడుస్తుంది. మరి అకియో టొయోడాకు సంస్థ ఇస్తున్న జీతం ఎంత? ఆ వివరాలు తెలుసుకోవాలంటే, క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించాల్సిందే. ఈయనతో పాటు ఆటోమొబైల్ పరిశ్రమలో వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారులకు ఆయా సంస్థలు ఎంతెంత జీతం చెల్లిస్తున్నాయో కూడా ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

అలన్ ముల్లాలే

అలన్ ముల్లాలే

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ కార్పోరేషన్ సీఈఓ 2012లో తీసుకున్న రెమ్యునరేషన్ 21 మిలియన్ డాలర్లు.

మార్టిన్ వింటర్‌కార్న్

మార్టిన్ వింటర్‌కార్న్

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ సీఈఓ జీతం 14.5 మిలియన్ యూరోలు (19 మిలియన్ డాలర్లు)

డ్యాన్ అకెర్సన్

డ్యాన్ అకెర్సన్

మరొక అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌కు చెందిన డ్యాన్ అకెర్సన్ 11 మిలియన్ డాలర్లను జీతంగా పొందారు.

డీటెర్ జెట్చే

డీటెర్ జెట్చే

డైమ్లర్ సంస్థ సీఈఓ జీతం 8.15 మిలియన్ యూరోలు (10.6 మిలియన్ డాలర్లు)

కార్లోస్ ఘోస్న్

కార్లోస్ ఘోస్న్

జపనీస్ ఆటో మేజర్ నిస్సాన్ మోటార్ కో. సీఈఓ కార్లోస్ ఘోస్న్ సీఈఓ రెమ్యునరేషన్ 10 మిలియన్ డాలర్లు

అకియో టొయోడా

అకియో టొయోడా

టొయోటా మోటార్ కార్పోరేషన్ అకియో టొయోడా సీఈఓకు చెల్లించింది (1.9 మిలియన్ డాలర్లు) గడచిన సంవత్సరంలో చెల్లించిన దానిపై 35 శాతం పెంపు మాత్రమేనని జపాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫైలింగ్ తెలుపుతోంది.

ఎవరి జీతం ఎక్కువ?

దీన్నిబట్టి చూస్తే, ఇతర కంపెనీల సీఈఓ లతో పోల్చుకుంటే, టొయోటా సీఈఓకు లభిస్తున్న జీతం అత్యల్పమని తెలుస్తోంది. మరి అకియో టొయోడా కంపెనీను వదిలిపెట్టి వెళ్లిపోతారా.. లేక ఇంత తక్కువ జీతంతోనే కంపెనీలో కొనసాగుతారా.. అనేది వేచి చూడాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 25, 2013, 13:32 [IST]
English summary
Ever wondered about the Toyota CEOs salary? We take a look at President & CEO Akio Toyoda's pay-outs. Big question, is Akio Toyoda overpaid? Step right in.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+