శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

భారతదేశంలో ఇప్పటికే శీతాకాలం ప్రారంభమయ్యింది. శీతాకాలంలో ప్రజలు బయట రావడానికి కూడా సంకోచిస్తారు. ఎందుకంటే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కావున ప్రజలు బయటకు రావడానికి ఇష్టపడరు, అయితే ఈ శీతాకాలం కేవలం మనుషులకు మాత్రమే కాకూండా వాహనాలపైన కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. కావున రానున్ను రోజుల్లో వాతావరణం మరింత చల్లబడే అవకాశం ఉంటుంది. కావున మీరు తప్పకుండా మీరు వినియోగించే కార్లపైన తప్పకుండా శ్రద్ద వహించాల్సి ఉంటుంది. కావున శీతాకాలంలో కారుని సంరక్షించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

ఇంజిన్ ఆయిల్:

కారు పనిచేయడానికి ఇంజిన్ ఆయిల్ ఎంత ప్రాధాన్యత వహిస్తుందో అందరికి తెలుసు, కావున కారులోని ఇంజిన్ ఆయిల్ ఎక్కువ రోజులు మార్చకుండా ఉపయోగిస్తూనే ఉంటే అది చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. కావున కారులోని ఇంజిన్ ఆయిల్ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ మార్చుకుంటూ ఉండాలి.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

సాధారణంగా ప్రస్తుతం ఉన్న చాలా ఆధునిక కార్లకు SAE 0W20 లేదా 5W20 గ్రేడ్ ఇంజిన్ ఆయిల్ అవసరం. ఎందుకంటే ఇది అత్యంత శీతల ఉష్ణోగ్రతల విషయంలో కూడా గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. వాహన తయారీదారుచే ఏ నిర్దిష్ట ఉష్ణోగ్రత శ్రేణులు సిఫార్సు చేయబడతాయో తెలుసుకోవడానికి మీ కారు మాన్యువల్‌ని తనిఖీ చేసి, దానికి కావాల్సిన ఇంజిన్ ఆయిల్ ఉపయోగించాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి. కావున కారు వినియోగదారులు తప్పకుండా దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

బ్యాటరీ:

కారు సక్రమంగా పనిచేయడానికి కారులోని బ్యాటరీ కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది, చాలామంది వాహన వినియోగదారులు కారులోని బ్యాటరీ ఎప్పటికీ ఒకే స్థితిలో ఉంటుందని, దానిని మార్చుకోవాల్సిన అవసరం ఉండదని భావిస్తారు. కానీ ఇది చాలా తప్పు. అతి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో అంటే చల్లని వాతావరణ పరిస్థితుల్లో బ్యాటరీ చెడిపోయే అవకాశం ఉంటుంది. కావున ఎప్పటికప్పుడు దీనిపై వాహన వినియోగదారు శ్రద్ధ వహించాలి.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

కారులోని బ్యాటరీ ఎప్పుడూ తుప్పు పట్టకుండా ఉండటానికి బ్యాటరీ లోపల ఎలక్ట్రోడ్ ప్లేట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. తుప్పు పట్టినట్లు ఏవైనా సంకేతాలు కనిపిస్తే వెంటనే మరమ్మత్తులు చేసుకోవాలి. అలా కాకుండా ఏ మాత్రం నిర్లక్యం చేసినా అది పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

విండ్‌షీల్డ్ వైపర్స్:

కారులో ఉండే విండ్ షీల్డ్ గురించి ఇప్పటికే మనం చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే శీతాకాలంలో వీటిపైన కొంత ప్రత్యేక శ్రద్ద వహించాలి. మీరు మంచు వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వైపర్ బ్లేడ్‌లు విండ్‌షీల్డ్‌కు వ్యతిరేకంగా స్తంభింపజేయవచ్చు. కావున ఆ సమయంలో వీటిని జాగ్రత్తగా వినియోగించాలి, అలా కాకుంటే ఇవి చెడిపోయే అవకాశం ఉంటుంది.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

భారతదేశంలో ఈ సమయంలో అతి తక్కువా ఉష్ణోగ్రత నమోదవుతుంది, కావున చలి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మీరు ప్రతి నెలా మీ వైపర్‌లపై సిలికాన్ ఆధారిత స్ప్రేని ఉపయోగించి జాగ్రత్త పడాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే కారులోని వైపర్లు సజావుగా పని చేస్తాయి.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్స్:

మీరు ఉపయోగించే కారులో ఇథనాల్ ఆధారిత ఇంధనాలను ఉపయోగిస్తే, అవి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కొంత మందగించే అవకాశం ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 10°C (50°F) కంటే ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసిస్తుంటే, అత్యవసర పరిస్థితుల్లో మీ కారు ఇంధన ట్యాంక్‌లో తప్పనిసరిగా అదనపు ఇంధనాన్ని ఉంచుకోవాలి. అప్పుడే ఇది సక్రమంగా పని చేస్తుంది. వాహన వినియోగదారులు దీనిని కూడా మర్చిపోకూడదు.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

టైర్ ప్రెజర్:

