మొబైల్ ఫోన్ కోసం మహిళ సాహసం.. మెట్రో ట్రాక్‌పైకి దూకిన కాసేపటికే.!!
ఓ మహిళ తన ఫోన్ కోసం పెద్ద సాహసమే చేసింది. చేతిలో నుంచి పొరపాటున రైలు పట్టాలపై పడిపోయిన తన ఫోన్‌ను తిరిగి పొందడం కోసం పెద్ద రిస్కే చేసింది. ఈ కారణంగా కాసేపు మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అసలేం జరిగింది.. ఈ సంఘటన ఎక్కడ జరిగింది.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా బతకడం కష్టంగా మారింది. జర్నీలో, ఇంట్లో, ఉద్యోగంలో, పనుల్లో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే చేతిలో ఫోన్ లేనిదే రోజు గడవడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా ఫోన్‌కు అతుక్కుపోతున్నారు జనాలు. ఆఖరికి దాని కోసం ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు.

బెంగళూరులోని ఇందిరానగర్ రైల్వే స్టేషన్లో(Woman On Metro Track For Phone) ఓ మహిళ మెట్రో రైలు కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఆమె చేతిలోని ఫోన్ అకస్మాత్తుగా రైలు పట్టాలపై పడిపోయింది. ఆ మెట్రో రైలు పట్టాలు విద్యుదీకరించి ఉన్న సంగతి మనకు తెలిసిందే. దాదాపు 750 కిలోవాట్స్ వోల్టేజ్‌తో ఆ మెట్రో ట్రాక్‌లను రూపొందించారు.
అయితే ఆ మహిళ అది గమనించకుండా పట్టాలపై పడిపోయిన తన ఫోన్ కోసం(Woman Jumps Metro Track) ట్రాక్‌పైకి దూకింది. జనవరి 1 వ తేదీ సోమవారం సాయంత్రం సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో సెక్యూరిటీ పనిలో నిమగ్నమైన ఓ ఉద్యోగి ట్రాక్‌పై మహిళను చూడటంతో వెంటనే కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

దీంతో పెను ప్రమాదం తప్పిందని మెట్రో అధికారులు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ ఆ యువతికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే సాయంత్రం సమయంలో బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్‌లో రద్దీగా ఉంటుంది. ఈ ఘటన కారణంగా దాదాపు 15 నిమిషాల పాటు మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సోమవారం సాయంత్రం 6.40 నుంచి 6.55 గంటల మధ్య 15 నిమిషాల పాటు ప్రయాణికులు స్టేషన్‌లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఫోన్ తీసుకున్న అనంతరం తోటి ప్రయాణికుడి సాయంతో యువతి ప్లాట్‌ఫామ్ పైకి చేరుకుంది. ఆ కాసేపటి తర్వాత రైళ్ల రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి.

కాగా మెట్రో రైళ్ల ప్రత్యేకత వాటి సమయపాలన.. నిర్దేశించిన సమయానికే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటాయి. అందుకే హైదరాబాద్, చెన్నై, ముంబయి, ఢిల్లీ బెంగుళూరు వంటి నగరాల్లో మెట్రో రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బెంగళూరులో విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ చిన్న పెద్దా స్థాయిలో ప్రతి ఒక్కరూ మెట్రో రైళ్లను వినియోగించుకుంటారు.
అలాంటి నగరంలో 15 నిమిషాల పాటు సర్వీసు నిలిచిపోవడం ప్రయాణికులకు అసహనం కలిగించడమే కాకుండా వారి సమయం కూడా వృథా అయింది. కాగా మెట్రో రైలు ట్రాక్‌లు సంప్రదాయ రైల్వే ట్రాక్‌ల మాదిరిగానే ఉంటాయి. కానీ, వీటిలో విద్యుత్ కాస్త ఎక్కువ ఓల్టేజీతో ప్రవహిస్తుంది.
అయితే పట్టాలు బాగా ఇన్సులేట్ చేయబడి ఉంటాయి. ఇది పెద్ద సమస్య కానప్పటికీ, ట్రాక్‌ను దాటే సమయంలో కరెంట్ షాక్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మెట్రో రైల్వే స్టేషన్లలో ట్రాక్‌పై వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తారు. ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తారు.
కాగా భారత్‌లో పట్టాలు దాటే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్లకుండా చాలా మంది ఇలా ట్రాక్ దాటుతూ అవతలి ప్లాట్‌ఫామ్‌కు చేరుకుంటారు. ఇది ప్రమాదకరం. ఇటీవల ఫుట్ ఓవర్ బ్రిడ్జిని చాలా మంది వినియోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ యువతి ప్రమాదాన్ని గుర్తించకుండా ఫోన్ కోసం ఇలా ట్రాక్‌పైకి వెళ్లడం బాధాకరం. అయితే ఆ యువతికి జరిమానా విధించారా అనే సమాచారం అందుబాటులో లేదు.


Click it and Unblock the Notifications








