నరేంద్ర మోడీ కాన్వాయ్ స్వదేశీనా లేక విదేశీనా?

గడచిన పదేళ్లుగా భారతదేశాన్ని పాలించిన కాంగ్రెస్ వంటి చేతితో ఓడించిన కాబోయే భారత ప్రధానమంత్రి, బిజెపి నేత నరేంద్ర మోడి గడచిన మంగళవారం నాడు బిజెపి పార్లమెంటరీ పార్టీ, ఎన్డీయే సంకీర్ణ కూటమికి నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసినదే. ఇక ఆయన భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టడమే మిగిలి ఉంది.

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడి ఘన విజయాన్ని సాధించడంతో భద్రతాధికారులు ఆయన భధ్రతను ఒక్కసారిగా పెంచేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడి ఓ బుల్లెట్ ప్రూఫ్ మహీంద్రా స్కార్పియో వాహనాన్ని ఉపయోగించారు. అయితే, ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడికి భారతదేశం తరఫున అధికారిక కాన్వాయ్ ఇస్తారు.

ఈ నేపథ్యంలో, నరేంద్ర మోడి తనకు బాగా కలిసొచ్చిన మహీంద్రా స్కార్పియోనే తన అధికారిక వాహనంగా వియోగించుకుంటారా లేక ఇదివరకటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉపయోగించిన కాన్వాయ్‌ని ఉపయోగిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ లోపుగా మనం మోడి స్కార్పియో గురించి ఆయన ఉపయోగించబోయే ప్రధాని కాన్వాయ్ గురించి తెలుసుకుందాం రండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

నరేంద్ర మోడీ కాన్వాయ్ స్వదేశీనా లేక విదేశీనా?

తర్వాతి స్లైడ్‌లలో నరేంద్ర మోడి భద్రతా వాహనాల గురించి తెలుసుకోండి..!

నరేంద్ర మోడీ కాన్వాయ్ స్వదేశీనా లేక విదేశీనా?

సాధారణంగా భారత ప్రధానమంత్రి ఉపయోగించే కాన్వాయ్‌లో 7 బుల్లెట్ ప్రూఫ్ ఎక్స్‌5 ఎస్‌యూవీలు, 5 మోడిఫైడ్ టాటా సఫారీలు మరియు 2 హైలీ మోడిఫైడ్ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కార్లు (మొత్తం 14 వాహనాలు) ఉంటాయి. భద్రతా అంశాల ప్రకారం, నరేంద్ర మోడి ప్రధాని అయిన తర్వాత ఇదే కాన్వాయ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

నరేంద్ర మోడీ కాన్వాయ్ స్వదేశీనా లేక విదేశీనా?

ప్రస్తుతం నరేంద్ర మోడి, ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా పవర్‌ఫుల్ స్కార్పియోని తన అధికారిక వాహనంగా ఉపయోగిస్తున్నారు. ఈ స్కార్పియో పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్‌తో తయారు చేయబడినది.

నరేంద్ర మోడీ కాన్వాయ్ స్వదేశీనా లేక విదేశీనా?

అయితే, నరేంద్ర మోడి భారత ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ స్వదేశీ (మేడ్ ఇన్ ఇండియా) స్కార్పియోనే తన అధికారిక వాహనంగా ఉపయోగిస్తారా లేక విదేశీ (మేడ్ ఇన్ జర్మనీ) బిఎమ్‌డబ్ల్యూ కార్లను ఉపయోగిస్తారా అనేది త్వరలోనే తెలియనుంది.

నరేంద్ర మోడీ కాన్వాయ్ స్వదేశీనా లేక విదేశీనా?

కాగా.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయం మాత్రం, మన కొత్త ప్రధానమంత్రి భారతదేశంలో తయారైన స్కార్పియో వాహనాలను ఉపయోగించడాన్నే కొనసాగిస్తే అది తమకెంతో గర్వకారణంగా ఉంటుందని అన్నారు. పిఎమ్ సెక్యూరిటీ కారుగా స్కార్పియోలో కావల్సిన భద్రతా అప్‌గ్రేడ్స్ చేసేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని అన్నారు.

నరేంద్ర మోడీ కాన్వాయ్ స్వదేశీనా లేక విదేశీనా?

ప్రధానమంత్రి సెక్యూరిటీకి అనుగుణంగా స్కార్పియోలో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో, నరేంద్ర మోడి తన అధికారిక వాహనంగా మేడ్ ఇన్ ఇండియా స్కార్పియోనే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మరో మహీంద్రా ఉన్నతాధికారి కూడా వెల్లడించారు.

నరేంద్ర మోడీ కాన్వాయ్ స్వదేశీనా లేక విదేశీనా?

మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ పవన్ గోయెంకా మాట్లాడుతూ.. ఆయన (నరేంద్ర మోడి) స్కార్పియో వాహనం వినియోగించడాన్ని కొనసాగిస్తే చూడాలని ఉందని, భద్రత అవసరాలను అర్థం చేసుకునేందుకు ఎస్‌పిజితో తాము సంప్రదించాల్సిన అసరం ఉందని ఆయన అన్నారు.

నరేంద్ర మోడీ కాన్వాయ్ స్వదేశీనా లేక విదేశీనా?

చాలా కాలం నుంచి అంబాసిడర్ కార్లనే ప్రధానమంత్రి అధికారిక కాన్వాయ్‌గా ఉపయోగిస్తూ వస్తున్నప్పటికీ, 2003 ప్రాంతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు, భారత ప్రభుత్వం అంబాసిడర్ కార్ల స్థానంలో బిఎమ్‌డబ్ల్యూ కార్లను ప్రవేశపెట్టింది.

నరేంద్ర మోడీ కాన్వాయ్ స్వదేశీనా లేక విదేశీనా?

తీవ్రవాదుల ముప్పు నుంచి ప్రధానిని రక్షించేందుకే ఈ అధునాతన వాహనాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుత ప్రధాని కాన్వాయ్‌లోని బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 వాహనాలను ఎస్‌పిజి బలగాలు ఉపయోగిస్తాయి. బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కార్లలో ఒకదానిలో ప్రధాని కూర్చుకుంటారు. ఇంకొకదానిని డెకాయ్ వెహికల్‌గా ఉపయోగిస్తారు.

నరేంద్ర మోడీ కాన్వాయ్ స్వదేశీనా లేక విదేశీనా?

ఈ కార్లన్నింటినీ ధృడమైన స్టీల్‌తో తయారు చేయబడి ఉంటాయి. బుల్లెట్ దాడులు, బాంబు దాడులను తట్టుకునేలా వీటిని తయారు చేస్తారు. ఈ కార్లలోని అధునాతన సాంకేతిక వ్యవస్థ, అలారమ్ సిస్టమ్‌లు ఉంటాయి.

మరిన్ని హైసెక్యూరిటీ వాహనాలు

మరిన్ని హైసెక్యూరిటీ వాహనాలు

ఇది కూడా చదవండి: మరిన్ని హైసెక్యూరిటీ వాహనాలు

More from DriveSpark

Article Published On: Wednesday, May 21, 2014, 15:58 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+