ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ

రోడ్ల మీద కోపాన్ని ప్రదర్శిస్తే అది మనకే తీవ్ర నష్టాన్ని మిగుల్చుతుంది. క్షణికావేశంలో ఓ ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ

రోడ్ల మీద కోపాన్ని ప్రదర్శించడం అత్యంత ప్రమాదకరం. ఈ పదాలు చాలా కొత్తగా ఉన్నప్పటికీ, మన రోజు వారి ప్రయాణంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. ట్రాఫిక్‌లో హారన్ కొడుతున్నాడని, సిగ్నల్ వద్ద ఇండికేటర్ లేకుండా వెళ్లడం, హైవే మీద మన వాహనం ముందుకు సడెన్‍‌గా ఇతర వాహనం వచ్చినపుడు కోపోద్రిక్తులవుతుంటాం.

ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ

ఇండియన్ రోడ్ల మీద చాలా వరకు మనకు సహించని లేదా ఇబ్బందికర సంఘటనలు ఎదురవుతుంటాయి. ప్రతి దాని పట్ల కోపం పెంచుకోవడం మంచిది కాదు. రోడ్ల మీద కోపాన్ని ప్రదర్శిస్తే అది మనకే తీవ్ర నష్టాన్ని మిగుల్చుతుంది. క్షణికావేశంలో ఓ ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ కథ ఎలా మలుపు తిరిగిందో చూద్దాం రండి....

ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ

అసలేం జరిగింది...?

హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన 35 ఏళ్ల సప్న ఆటో డ్రైవర్‌తో జరిగిన తీవ్ర వాగ్వాదం అనంతరం పట్టరాని కోపంతో వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చేసింది.

ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ

సప్న స్కూటర్ వెళ్లడానికి సరిపడా దారి లేకపోవడంతో వెనకాలే ఆగిపోయింది. తనకు దారవ్వమని ఆటో డ్రైవర్‌ను అడగడంతో ఇద్దరి మధ్య వాదన తారా స్థాయికి చేరుకుంది. అయితే, అక్కడి నుండి వెళ్లిపోయిన సప్న తన భర్త యునిస్ మరియు మరో యువకుడిని వెంటబెట్టుకొచ్చింది.

ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ

ఇరువురి మధ్య వివాదం ముదరడంతో సప్న తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో గురుగ్రామ్‌లోని భవాని ఎన్‌క్లేవ్‌లో నివాసముండే ఆటో డ్రైవర్ సునీల్ కటారియాను కాల్చింది. బుల్లెట్ నుండి తప్పించుకున్న యువకుడి మీద మళ్లీ కాల్పులు జరపడానికి తుపాకీలోకి బుల్లెట్లు లోడ్ చేసింది.

ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ

ఈ వివాదం మొత్తాన్ని అక్కడే ఉన్న యువకులు తమ సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇది కాస్త పోలీసుల దృష్టికి రావడంతో రోడ్డు మీద తీవ్ర కోపాన్ని ప్రదర్శించిన ఈ కుటుంబం ఇప్పుడు కటకటాల పాలయ్యింది.

ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ

ఆటో డ్రైవర్ సునీల్ సంఘటనా స్థలంలో తన మీద దాడికి ప్రయత్నించిన సప్న, ఆమె భర్త మరియు భర్త స్నేహితుడి మీద ఫిర్యాదు చేశాడు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 9ఎ పోలీస్ అధికారులు ఈ ముగ్గురు నిందుతుల మీద ఐపీసీ సెక్షన్ 307, 323 మరియు 337 క్రింది ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ

ఆటో డ్రైవర్ సునీల్ మాట్లాడుతూ...

"తను స్కూటీ మీద వచ్చినపుడు, నేను మా ఇంటి బయట ఫోన్ మాట్లాడుతున్నాను. రోడ్డు మీద నిలబడి ఫోన్ మాట్లాడుతున్నందుకు నా మీద గట్టిగట్టిగా అరిచింది. అక్కడి నుండి వెళ్లిపోయిన ఆమె తన భర్త మరియు మరో వ్యక్తిని వెంట తీసుకొచ్చింది. ఉన్నట్లుండి, తుపాకీని బయటకి తీసి నా మీదకు ఎక్కుపెట్టి కాల్చేసింది." అని చెప్పుకొచ్చాడు.

ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ

సుధీర్ కుమార్, గురుగ్రామ్, సెక్టార్ 9ఎ పోలీస్ అధికారి మాట్లాడుతూ...

ఆటో డ్రైవర్ మీద దాడికి ప్రయత్నించిన ఆ జంటను అదుపులోకి తీసుకున్నము, సప్న మరియు యునీస్‌లను ప్రశ్నిస్తున్నాము. సంఘటనా స్థలంలో ఉపయోగించిన లైసెన్స్ లేని నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నాము. తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నాము.

ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ

రోడ్డు మీద కోపాన్ని ప్రదర్శించడం అత్యంత ప్రమాదకరం

రోడ్డు మీద ప్రయాణిస్తున్నపుడు ఇతరుల కోపాన్ని ప్రదర్శించడం అత్యంత ప్రమాదకరమైన అంశం. దీని వలన మనం ప్రయాణానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రయాణంలో ఉన్నపుడు ఇతరుల చర్యలకు స్పందించడం మరియు రెచ్చిపోవడం ఏ మాత్రం మంచిది కాదు.

ఆటో డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన మహిళ

ప్రయాణంలో ఉన్నపుడు లేదా రోడ్డు మీద ఏదైనా పొరబాటు జరిగినపుడు వీలైనంత వరకు సర్దుకుపోవడానికి ప్రయత్నించండి. లేదంటే సమీపంలోని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. అంతే కానీ, గొడవను తీవ్రతరం చేసి, కోలుకోలేని నష్టాలకు బలికాకండి.

క్షణికావేశంలో ఓ మహిళ ఆటో డ్రైవర్ మీద దాడి చేసి, తుపాకీతో కాల్చడాన్ని ఇక్కడున్న వీడియోలో చూడవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, June 22, 2018, 10:40 [IST]
English summary
Read In Telugu: Woman on scooter shoots at auto rickshaw driver for not giving way
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+