అమ్మ ప్రేమకు వెలగట్టగలమా.. ఓ చేతిలో బిడ్డ.. మరో చేతిలో ఆటో స్టీరింగ్‌.. వైరల్‌ అవుతున్న వీడియో

అమ్మ ప్రేమకు వెల కట్టగలమా.. దానికి సమాధానం చాలా కష్టమని చెబుతారు. తల్లి స్థానంలో ఉన్న ఏ జీవి అయినా తన బిడ్డ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. వారికోసం ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తుంది. అందుకే అమ్మను దైవంగా భావిస్తాం. ఇక్కడ ఓ తల్లి గురించి మనం తెలుసుకుంటున్నాం.

తన పిల్లలను పోషించేందుకు ఎంతో కష్టపడుతోంది ఇక్కడ ఓ అమ్మ. బతుకు బండిని ఈడ్చడం కోసం తన బిడ్డను ఒడిలో పెట్టుకుని పెద్ద సాహసమే చేస్తోంది. మూడు పూటలా తన బిడ్డకు కడుపు నింపేందుకు మూడు చక్రాల ఆటో రిక్షా నడుపుతూ నెటిజన్ల కంటపడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భావోద్వేగానికి లోనయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Mother-Drives-Auto-Rikshaw

వైరల్ భయాని అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఓ తల్లి తన బిడ్డను చేతిలో పెట్టుకుని ఆటో రిక్షా నడుపుతున్న వీడియోను పోస్ట్‌ చేశారు. దీనికి 'కాప్షన్ అవసరం లేదు.. తల్లీ' అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సదరు మహిళ ఆటో నడుపుతున్న వీడియో ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్నట్లుగా సమాచారం.

ఆటో రిక్షా నడుపుతున్న ఒక మహిళ తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ప్రయాణీకులను రిక్షాలో ఎక్కించుకున్నారు. మధ్యమధ్యలో బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ ఓ చేత్తో బిడ్డను పట్టుకుని మరో చేత్తో స్టీరింగ్ పట్టుకుని ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నారు. రోడ్డుపై ఆ తల్లి చేస్తున్న సాహసానికి హ్యాట్సఫ్‌ చేయకుండా ఉండలేం.

Mother-Drives-Auto-Rikshaw

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వైరల్ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. తల్లి ప్రేమకు ఫిదా అవుతూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఇది నిజంగా చాలా ప్రమాదకరమైనదని.. ఆమె తన బిడ్డ, ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతోందని ఒకరు కామెంట్‌ చేశారు. ఆ తల్లి ప్రేమకు వ్యతిరేకంగా చెడు ఏమీ జరగదు.. మీ తల్లులను ప్రేమించండని అని మరొకరు వ్యాఖ్యానించారు.

భగవంతుని కంటే తల్లి గొప్పదని, ప్రపంచంలో తల్లి స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇలా డ్రైవింగ్ చేసినందుకు ఆమె లైసెన్సు రద్దు చేయాలని అని మరొకరు అన్నారు. పొరపాటున బండి అదుపు తప్పితే పాప పడిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.

తల్లి తన బిడ్డ కోసం ఇంత కష్టపడటం సామాన్య ప్రజలలో మాత్రమే కాదు.. ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలు కూడా తమ పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తారు. 2018లో న్యూజిలాండ్ మాజీ ప్రధాని జసిందా ఆర్డెర్న్ తన బిడ్డను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి తీసుకొచ్చారు. దీంతో అక్కడ గుమికూడిన ప్రజలు కూడా ప్రశంసలు కురిపించారు.

ఇక్కడ తల్లి తన బిడ్డను ఒడిలో పెట్టుకుని బతుకు బండిని లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భావోద్వేగానికి లోనయ్యారు. భద్రత దృష్ట్యా ఇది పొరపాటు అని చెప్పినా.. చివరకు అమ్మ ప్రేమకు వెల కట్టలేమని చెప్పడంలో ఆలోచించాల్సిన అవసరం లేదు.

ఈ తల్లిని ఈ పరిస్థితిలో చూస్తుంటే.. వారి కుటుంబంలో బతుకు బండిని లాగే బాధ్యత ఆ తల్లిపై మాత్రమే ఉందని అర్థమవుతోంది. ఈ వీడియో వారి కష్టానికి అద్దం పడుతోంది. ఈ తల్లి కష్టాన్ని అర్థం చేసుకుని పెద్దయ్యాక ఆ బిడ్డ తన అమ్మను అపురూపంగా చూసుకోవాలని ఆశిద్దాం.

More from DriveSpark

Article Published On: Wednesday, July 12, 2023, 9:32 [IST]
English summary
Woman driving auto rickshaw with her child in her lap video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+