కారు తిప్పుకునే స్థలం దొరకలేదా? ఏకంగా రైల్వే పట్టాలపై డ్రైవింగ్.. యువతి కారణంగా రైళ్లకు తీవ్ర అంతరాయం!
ఇటీవలి కాలంలో దేశంలో పలు చోట్ల రైలు పట్టాలపై బైకులు, కార్లను నడుపుతున్న ఘటనలు తరుచుగా వింటున్నాం. అలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలో చోటుచేసుకుంది. తాజాగా ఓ యువతి, తన కారును సాదారణ రోడ్డుపై కాకుండా నేరుగా రైలు పట్టాలపై నడిపిస్తూ వెళ్లింది. దీంతో ఈ రూట్లో ప్రయాణించాల్సిన రైళ్లను గంటల తరబడి నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన, స్థానికులను, రైల్వే అధికారులను, ప్రయాణికులను ఒకింత ఆందోళనకు గురిచేసింది. నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి దిశగా ప్రయాణిస్తున్న ఓ యువతి తన కారును రైలు పట్టాలపై నడిపింది. ఇది చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇది గమనించిన వారు వెంటనే ఆమెను ఆపడానికి యత్నించారు.
స్థానికులు, రైల్వే సిబ్బంది ఎంతగా అరిచినప్పటికి వారి మాటలు పట్టంచుకోకుండా పట్టాలపై కారుతో వెళ్లింది. చివరికి కారు ఆగిన తరువాత ఆమెను అక్కడి స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. యువతి చేసిన నిర్వాకం కారణంగా ఆ మార్గంలో రాకపోకలు సాగించే అన్ని రైళ్లను వెంటనే నిలిపివేశారు. ప్రధానంగా బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే అనేక రైళ్లు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆమె ప్రవర్తన రైల్వే రాకపోకలను ఒక్కసారిగా అడ్డుకుని, ప్రయాణికులను, అధికారులు, స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సమాచారం ప్రకారం, ఈ ఘటనలో రైల్వే పట్టాలపై కారును నడిపిన యువతి ఉత్తరప్రదేశ్‌కి చెందిన రబిక సోనీగా గుర్తించారు. ఆమె వయసు 34 సంవత్సరాలు. లక్నో ప్రాంతానికి చెందినవారు అని పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసినట్లు తెలుస్తుంది.
ఆమెను అదుపులోకి తీసుకున్న తరువాత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా అక్కడి వారిని ఇబ్బంది పెట్టారు.పట్టాలపై కారును నిలిపిన తర్వాత, అక్కడున్న కొంతమంది స్థానికులతో వాగ్వాదం కూడా చేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రజలు ఈ విచిత్ర ఘటనను తమ మొబైల్ ఫోన్‌లలో వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో, ఈ సంఘటన వైరల్‌గా మారింది. పోలీసులు ఆమెను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విచారణ కొనసాగుతున్నప్పటికీ, యువతి నుంచి ఇంకా స్పష్టత లేని మాటలే వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు. మహిళ ఎలా ట్రాక్‌పైకి వెళ్లింది? ఎందుకు వెళ్లింది? అన్నదానిపై ఇప్పుడు విచారణ ముమ్మరంగా సాగుతోంది. 34 ఏళ్ల రబిక సోనీ మద్యం లేదా మత్తు పదార్థాలను తీసుకున్నదా? లేదా ఆమెకు మానసిక స్థిరత్వ సమస్యలు ఉన్నాయా? అని తెలుసుకుంటున్నారు.
ఈ అంశాలపై పోలీసు దళాలు మెడికల్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి యువతి గురించి ఇంకా పూర్తి సమాచారం లభించాల్సి ఉంది. కుటుంబ నేపథ్యం, ఆమె తెలంగాణకు ఎలా వచ్చింది, ఎందుకు ఈ పరిణామానికి దారి తీసింది వంటి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆ యువతి చేసిన నిర్వాకం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








