ఇలాంటి వాళ్ళవల్లే కదా ప్రమాదాలు జరిగేది!.. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది

ర్యాష్ డ్రైవింగ్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది మగవాళ్లే.. కానీ ఇటీవల వెల్లడైన ఒక వీడియోలో యువతి రోడ్డుపై వ్యతిరేకంగా కారు డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

యూట్యూబ్‌లో వైరల్ అయిన ఒక వీడియోలో ఓ మహిళ టాటా హెక్సా కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తోంది. వీడియోలో గమనించినట్లయితే.. ఆమె గంటకు 80 కిమీ వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆమె కావాలనే కారును రాంగ్ సైడ్ వేగంగా డ్రైవ్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేది ఖచ్చితంగా వెల్లడి కాలేదు. వీడియోలో ఆమె ఎదురుగా కూడా కార్లు రావడం గమనించవచ్చు.

Woman Drives Tata Hexa Dangerously

ఈ సంఘటనలో ఎవరీ ఏ ప్రమాదం జరగలేదు. కానీ ఈమె చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. కారు రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. అనుకోని ప్రమాదం జరిగి ఉండే ఆమెకు మాత్రమే కాకుండా.. ఆమె వల్ల ఇతరులు కూడా ప్రమాదం భారిన పడాల్సి వచ్చేది. వీడియోలో పొగమంచు కూడా కనిపిస్తోంది. ఎదురుగా ఏదైనా వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టి ఉంటే.. ఆ ప్రమాదం ఊహాతీతమే.

టాటా హెక్సా కారును రాంగ్ సైడ్ డ్రైవ్ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేసారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ మహిళ మీద ఎలాంటి ఫిర్యాదు లేకపోవడం గమనార్హం. అయితే జరిగిన సంఘటనకు వీడియో ఆధారం ఉంది కాబట్టి పోలీసులు ఈమె మీద తప్పకుండా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాము. ఆ మహిళ ఎందుకు ఇలా తప్పుగా ప్రవర్తించిందనే కూడా తెలియాల్సిన విషయమే.

Woman Drives Tata Hexa Dangerously

నిజానికి టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడతారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలాంటివి ప్రమాద హేతువులు. ప్రమాదకరమైన స్టంట్స్ చేసి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తే.. ఎక్కువ వ్యూవ్స్ వస్తాయనే నెపంతో కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడేవారిపై పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకోవాలి.

ఇలాంటి సంఘటనలు ఎక్కువగా కేరళ ప్రాంతంలో జరుగుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిన్న నగరాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే.. పోలీసులు సులభంగా వారిని శిక్షించే అవకాశం ఉంది. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు నిర్దేశించిన రోడ్డు మీద సజావుగా ముందుకు సాగాలి. లేకుంటే అనుకోని ప్రమాదాలను ఆహ్వానించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో జరిగే పొరపాట్లు ప్రాణాలను కూడా తీసే అవకాశం ఉంది.

రోడ్డు భద్రతా నియమాల ప్రకారం తప్పకుండా వాహనాలు ఎడమవైపున వెళ్లాయి. జాతీయ రహదారులపైన డివైడర్ వంటివి ఏర్పాటు చేస్తారు. అంటే అవన్నీ సింగిల్ లేన్ రోడ్లు అని అర్థం. అంటే వచ్చే వాహనాలు ఒకవైపు, వెళ్లే వాహనాలు మరోవైపు వెళ్లాయి. ఆలా కాకుండా నియమాలను ఉల్లంఘిస్తే ట్రాఫిక్ ఏర్పడవచ్చు లేదా పెద్ద ప్రమాదమే జరగవచ్చు. కాబట్టి వాహన వినియోగదారులు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటి. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. ఎందుకంటే పోలీసులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నప్పటీ.. వాహనదారుల నిర్లక్ష్యం ప్రమాదాలు జరగటానికి కారణమవుతోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, March 23, 2024, 10:02 [IST]
English summary
Woman drives tata hexa dangerously on wrong side of highway
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+