ఫేస్‌బుక్‌లో సెల్ఫీ ఫొటో పెట్టిన క్షణాల్లోనే మహిళ మృతి!
ప్రస్తుతం సెల్ఫీ ఫొటో హాట్ ట్రెండ్‌గా మారిపోయింది. మొబైల్ ఫోన్లు, కెమరాలతో ఎవ్వరీ సాయం అవసరం లేకుండానే తామే స్వయంగా ఒకచేతిలో కెమెరాను ముఖానికి దూరంగా ఉంచుకొని ఫొటో తీసుకోవడాన్ని సెల్ఫీ అంటారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సెల్ఫీ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది.
ఆయా సోషల్ నెట్‌వర్క్‌లలో ఖాతాలు కలిగి ఉన్న వారు తాము ఏ స్థితిలో ఉన్నామో అనేది కూడా మర్చిపోయి సెల్ఫీ ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్న పరిస్థితి. ఈ సెల్ఫీ ఫీవర్ తాజాగా ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది. అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో ఓ 32 ఏళ్ల మహిళ సెల్ఫీ ఫొటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయింది.
పోలీసులు విచారణ ప్రకారం, తాను కారు నడుపుతుండగా సెల్ఫీ ఫొటో తీసి ఫేస్‌బుక్ అప్‌లోడ్ చేసిందని, అలా చేస్తున్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డుపై గిరికీలు కొట్టుకొంటుపోయి ఎదురుగా ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని, ఆ తర్వాత వెంటనే కారులో మంటలు అలముకున్నాయని పోలీసుల విచారణంలో వెల్లడైంది.

ఆ సమయంలో కారు ట్రక్కును ఢీకొట్టడంతో, ట్రక్కు కాస్తంత ముందుకు వెళ్లి చెట్టును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడగా, కారును నడుపుతున్న మహిళ మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఆ సమయంలో తాను ఫేస్‌బుక్‌లో సెల్ఫీ ఫొటో ఫోస్ట్ చేసి, దానికి 'సంతోషమైన పాట నన్ను సంతోషానికి గురి చేస్తోంద'నే కామెంట్ కూడా పెట్టింది.
ప్రమాద సమయంలో కారు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తోందని పోలీసుల విచారణలో తేలింది. అంతవేగంతో కారు అదుపుతప్పడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, ఇందుకు ప్రధాన కారణం ఆమె నిర్లక్ష్యమేనని పోలీసు పేర్కొన్నారు. డ్రైవింగ్‌లో టెక్స్టింగ్ చేస్తే ఏమౌంతుందో వివరించే వీడియోని ఇక్కడ వీక్షించండి.
ఫొటో మూలం: ఫేస్‌బుక్


Click it and Unblock the Notifications








