Rapido రాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు, బైక్ నుంచి దూకిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో.. కేసు నమోదు..!
రాపిడో, ఓలా, ఉబెర్ వంటి కంపెనీలు చాలా వరకు అన్ని తమ వినియోగదారుల కోసం అనేక సేఫ్టీ మెజర్స్ చేపట్టినా.. కొందరి అత్యుత్సాహం ఆ సంస్థలకు చెడ్డ పేరును తీసుకువస్తున్నాయి. కొందరు రైడర్లు మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు నిత్యం వార్తల్లో చూశాము. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది.
ఇదివరకు చాలా సందర్భాల్లో లైంగిక వేధింపుల అభియోగాలతో పలువురు డ్రైవర్లు(కెప్టెన్స్) కేసులు కూడా నమోదయ్యాయి. వివిధ సంఘటనల్లో భయంకర అనుభవాలను మహిళా ప్రయాణికులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సంఘటనలను తగ్గించేందుకు నాలుగు అంచెల భద్రతను సంస్థలు వినియోగిస్తున్నాయి. అయినా ఇవి జరుగుతుండటం కలవరపెడుతున్నాయి.

రాపిడో బైక్ కెప్టెన్ లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవడానికి కదులుతున్న రాపిడో మోటార్ సైకిల్ నుంచి ఓ మహిళ దూకిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆ మహిళ బైక్ నుంచి దూకిన విజువల్స్ సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యాయి.
బెంగళూరులో ఏప్రిల్ 21న ఇందిరానగర్ లోని తన ఇంటికి వెళ్లేందుకు ఓ 30 ఏళ్ల మహిళా ఆర్కిటెక్ట్ రాపిడో బైక్ ను బుక్ చేసుకుంది. తర్వాత అక్కడకు చేరుకున్న దీపక్ రావు అనే బైక్ కెప్టెన్ ఆ మహిళ ఉన్న లొకేషన్ కు వచ్చి ఓటీపీ చెక్ చేయాలని చెప్పి ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. కాసేపు అక్కడ ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు.

అదే విధంగా యాప్ లో పేర్కొన్న మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ నెంబరు తన లొకేషన్ కు వచ్చిన మోటార్ సైకిల్ కు భిన్నంగా ఉన్నాయని ఆమె గ్రహించింది. అయితే తర్వాత జరిగిన సంభాషణ ఆధారంగా బైక్ ట్యాక్సీ ఎక్కేందుకు మహిళ అంగీకరించింది. కాసేపటికే ఊహించని విధంగా జరిగిన సంఘటన ఆమెను నివ్వెరపోయేలా చేసింది.
బైక్ పై వెళ్తుండగా ఇందిరానగర్ లోని తన డ్రాపింగ్ లొకేషన్ కు కాకుండా దొడ్డబల్ పురా వైపు బైక్ ని మళ్లించడంతో ఆశ్చర్య పోయింది. ఎందుకు ఇటు తీసుకెళ్తున్నావని మహిళ అతన్ని ప్రశ్నించగా దానికి స్పందించలేదు. దీంతో ఆమెలో మరింత భయాందోళన చెందింది. ఆ కొద్ది సేపటికే తన ఫోన్ ను తిరిగి లాక్కోవడానికి రైడర్ ప్రయత్నించాడు. మరోసారి ఫోన్ ని మళ్లీ లాక్కొని మోటార్ సైకిల్ వేగాన్ని పెంచాడు. దీంతో ఏదో జరగబోతుందని గ్రహించిన తాను వెంటనే తప్పించుకోవాలని భావించింది.
బైక్ ట్యాక్సీ రైడర్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని మహిళ పేర్కొంది. తనను తాను రక్షించుకునేందుకు బీఎంఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ సమీపంలో కదులుతున్న మోటార్ సైకిల్ పై నుంచి దూకినట్లు చెప్పింది. ఈ ఘటన ఇన్ స్టిట్యూట్ వెలుపల ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. బైక్ ట్యాక్సీ రైడర్ అక్కడి నుంచి పారిపోగా, మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై మహిళా ఫిర్యాదు చేయగా వెంటనే ఏప్రిల్ 23న దీపక్ రావును అరెస్టు చేశారు. ఆ రైడర్ పై కిడ్నాప్, లైంగిక దాడి, మహిళ గౌరవానికి భంగం కలిగించడం, గాయపరచడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన జరిగినప్పటికీ రాపిడో ఆ మహిళను సంప్రదించలేదు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు.

గత ఏడాది బెంగళూరు పోలీసులు 100కు పైగా రాపిడో స్కూటర్లను సీజ్ చేశారు. నగరంలో అక్రమంగా చాలా బైక్స్ ని రైడర్లు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో బైక్ ట్యాక్సీలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే బీమా కవరేజీకి అనర్హులుగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా బైక్ ట్యాక్సీ నడిపితే రూ.10 వేల నుంచి రూ 15 వేల వరకు జరిమానా విధించనున్నారు.


Click it and Unblock the Notifications








