ఖరీదైన పోర్షే స్పోర్ట్స్ కారులో గడ్డిమోపును తీసుకెళ్లిన మహిళ.. ఇదెక్కడి చోద్యమంటూ నెటిజన్ల కామెంట్స్
ఇటీవల ఖరీదైన లగ్జరీ కార్లను రోడ్లపై తిరగడానికే కాదు.. వాణిజ్య పరంగా, వ్యవసాయ అవసరాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు. కాస్ట్లీ కారులో ఇంటి భోజనం విక్రయించడం, చేపలు అమ్మడం, ఆకుకూరలు తీసుకెళ్లడం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కాగా ఇటీవల ఓ మహిళ ఖరీదైన పోర్షే కారులో గడ్డిమోపును తీసుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది.
సాధారణంగా వ్యవసాయ అవసరాల కోసం ట్రాక్టర్‌ను ఉపయోగిస్తారు. ఊళ్లలో మోపెడ్, బైక్‌లాంటి టూ వీలర్లపై గడ్డి మోపు, పత్తి బస్తాలు, ఇతర వ్యవసాయ సామగ్రి తీసుకెళ్లడం చూస్తుంటాం. వ్యవసాయానికి ఇవి అనుగుణంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కార్లలో అది కూడా ఖరీదైన కార్లను వ్యాపార అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ స్టోరీ చదివాక ఇక వ్యవసాయ అవసరాల కోసం కూడా వినియోగిస్తారేమో..

పోర్షే బాక్స్‌స్టర్(Porsche 718 Boxster) బిలియనీర్లకు ఇష్టమైన కార్ మోడళ్లలో ఒకటి. సెలబ్రిటీలకు ఇది ఫేవరెట్ కారు. చాలా మందికి ఇది కలల కారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం ఈ కారును వేరే అవసరాల కోసం ఉపయోగించారు. సమాజంలో తమను తాము ఓ స్థాయి వ్యక్తిగా చూపించుకునేందుకు చాలా మంది ఈ కారు ఉపయోగిస్తారు. కానీ ఈ రైతు మాత్రం పశుగ్రాసం తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కాగా ఈ కారును ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలో జరిగినట్లుగా సమాచారం. ఓ మహిళా రైతు ఖరీదైన పోర్షే కారు దిగి గడ్డి మోపును కారు బూట్ స్పేస్‌లో నుంచి తీసి తన ఇంటి వద్ద పడేసింది.

కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో వాహన ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంత ఖరీదైన కారులో గడ్డిమోపు ఎలా తీసుకెళ్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు వ్యవసాయం లేకపోతే తిండి ఉండదని.. దీనిని అవమానకరంగా తీసుకోవద్దని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
అయితే ఇలాంటి కారును వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించడం సరికాదని గమనించారు. దేశంలో పశుగ్రాసం మరియు వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడానికి ప్రత్యేక వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ట్రాక్టర్లు లేదా పికప్ ట్రక్కులను ఉపయోగించుకోవచ్చు. వీటి ద్వారా ఎంత లోడ్ అయినా తీసుకెళ్లే సదుపాయం ఉంటుంది.

కాగా ఈ రైతు ఉపయోగిస్తున్న కారు స్పోర్ట్స్ కార్ మోడల్ పోర్షే 718 బాక్స్‌స్టర్. ఇందులో GTS ఇంజన్‌ని ఉపయోగించారు. దీని టార్క్ కెపాసిటీ 430 NM. ఈ కారు PDK డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాగా ఈ కారు కేవలం 4.5 సెకన్ల వ్యవధిలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 293 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
ఈ పోర్షే కారు ధర రూ. 1.52 కోట్లు పైమాటే.. ఇంత మెరుపు వేగంతో దూసుకెళ్తున్న కారును పశుగ్రాసం లోడ్ చేసేందుకు మహిళా రైతు వినియోగిస్తుండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. తాజాగా కేరళ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రైతు తాను పండించిన కూరగాయలను రోడ్డు పక్కన విక్రయించడానికి తన ఖరీదైన ఆడి కారును ఉపయోగించారు.


Click it and Unblock the Notifications








