సెల్ ఫోన్లు వినియోగిస్తే పెట్రోల్ బంకులు నిజంగానే పేలిపోతాయా?

By N Kumar

బండిలో ఇంధనం అయిపోయిన ప్రతిసారీ పెట్రోల్ బంకులకు వెళుతుంటాం. వెళ్లిన ప్రతిసారీ, సెల్ ఫోన్ మాట్లాడటం మరియు వినియోగించడం చేయకూడదని తెలిపే వార్నింగ్ బోర్డులను చూస్తుంటాం. పెట్రోల్ బంకుల్లో సెల్ ఫోన్ వాడకం పేళుడుకు కారణమవుతుందని పెట్రోల్ స్టేషన్ నిర్వాహకులు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తారు.

సెల్ ఫోన్లు వినియోగిస్తే పెట్రోల్ బంకులు నిజంగానే పేళుతాయా...?

ఏదేమైనప్పటికీ పెట్రోల్ బంకుల్లో మొబైల్ ఫోన్ వాడటం ద్వారా పేళుడు సంభవిస్తుందని ఖచ్చితంగా హామీ ఇవ్వలేకపోతున్నారు. మరి పెట్రోల్ బంకులో సెల్ ఫోన్ వాడితో పేళుడు సంభవించడానికి గల కారణాలేంటి....? దీని వెనకున్న అసలు మర్మం ఏమిటో చూద్దాం రండి....

సెల్ ఫోన్లు వినియోగిస్తే పెట్రోల్ బంకులు నిజంగానే పేళుతాయా...?

సెల్ ఫోన్లు పేళుడుకు కారణమవుతాయో లేదో తెలుసుకోవాలంటే... ముందు సెల్ ఫోన్ గురించి కొద్దిగా తెలుసుకోవాలి. విభిన్న చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల సమ్మేళనంతో కూడిన అతి చిన్న ఎలక్ట్రానిక్ డివైజ్ సెల్ ఫోన్.

సెల్ ఫోన్లు వినియోగిస్తే పెట్రోల్ బంకులు నిజంగానే పేళుతాయా...?

సెల్‌ఫోన్ నెట్ వర్క్ టవర్లతో కమ్యూనికేట్ అవుతుంది. ఫోన్‍‌కు మరియు టవర్ల మధ్య వైర్లతో కూడిన కమ్యూనికేషన్ ఉండదు. కాబట్టి, ఈ రెండు ఒకదానితో ఒకటి కమ్యునికేట్ అయ్యేందుకు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలు సహాయపడతాయి. ఈ తరంగాలు పరిమిత రేడియో ఫ్రీక్వెన్సీ మధ్య ప్రయాణిస్తాయి. సెల్ ఫోన్లకు కాల్స్ మరియు మెసేజ్‌లు వచ్చేందుకు ఈ తరంగాలు సహాయపడతాయి.

సెల్ ఫోన్లు వినియోగిస్తే పెట్రోల్ బంకులు నిజంగానే పేళుతాయా...?

ఈ తరంగాలు మంటలు చెలరేగి పెట్రోల్ స్టేషన్లు భారీ పేళుడుకు కారణమవుతాయి. ఏదేమైనప్పటికీ, సెల్ ఫోన్ల కారణంగా పెట్రోల్ స్టేషన్లు పేళిపోయిన సంఘటనలు ఎక్కడా నమోదు కాలేదు. ఇందుకు ప్రధాన కారణం, మంటలు పుట్టించడానికి కావాల్సిన వోల్టేజ్ ఆ ఫోన్లలో బ్యాటరీలలో ఉండదు.

సెల్ ఫోన్లు వినియోగిస్తే పెట్రోల్ బంకులు నిజంగానే పేళుతాయా...?

మొబైల్ రేడియేషన్ ద్వారా మంటలు చెలరేగే సామర్థ్యం లేకపోయినప్పటికీ, ప్రమాదం జరిగిందంటే అది ఖచ్చితంగా వెహికల్ బ్యాటరీ మరియు మొబైల్ ఫోన్ బ్యాటరీలో లోపం ప్రధాన కారణమై ఉంటుంది.

సెల్ ఫోన్లు వినియోగిస్తే పెట్రోల్ బంకులు నిజంగానే పేళుతాయా...?

మొబైల్ ఫోన్ల ద్వారా పెట్రోల్ బంకులు పేళిపోయే అవకాశాలు దాదాపుగా చాలా తక్కువ. కానీ స్టాటిక్ కరెంట్(స్థిర విద్యుచ్ఛక్తి) ఎంత చిన్న పెట్రో వాయువునైనా మండించే స్వభావం ఉంది.

సెల్ ఫోన్లు వినియోగిస్తే పెట్రోల్ బంకులు నిజంగానే పేళుతాయా...?

పెట్రోల్ బంకుల్లో తమ వాహనాల్లో ఇంధన నింపుతున్నపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయినా కూడా ఇంధనం నింపుతున్నపుడు కొంత ఇంధనం ఫ్యూయల్ ఫిల్లర్ మరియు నాజిల్ చుట్టూ వాయు రూపంలో ఉంటుంది. ఇది కనుక మండితే, దగ్గరలో పెద్ద మొత్తంలో ఉండే పెట్రోల్ స్టేషన్ మొత్తాన్ని దహించివేస్తుంది.

సెల్ ఫోన్లు వినియోగిస్తే పెట్రోల్ బంకులు నిజంగానే పేళుతాయా...?

దీని గురించి కొంత మంది నిపుణులు మాట్లాడుతూ, కారులో రీ-ఫ్యూయలింగ్ చేస్తున్నపుడు వెహికల్‌లో నుండి క్రిందకు దిగడం మరియు మళ్లీ వెహికల్‌ లోపలికి వెళ్లేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేస్తున్నపుడు ఆ వ్యక్తి సుమారుగా 60,000 వోల్టుల విద్యుత్ వాహకంగా ఉంటాడు. కాబట్టి, పెట్రోల్ బంకుల్లో క్రిందకు దిగినపుడు మీ మొబైల్ ఫోన్ ఖచ్చితంగా వెహికల్‌లో ఉంచండి.

సెల్ ఫోన్లు వినియోగిస్తే పెట్రోల్ బంకులు నిజంగానే పేళుతాయా...?

పెట్రోల్ బంకుల్లో సెల్ ఫోన్లు వాడటం వలన అగ్ని ప్రమాదం జరగదని తెలుసుకున్నారు. కానీ, మీ వాహనంలో ఇంధనం నింపుతున్నపుడు మీ మొబైల్ ఫోన్ కారులోనే ఉంచి క్రింది దిగడం ఎంతో ఉత్తమం. దీనితో పాటు ఫ్యూయల్ నింపే ప్రతిసారీ పెట్రోల్ స్టేషన్ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి.

Most Read Articles

English summary
Read In Telugu: Will Using Cell Phone In The Petrol Pumps Causes Explosion
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X