ఓ వైపు ట్రాఫిక్.. మరో వైపు ఆఫీస్ జూమ్ మీటింగ్.. వైరల్ వీడియో చూసేయండి
దేశంలో విపరీతంగా ట్రాఫిక్ ఎక్కడంటే ఎవరికైనా మొదటగా గుర్తొచ్చేది బెంగళూరు మహా నగరం. బెంగళూరు ట్రాఫిక్ జామ్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ చూస్తుంటాం. ఇక వార్తల్లో కూడా బెంగళూరు ట్రాఫిక్‌కు సంబంధించి చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఇటీవల ఓ సంఘటన కూడా వైరల్ అవుతోంది.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మరోసారి నెట్టింట్లోకి వచ్చాయి. Peak Bengaluru ట్యాగ్‌తో చాలా సంఘటనలు వైరల్ అయ్యాయి. గతంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న బస్ డ్రైవర్.. లంచ్ టైం అవుతుండటంతో సీట్లోనే కూర్చుని భోజనం చేశాడు. మరో చోట ట్రాఫిక్‌లో కారులో కూర్చుని ఓ ఉద్యోగిని పచ్చి బఠాణీలు ఒలిచింది. ఇంకా ఉద్యోగుల విషయం అయితే చెప్పనక్కర్లేదు.

ట్రాఫిక్‌లో ఆఫీస్ కాల్స్ మాట్లాడటం, ఆఫీస్ మీటింగ్స్‌కు హాజరవడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంకా స్కూటర్ రైడ్ బుక్ చేసుకున్నట్లయితే వెనుక కూర్చుని ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండంతో... ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ పెళ్లి కూతురు కారు దిగి.. మెట్రో ఎక్కి మండపానికి చేరుకుంది.
ఈ సంఘటన ఇటీవల చాలా వ్యూస్‌ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మహిళా ఉద్యోగి.. బెంగళూరు రోడ్లపై ఆఫీస్‌కు స్కూటర్‌పై వెళ్తూ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఓ వైపు ఆఫీస్ మీటింగ్‌కు టైం అవుతుండటంతో వేరే దారి లేక.. తన స్మార్ట్ ఫోన్ నుంచి జూమ్ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ సంఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియా Xలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. బెంగళూరు స్లో ట్రాఫిక్‌లో మీరు మీ వర్కింగ్ డేను పూర్తి చేయవచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తుండగా.. మరో నెటిజన్.. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారు రెడ్ సిగ్నల్‌ను చూడకుండా రోడ్డుపైనే ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న వారిని చూడవచ్చు అని హాస్యాస్పదంగా కామెంట్ చేశారు.
భారత్‌లో బెంగళూరు ఐటీ హబ్‌గా ఉండటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఈ సిలికాన్ నగరం మకాంగా మారింది. ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిన బెంగళూరు ఇప్పుడు.. తీవ్ర ట్రాఫిక్ జామ్ కారణంగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంకా జనాభా రోజురోజుకీ పెరుగుతుండటంతో ఈ సమస్య కూడా ఎక్కువ అవుతోంది.

అయితే బెంగళూరు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. మెట్రో మార్గాలు, ఫ్లై ఓవర్లు తీసుకువచ్చినప్పటికీ ట్రాఫిక్ ఎక్కడా తగ్గడం లేదు. ఈ క్రమంలో భారీ పొడవైన అండర్ పాస్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు కొంత వరకు తీరుతాయని నగర వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








