ఎండలు ఎంతలా మండుతున్నాయంటే.. కారుపై రొట్టెలు కాల్చుకుని తినేంతలా..: వైరల్ వీడియో

దేశంలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో వేసవి వేడి, థర్మామీటరుపై పాదరసాన్ని 45 డిగ్రీల మించు పరుగులు తీయిస్తోంది. ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే, నాణేనికి మరోవైపు అన్నట్లు, ఈ ఎండ వేడి ప్రభావం ఎంతలా ఉందో చూపేందుకు కొందరు విచిత్రమైన పద్ధతులను అవలంభిస్తున్నారు మరియు అందుకు సంబంధించిన వీడియోలో ఇంటర్నెట్‌లో పెడుతున్నారు.

ఎండలు ఎంతలా మండుతున్నాయంటే.. కారుపై రొట్టెలు కాల్చుకుని తినేంతలా..: వైరల్ వీడియో

గతంలో కొన్ని సందర్భాల్లో ఎండలో వంటలు చేయడం, రోడ్డుపై గుడ్డు పగలకొడితే అది ఆమ్లెట్ గా మారడం వంటి సందర్భాలను మనం చూశారం. ఇప్పుడు, ఓ వంటలక్క నేరుగా కారు బానెట్‌పైనే చపాతీలను రుద్ది, దానిపై వేడి వేడిగా వాటిని కాల్చి వడ్డిస్తోంది. ఒడిశాకు చెందిన ఓ మహిళ కారు బానెట్‌పై రొట్టెలు కాల్చిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

ఎండలు ఎంతలా మండుతున్నాయంటే.. కారుపై రొట్టెలు కాల్చుకుని తినేంతలా..: వైరల్ వీడియో

ఈ వీడియోలో ఓ మహిళ మొదట రోటీని చుట్టి, ఆపై దానిని బోనెట్‌పై ఉంచి అటూ ఇటూ తిప్పి కాల్చడాన్ని చూడవచ్చు. సుమారు నిమిషం నిడివి గల ఈ వీడియోలో, అధిక వేడి కారణంగా, రోటీ కారు బానెట్‌పై ఉడకడం ప్రారంభించడాన్ని కూడా గమనించవచ్చు. ఇదంతా ఫన్నీగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం బయటి వాతావరణ పరిస్థితి అలానే ఉంది. చాలా ప్రాంతాల్లో ఎండ కారణంగా ప్రజలు కూడా అస్వస్థతకు గురవుతున్నారు.

ఎండలు ఎంతలా మండుతున్నాయంటే.. కారుపై రొట్టెలు కాల్చుకుని తినేంతలా..: వైరల్ వీడియో

ఇక తీరప్రాంతమైన ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. ఇలాంటి ఎండలో, బయట పార్క్ చేసిన లోహపు వాహనాలు సైతం నిప్పు కణికలా మారిపోతున్నాయి. ఎండలో పార్క్ చేసిన కారుపై చేతులు ఉంచితే, కాలిన గాయాలు కూడా అయ్యే ప్రమాదాలు ఉన్నాయి.

ఎండలు ఎంతలా మండుతున్నాయంటే.. కారుపై రొట్టెలు కాల్చుకుని తినేంతలా..: వైరల్ వీడియో

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో, నెటిజన్లు కూడా రకరకాల ఫన్నీ కామెంట్‌లు చేస్తున్నారు. ఒక నెటిజెన్ అయితే ఇలా వ్రాశారు, "రోటీ మాత్రమే కాదు, కారుపై దాల్ మరియు సబ్జీని కూడా తయారు చేయవచ్చు" అని. అదే సమయంలో, మరొక యూజర్ ఇప్పుడు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నందున, మనం కారుని సోలార్ కుక్కర్‌గా ఉపయోగించవచ్చు అని కామెంట్ చేశారు. కాగా, ఎండలో పార్క్ చేసిన బైక్ సీటును తాకడంతో ఓ వ్యక్తి చేయి కాలిందని కూడా పోస్ట్ చేశారు.

ఎండలు ఎంతలా మండుతున్నాయంటే.. కారుపై రొట్టెలు కాల్చుకుని తినేంతలా..: వైరల్ వీడియో

వేసవిలో వాహనాలను చల్లగా ఉంచుకోవడం ఎలా..?

వేసవిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు మీ కారు లేదా బైక్ పార్కింగ్‌ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కారును ఎక్కువసేపు పార్క్ చేయాలనుకుంటే, దానిని షెడ్ కింద కానీ లేదా ఎండ తక్కువగా ఉండే లేదా చెట్టు నీడలో కానీ పార్క్ చేయండి. ఇలాంటి వాతవరణంలో మీ కారును ఓపెన్ స్కై కింద పార్క్ చేయడం మంచిది కాదు. ఇలా చేయడం వలన కారు లోపల వేడి గాలి అధికం అవుతుంది మరియు ఏసి త్వరగా పనిచేయడానికి కూడా సాధారణం కన్నా ఎక్కువ సమయం పడుతుంది.

ఎండలు ఎంతలా మండుతున్నాయంటే.. కారుపై రొట్టెలు కాల్చుకుని తినేంతలా..: వైరల్ వీడియో

ఇదే విషయం టూవీలర్లకు కూడా వర్తిస్తుంది. ఎండలో బైక్ సీట్లు చాలా వేడిగా మారుతాయి, అలాంటి వాటిపై వెంటనే కూర్చోవడం వలన కాలిన గాయాలు కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, టూవీలర్లను నీడలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి. అలా కుదరని పక్షంలో బైక్ కవర్లను ఉపయోగించండి. లేదా వేసవి కోసం ప్రత్యేకంగా లభించే సీట్ కవర్లను ఉపయోగించండి. వేడిగా ఉండే సీటుపై నీరు పోసి, పొడి క్లాత్ తో తుడవండి, అలా చేయడం వలన కారు సీటు కాస్తయినా చల్లబడే అవకాశం ఉంటుంది.

కార్లలో సన్ షేడ్స్ ఉపయోగించడం కూడా మంచిదే. మనదేశంలో రోడ్లపై తిరిగే కార్లకు నల్లటి సన్ ఫిల్మ్స్ (టింట్స్) ఉపయోగించడం నిషేధించబడింది కాబట్టి, వాటి స్థానంలో బయటి మార్కెట్లో దొరికే నాణ్యమైన కర్టెన్స్ లేదా సన్ షేడ్స్ ను ఉపయోగించండి. నిజానికి విండో టింటింగ్ కారణంగా బయటి వేడి లోపలికి ప్రవహించకుండా, కారు లోపల ఏసి త్వరగా వ్యాపిస్తుంది. అయితే, మనదేశంలో కారు అద్దాలకు సన్ ఫిల్మ్ వాడకం నిషేధం కాబట్టి, ఇందుకు చక్కటి ప్రత్యామ్నాయం బయటి మార్కెట్లో లభించే ఇలాంటి సన్ షేడ్స్, సన్ షేడ్ కర్టెన్స్ మొదలైనవి.

ఎండలు ఎంతలా మండుతున్నాయంటే.. కారుపై రొట్టెలు కాల్చుకుని తినేంతలా..: వైరల్ వీడియో

ఇంజన్ కూలెంట్ ను తరచూ చెక్ చేసుకోండి. ఈ వేసవిలో మనం మాత్రమే చల్లగా ఉంటే సరిపోదు, కారు కూడా చల్లగా ఉండాలి. సమ్మర్‌ లో కారు ఇంజన్‌ను చల్లగా ఉంచడం చాలా అవసరం. సాధారణంగా ఇంజన్లు ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి. కానీ వేసవి సమయంలో బయటి వేడి కారణంగా ఇంజన్ మరింత ఎక్కువ వేడిగా తయారవుతుంది. కాబట్టి, ఈ సమ్మర్‌ లో మీ కారు ఇంజన్ ను చల్లగా ఉంచుకునేందుకు అందులో తగినంత కూలెంట్ ఉండేలా చూసుకోవాలి. సమ్మర్ సీజన్ కోసం ప్రత్యేకమైన స్మార్ట్ కూలెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి ఏసిని సమర్థవంతంగా పనిచేసేలా చేయడంలో కూడా సహకరిస్తాయి.

More from DriveSpark

Article Published On: Sunday, May 1, 2022, 14:00 [IST]
English summary
Woman cooks roti on car bonnet in hot summer video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+