కేవలం శీతాకాలంలో మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు టైర్ ప్రెజర్ తనికీ చేస్తూ ఉండాలి. అయితే సాధారణ సమయంలో మాత్రమే కాకుండా చలికాలంలో ఈ టైర్ ప్రెజర్ పైన మరింత ప్రత్యేక ద్రుష్టి ఉంచాలి. వాహన వినియోగదారులు ప్రతి నెలా నాలుగు టైర్లలో టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

వాహన వినియోగదారులు కారు యొక్క జాక్ లేదా ఫ్లోర్ పంప్ ద్వారా మీ కారు టైర్‌లను పెంచినప్పుడు వాటి అంతర్గత ఒత్తిడిని పెంచడానికి వాటిని గాలిని తగ్గించే ముందు వాతావరణం చల్లగా ఉందని నిర్దారించుకోవాలి. మొత్తానికి ఎప్పటికప్పుడు కారు యొక్క టైర్ ప్రెజర్ టెస్ట్ చేస్తూనే ఉండాలి.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

ఎయిర్ ఫిల్టర్:

కారు సమర్దవంతంగా పనిచేయడానికి అందులోని ఎయిర్ ఫిల్టర్ చాలా అవసరం. ఎందుకంటే ఒక అడ్డుపడే ఎయిర్ ఫిల్టర్ శీతాకాలంలో మీ ఇంజన్ యొక్క పనితీరుని తగ్గిస్తుంది. ఇలాంటివి జరగకుండా నిరోధించడానికి, క్యాబిన్ లో ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అంతే కాకూండా ఎప్పటికప్పుడు తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలి.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

యాంటీ-ఫ్రీజ్:

వాహన వినియోగదారులు శీతాకాలంలో యాంటీ-ఫ్రీజ్‌ని ఉపయోగించడం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంజిన్ హీటర్ లేని కార్లకు ఇది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఇంజిన్ హీటర్‌లు శీతాకాలంలో మీ ఇంజిన్ నెమ్మదించకుండా ఉండేలా చూసుకోవాలి, తద్వారా ఇంజిన్ పనితీరు సమర్థవంతంగా ఉంటుంది.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

బ్యాటరీ ఛార్జర్:

శీతాకాలం ప్రారంభం వాహన వినియోగదారులకు ఒక పెద్ద సమస్య. ఎందుకంటే శీతాకాలంలో కారులో చాలా సమస్యలు పుట్టుకొస్తాయి. కావున వాహన వినియోగదారులు ఎప్పటికప్పుడు జాగరూకగా ఉండాలి. కారు వినియోగదారులు శీతాకాలం ప్రారంభమయ్యే ముందు మీ కారు బ్యాటరీ సరిగ్గా ఉందా.. లేదా మరియు ఛార్జర్ ఏ స్థాయిలో ఉంది అని తప్పకుండా టెస్ట్ చేసుకోవాలి.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

ఒక వేళా కారులోని బ్యాటరీ సరిగ్గా పనిచేయకపోతే తప్పకుండా కొత్త బ్యాటరీ కొనుగోలు చేయాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ సరిగ్గా లేకపోతే అతి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. కావున దీనిని ఎప్పటికప్పుడు తనికీ చేసుకుంటూ ఉండాలి. బ్యాటరీ ఛార్జర్ సానుకూలంగా ఉంటేనే వాహనం సరైన స్థితిలో పనిచేస్తుంది. దీనిని వాహన వినియోగదారులు విస్మరించకూడదు.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

స్పార్క్ ప్లగ్స్:

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు స్పార్క్ ప్లగ్స్ అనేవి ఫోర్సలైన్ ఇన్సులేషన్లో పగుళ్లను కలిగిస్తుంది. అంతే కాకుండా, కారు పార్క్ చేయబడి ఉంటే ఆ సమయంలో ఇంజిన్ పనిచేయకుండా అయిపోతుంది. కావున కారులోని స్పార్క్ ప్లగ్స్ కూడా ఎప్పటికప్పుడు తనికీ చేస్తూ, ఇందులో ఏమైనా సమస్య అనిపిస్తే తప్పకుండా వాటిని రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

ఆల్టర్నేటర్ బెల్ట్:

కారులోని ఆల్టర్నేటర్ బెల్ట్ కారు యొక్క బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అయితే శీతాకాలం ప్రారంభమైతే వాతావరణంలో ఏర్పడే కొన్ని మార్పులు ఆల్టర్నేటర్ బెల్ట్ పగిలిపోయేలా చేస్తాయి. ఎందుకంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గినప్పుడు వీటిలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ సమయంలో రోడ్డుపైన పనిచేయకుండా నిలిచిపోతే కారు రోడ్డుపై చిక్కుకుపోయేలా చేస్తుంది.

శీతాకాలంలో కార్ వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!

వాహన వినియోగదారులు పైన తెలిపిన అన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి. కేవలం శీతాకాలంలో మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు తనికీ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అప్పుడే కారులో ఏర్పడే సమస్యలు ఎప్పటికప్పుడు నిరోధించి రాబోయే ప్రమాదాలను తొలగించవచ్చు.

Most Read Articles

English summary
Winter car maintainance tips here is what you need to do
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X