చెన్నై టూ సౌదీ.. బైక్ టూర్ ప్లాన్ చేసిన మహిళా రైడర్..!
బైక్ రైడ్ అనగానే భారత్‌లో ఎక్కువగా మనకు యువతే గుర్తుకు వస్తారు. అందులోనూ మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. యువతులు చాలా అరుదుగా బైక్ నడపడం గుర్తించవచ్చు. తాజాగా ఓ యువతి బైక్ రైడ్‌కు (woman bike rider Reshma kasim noor) సిద్ధం అయింది. ఏకంగా చెన్నై నుంచి సౌదీ వెళ్లేందుకు సిద్దమైంది.
చెన్నైకి చెందిన బైక్ రైడర్ రేష్మా కాసిమ్ నూర్.. భారత్ అంతా ఇప్పటికే 9000 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. తాజాగా బైక్‌పై సౌదీ అరేబియాకు వెళ్లాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే బైక్‌పై ఒంటరిగా అనేక యాత్రలు చేశారు. బెంగళూరు సహా మహారాష్ట్రలోని పూణే రద్దీ వీధుల్లో అనేక మైళ్లు ప్రయాణం చేశారు. దాంతోపాటు డామన్, డయ్యూ సుందర అందాలను సైతం ఆశ్వాదించారు.

గుజరాత్, బిహార్‌లోని అనేక చారిత్రక ప్రాంతాల్లో ప్రయాణించారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లోని అనేక రోడ్లపై బైక్ రైడ్ చేశారు. నేపాల్‌లోని ప్రకృతి అందాలను ఆస్వాదించారు. నేపాల్ యాత్రలో ఎన్నో నేర్చుకున్నా అని రేష్మ తెలిపారు. ప్రయాణ సమయంలో డీలక్స్ హోటల్ లేదా రిసార్ట్‌లో బస చేయలేదని, కేవలం గుడారాలు, స్థానికుల ఇళ్లలోనే ఆశ్రయం పొందారని తెలిపారు.
కొన్నిసార్లు పెట్రోల్ బంకుల వద్ద విశ్రాంతి తీసుకున్న ఘటనలు కూడా అనేక ఉన్నాయి. అయితే ఒంటరిగా బైక్‌పై రైడింగ్ చేస్తున్న ధైర్యాన్ని అందరూ తప్పకుండా మెచ్చుకోవల్సిందే. ఈ సందర్భంగా తన లక్ష్యాలను రేష్మా తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించడం తన ప్రయాణం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

* భారత్‌లో క్రికెట్ తర్వాత ఫుట్ బాల్‌కు తెగ క్రేజ్ ఉంది. ముఖ్యంగా కేరళలో అధికంగా ఫుట్‌బాల్ అభిమానులున్నారు. గత ఫిఫా పుట్‌బాల్ ప్రపంచ కప్ మ్యాచ్‌ను చూసేందుకు భారత కుటుంబం ఏకంగా టయోటా కారులో కేరళ నుంచి ఖతార్‌కు ప్రయాణం చేసింది. ఇలా సుమారు 30 రోజుల పాటు ప్రయాణం చేసి ఖతార్‌కు చేరుకున్నారు.
* హీరో అజిత్‌కుమార్‌కు బైక్ టూర్‌లు అంటే చాలా ఇష్టం. అనేక ప్రాంతాల్లో బైక్ టూర్‌లో స్వయంగా పాల్గొన్నారు. తన ఆసక్తినే వ్యాపారంగా మార్చుకున్నారు. వీనస్ మోటార్ సైకిల్ టూర్స్‌ను ప్రారంభించారు. తొలి దశలో భారత్, యూఏఈ, ఒమన్, థాయ్‌లాండ్, న్యూజిలాండ్ దేశాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తుందని ప్రకటించారు. బైక్ రైడర్‌లు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు సాయం చేస్తామని తెలిపింది.

బైక్ టూర్లకు వెళ్లాలనుకొనే వారికి వీనస్ మోటార్‌సైకిల్ టూర్స్ సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్రోగ్రాంలో బైక్ రైడర్‌లతోపాటు సంస్థ ఉద్యోగులు కూడా పాల్గొంటారు. వీనస్ మోటార్ సైకిల్ టూర్స్ సంస్థ.. రైడర్‌లకు ప్రపంచంలోనే అందమైన ప్రాంతాల్లో పర్యటించే అవకాశం కల్పిస్తుంది. మరియు రైడ్‌ర్‌లకు మెరుగైన శిక్షణ ఇస్తుంది.
రైడ్‌లకు మంచి మార్గాలను ఎంచుకొని, ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అంతిమంగా మైరుగైన రైడింగ్ అనుభూతిని పొందేలా ఏర్పాట్లు చేస్తుంది. సంస్థ తరఫున అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుంది. బైక్ రైడర్‌లకు మోటార్‌సైకిళ్లు అద్దెకు తీసుకోవడం, పర్యాటనలకు అవసరమైన అంతర్జాతీయ అనుమతుల పొందేందుకు, అవసరమైన పత్రాలు పొందేందుకు ఈ సంస్థ సాయం చేస్తుంది.


Click it and Unblock the Notifications








